Agni Pariksha 2 : ప్రేక్షకులను ఎంతో ఆకర్షిస్తున్న షో ‘అగ్నిపరీక్ష 2’. ఈ షో ద్వారా సామాన్యులకు వివిధ టాస్కులు నిర్వహించి , గెలిచిన వాళ్ళను బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతారు. గత సీజన్ లో అలా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సామాన్యులు క్రియేట్ చేసిన సునామీ అంతా ఇంత కాదు. దీంతో ఈ ‘అగ్నిపరీక్ష 2’ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. 25 వేల అప్లికేషన్స్ నుండి కేవలం 70 మందిని ఆడిషన్స్ కి ఎంపిక చేశారు. వీరిలో ముగ్గురిని నేరుగా చివరి రౌండ్ కి ఎంపిక చేయగా, మిగిలిన కంటెస్టెంట్స్ ని వివిధ టాస్కుల ద్వారా ఎంపిక చేశారు. వీళ్లకు ప్రస్తుతం టాస్కులు నిర్వహిస్తున్నారు. ఇక ఈ షో ఎల్లుండి నుండి స్టార్ మా , జియో హాట్ స్టార్ లలో టెలికాస్ట్ కానున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ షో కి సంబంధించి రెండు ప్రోమోలు రాగా, రెండిటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ షో ‘అగ్ని పరీక్ష 1’ లో పాల్గొని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సామాన్యులు కూడా వచ్చారట. ప్రియా శెట్టి , మర్యాద మనీష్ , డిమోన్ పవన్ లతో పాటు ‘బిగ్ బాస్ 9’ టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాల కూడా వచ్చాడు. వీళ్ళు కామనర్స్ కి పలు టాస్కులు కూడా నిర్వహించారట. అంతే కాకుండా కొన్ని పవర్స్ కూడా ఇచ్చి వెళ్లారట. ముందుగా ప్రియా శెట్టి ఆర్జీ చరణ్ , మిస్ అపూర్వ , రాజా కుమారి దయానా లకు టాస్కు నిర్వహించింది అట. ఈ టాస్కు లో ఎవరైతే ఎక్కువ బెలూన్స్ ని ఊదుతారో , వాళ్ళు టాస్క్ లో గెలిచినట్టు. వీరిలో రాజకుమారి దయానా విన్ అయ్యిందట. ఆమెకు ప్రియా శెట్టి ఒక ఫైర్ కార్డు ఇచ్చినట్టు సమాచారం. దీని వివరాలు మనం టెలికాస్ట్ లో చూడాల్సిందే.
ఇక కళ్యాణ్ పడాల ఈయన బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి చేసిన కొన్ని పనులు చెప్తూ, కామనర్స్ కి పలు సలహాలు ఇచ్చాడు అట. బిగ్ బాస్ హౌస్ కి ఆడియన్స్ పోలింగ్ ద్వారానే కళ్యాణ్ పడాల ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఓటింగ్ కోసం ఆయన తన ఊర్లో తిరగని కాలేజీ లేదట. ప్రతీ కాలేజ్ కి వెళ్లి తనకు ఓట్లు వేయాల్సిందిగా విద్యార్థులను కోరానని ‘అగ్ని పరీక్ష 2’ లో చెప్పుకొచ్చాడట. దాదాపుగా 10 రోజుల పాటు విజయనగరం మొత్తం తిరిగి ప్రచారం చేసుకున్నాను. వాళ్ళ వల్లే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాను. నేను నామినేషన్స్ ఉన్న సమయం లో కూడా నాకు వాళ్ళు ఓట్లు వేశారు అంటూ చెప్పుకొచ్చాడట కళ్యాణ్ పడాల. ఇలా ఇతర కంటెస్టెంట్స్ చేసి ఉండుంటే వాళ్లకు కూడా అవకాశం ఉండేది కదా, కళ్యాణ్ పడాల ఇలా ప్రచారం చేసుకోవడం లో తప్పు లేదు కానీ , ఆర్మీ పేరు ని గట్టిగా వాడుకొని విన్ అయ్యాడు అంటూ సోషల్ మీడియా లో ఆయనపై ఇప్పటికే విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి.