Irumudi Review : మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఇరుముడి’ ఈ నెల 21 న ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని నిన్న విడుదల చేయగా, ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ లోని ప్రతీ ఫ్రేమ్ రవితేజ కం బ్యాక్ ని సూచిస్తుంది. సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆయన అభిమానులకు ఈ సినిమా ఒక మధురమైన జ్ఞాపకం గా మిగిలిపోవడం ఖాయం అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ కాపీ రెడీ అయ్యింది. నిన్న రామానాయుడు స్టూడియోస్ లోని థియేటర్ లో నిర్మాతలు , కొన్ని ప్రాంతాలకు చెందిన బయ్యర్స్ కలిసి ఈ సినిమాని వీక్షించారట.
వాళ్ళ నుండి వచ్చిన టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ మొదటి 30 నిమిషాలు రవితేజ ఫ్యామిలీ ని , వాళ్ళు చేసే పనులను చూపిస్తారట. ఆ తర్వాత కథలోకి తీసుకెళ్తాడని , ప్రీ ఇంటర్వెల్ నుండి క్లైమాక్స్ వరకు సినిమా వేరే లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ని చాలా ఎమోషనల్ గా తీసారట. థియేటర్స్ కి వెళ్లే ఆడియన్స్ ఎందుకైనా మంచిది సినిమా చూసిన తర్వాత మీ కంటతడి ని తుడుచుకునేందుకు కర్చీఫ్ ని తీసుకెళ్లండి అనే రేంజ్ లో బయ్యర్స్ సర్కిల్ లో టాక్ నడుస్తోంది అట. రవితేజ ని ఇది వరకు ఊర మాస్ యాంగిల్ లోనే ఎక్కువగా చూస్తూ వచ్చాము. ఇది ఒకానొక సమయం లో ఆడియన్స్ కి బోర్ కొట్టడం వల్లే , ఆయనకు వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి.
కానీ ‘ఇరుముడి’ లో రవితేజ ని చూసిన తర్వాత , చాలా కొత్తగా అనిపిస్తాదని టాక్. ఓవరాల్ గా ఈ చిత్రం లో రవితేజ 30 నిమిషాల పాటు అయ్యప్ప మాలలో కనిపిస్తాడట. ఆ 30 నిమిషాలు సినిమా వేరే లెవెల్ లో ఉంటుందని , ముఖ్యంగా అయ్యప్ప సామి భక్తులను ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్తుందని అంటున్నారు. ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ చిత్రం అవుతుందని , రవితేజ కం బ్యాక్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఈసారి ఉండబోతుంది అంటూ సోషల్ మీడియా లో టాక్ నడుస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.