Toxic Movie : కన్నడ సూపర్ స్టార్ యాష్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘టాక్సిక్’ ఈ నెల 26 న మన భారతీయ ప్రాంతీయ భాషలతో పాటు , అంతర్జాతీయ భాషల్లో కూడా గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో మార్చి 19 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమాని , ఆ తర్వాత జూన్ కి వాయిదా వేశారు. కానీ ఒక అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమాకు వచ్చినటువంటి అద్భుతమైన రెస్పాన్స్ ని చూసిన నిర్మాతలు , ఫారిన్ భాషల్లో కూడా విడుదల చేయడానికి కాస్త రీ వర్క్ చేయాల్సి వచ్చింది. అందుకే ఈ చిత్రాన్ని వాయిదా ఆగస్టు 21 కి వాయిదా వేశారు. రీసెంట్ గానే విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది.
ముఖ్యంగా జెన్ జీ ఆడియన్స్ ఈ ట్రైలర్ కి బాగా కనెక్ట్ అయ్యారు. అయితే రీసెంట్ గానే ఈ సినిమా తెలుగు రైట్స్ ని కొనుగోలు చేసిన దిల్ రాజు , తన బయ్యర్స్ కి ఈ సినిమాకు సంబంధించిన మొదటి కాపీ ని ప్రివ్యూ షో లాగా చూపించాడట. వాళ్ళ నుండి వచ్చిన రెస్పాన్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమా ఆరంభం నుండి ఎండింగ్ వరకు ఒక ఇండియన్ సినిమాని చూస్తున్న ఫీలింగ్ అసలు కలగడట. ఒక హాలీవుడ్ యాక్షన్ మూవీ ని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందట. యాష్ ఈ చిత్రం లో ద్విపాత్రాభినయం చేసాడని , అందులో ఒక పాత్ర విలన్ అని అంటున్నారు. అయితే ఈ చిత్రం లో వయొలెన్స్ సన్నివేశాలు చాలా వైల్డ్ గా ఉంటాయట. కేవలం జెన్ జీ ఆడియన్స్ కి తప్ప , ఇతర సెక్షన్స్ కి సంబంధించిన ఆడియన్స్ ఈ సినిమాని నచ్చే అవకాశం లేదేమో అనే అనుమానాలు వ్యక్తం చేశారట.
సలార్ , ఓజీ వంటి చిత్రాలను జెన్ జీ ఆడియన్స్ చూడబట్టే అంత పెద్ద హిట్స్ అయ్యాయి. ఈ సినిమాని కూడా వాళ్ళే ఆదరించి వేరే లెవెల్ కి తీసుకెళ్తారనే నమ్మకాన్ని దిల్ రాజు వ్యక్తం చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. హీరో యాష్ తో పాటు హీరోయిన్స్ కూడా అద్భుతంగా నటించారట. ముఖ్యంగా కియారా అద్వానీ పాత్ర ఇచ్చే ట్విస్టులకు థియేటర్స్ లో ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అవుతుందని అంటున్నారు. ఓవరాల్ గా కచ్చితంగా వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఈ చిత్రానికి ఉందని అంటున్నారు , మరి అది ఎంత వరకు నిజం అవుతుందో తెలియాలంటే ఆగస్టు 26 వరకు ఆగాల్సిందే.