Kanwar Yatra: శివుడిని అభిషేక ప్రియుడు అంటుంటారు. ముఖ్యంగా శ్రావణమాసంలో స్వామివారిని పవిత్రమైన గంగాజలంతో అభిషేకిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అని భక్తులు నమ్ముతుంటారు. అందువల్లే ప్రతి ఏడాది శ్రావణమాసంలో కన్వర్ యాత్ర నిర్వహిస్తూ ఉంటారు.
కన్వర్ యాత్రలో భాగంగా భక్తులు కావిళ్లలో గంగా నది ప్రవహించే చోట నీళ్లను సేకరిస్తారు. కావిడి మాదిరిగా మోసుకొని వస్తుంటారు. సమీపంలో ఉన్న శివుడికి అభిషేకం చేస్తూ ఉంటారు. పవిత్ర గంగాజలాలను కావిడి ద్వారా మోసుకొచ్చే క్రతువును కన్వర్ యాత్ర అని పిలుస్తుంటారు.. కన్వర్ యాత్ర చేసే క్రమంలో భక్తులు నిష్టగా ఉంటారు. మద్యం ముట్టుకోరు. మాంసాన్ని తినరు. పైగా నీటి కావిడిని మోసే క్రమంలో శివుడి పంచాక్షరిని జపిస్తూ ఉంటారు. స్నానం చేసిన తర్వాతనే నీటి కావిడిని భుజాల మీద మోస్తూ ఉంటారు..
కన్వర్ యాత్ర చేసేటప్పుడు చాలా వరకు భక్తులు బ్రహ్మచర్యాన్ని పాటించాలి.. ఈ ఏడాది కన్వర్ యాత్ర మొదలైంది. ఈ యాత్రలో ఒక బాలుడు చేసిన పని అందరిని కంటనీరు పెట్టిస్తోంది. ఆ బాలుడు భుజాల మీద నీటి కావిళ్లను మోస్తున్నాడు. మోసే క్రమంలో శివుడి పంచాక్షరి జపిస్తూ కన్నీరు పెడుతున్నాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నామని మిగతా భక్తులు అడిగితే.. అతడు బోరున విలపించాడు.
” అమ్మ నాన్న వేరువేరుగా ఉంటున్నారు. వారు కలిసి ఉంటే చూడాలని కోరికగా ఉంది. వారిద్దరు విడిగా ఉంటే నాకు ఇబ్బందిగా ఉంది. అమ్మ ప్రేమను మిస్ అవుతున్నాను. నాన్న ఆప్యాయతను కోల్పోతున్నాను. వారిద్దరూ విడివిడిగా ఉండటం వల్ల నాకు ఏమి తోచడం లేదు. వారిద్దరూ కలిసి ఉండాలని.. వారిద్దరు ఎప్పటిలాగా కలిసిపోవాలని ఆశివయ్యను కోరుకుంటున్నాను. అందువల్లే కష్టమైన పర్వాలేదు కన్వర్ యాత్రను చేస్తున్నానని” ఆ బాలుడు చెప్పడం చాలామందిని కన్నీరు పెట్టిస్తోంది.
నేటి ఆధునిక కాలంలో భార్యాభర్తల మధ్య ఆప్యాయత లేదు. ప్రేమ అంతగా కనిపించడం లేదు. ఆర్థిక స్థిరత్వం పెరగడంతో ఎవరికి వారు అన్నట్టుగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో ఆ ప్రభావం పిల్లల మీద పడుతోంది. అందువల్లేవారు ఇబ్బంది పడుతున్నారు. ఈ బాలుడు ధైర్యం చేసి ముందుకు వచ్చాడు. కానీ రాని పిల్లలు చాలామంది.. అప్పట్లో దేవుళ్ళు అనే ఒక సినిమా వచ్చింది గుర్తుంది కదా.. ఆ సినిమాలో తల్లిదండ్రులు కలవాలని పిల్లలు దేవుళ్ళకు ముడుపులు చెల్లిస్తుంటారు. అలా చెల్లించే క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. చివరికి తల్లిదండ్రులను కలిపి కథను సుఖాంతం చేస్తారు. ఇప్పుడు ఈ బాలుడు చేస్తున్న పని కూడా దాదాపు అలానే ఉంది. శివయ్య అనుగ్రహించి ఆ తల్లిదండ్రులను కలపాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం.
View this post on Instagram