Homeఎంటర్టైన్మెంట్Illu Illalu Pillalu: 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ కి శుభం కార్డు.. చివరి ఎపిసోడ్...

Illu Illalu Pillalu: ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ కి శుభం కార్డు.. చివరి ఎపిసోడ్ టెలికాస్ట్ ఎప్పుడంటే..

Illu Illalu Pillalu: స్టార్ మా ఛానల్ లో అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ తో కొనసాగుతున్న సీరియల్స్ లో ఒకటి ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’. ప్రభాకర్ , సీనియర్ హీరో ఆమని ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సీరియల్ ప్రతీ రోజు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు టెలికాస్ట్ అయ్యే ఈ సీరియల్ వస్తుందంటే చాలు , ఫ్యామిలీ ఆడియన్స్ టీవీ లకు అతుక్కుపోతుంటారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే , ఈ సీరియల్ కి […]

Illu Illalu Pillalu: స్టార్ మా ఛానల్ లో అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ తో కొనసాగుతున్న సీరియల్స్ లో ఒకటి ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’. ప్రభాకర్ , సీనియర్ హీరో ఆమని ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సీరియల్ ప్రతీ రోజు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు టెలికాస్ట్ అయ్యే ఈ సీరియల్ వస్తుందంటే చాలు , ఫ్యామిలీ ఆడియన్స్ టీవీ లకు అతుక్కుపోతుంటారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే , ఈ సీరియల్ కి ప్రభాకర్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. టీఆర్ఫీ రేటింగ్స్ ప్రతీ వారం ఈ సీరియల్ కి యావరేజ్ గా 7 నుండి 8 కి మధ్యలో ఉంటుంది. అలాంటి సూపర్ హిట్ సీరియల్ కి త్వరలోనే శుభం కార్డు పడబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఇది ఈ సీరియల్ అభిమానులకు కాస్త నిరాశకు గురి చేసే విషయమే.

రీసెంట్ గానే ఈ సీరియల్ కి సంబంధించిన చివరి ఎపిసోడ్ ని కూడా పూర్తి చేశారట మేకర్స్. ఈ నెల 29 వ తేదీన క్లైమాక్స్ ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేయబోతున్నారట. ఇకపై ప్రతీ రోజు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఈ సీరియల్ స్థానం లో ‘పొదరిల్లు’ ని టెలికాస్ట్ చేయబోతున్నారట. ప్రతీ రోజు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ ప్రస్తుతం టాప్ 2 టీఆర్ఫీ రేటింగ్స్ తో కొనసాగుతుంది. ఇప్పుడు మరింత మంచి స్లాట్ లోకి ఈ సీరియల్ వెళ్లడం పై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సీరియల్ 549 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకుంది. స్టార్ మా ఛానల్ లో అతి తక్కువ రోజుల్లో ముగిసిన సీరియల్స్ జాబితా లో ఈ సీరియల్ కూడా చేరిపోయింది. ఇంత అర్థాంతరంగా ఈ సీరియల్ ని ముగించడానికి ముఖ్య కారణం ‘బిగ్ బాస్ 10’ షో.

వచ్చే నెల 6 వ తేదీ నుండి ఈ షో ప్రారంభం కావడం తో , ఒక సీరియల్ కి ముగింపు కార్డు పలకాల్సిన అవసరం వచ్చింది. ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ కథ కూడా చివరి దశకు చేరుకోవడం తో , ఈ వారం లోనే ముగించాలని స్టార్ మా టీం సీరియల్ నిర్మాత ప్రభాకర్ కి చెప్పడం తో , రీసెంట్ గానే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ సీరియల్ అయిపోవడం వల్ల , ఒక స్లాట్ ఖాళీ అవ్వడం తో , ప్రతీ రోజు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు బిగ్ బాస్ 10 ప్రసారం కానుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper