Homeఅంతర్జాతీయంPakistan Saudi Alliance: పాక్‌–సౌదీ కూటమి... అయినా మనమే తిరుగులేని శక్తి!

Pakistan Saudi Alliance: పాక్‌–సౌదీ కూటమి… అయినా మనమే తిరుగులేని శక్తి!

Pakistan Saudi Alliance: అమెరికా›– ఇరాన్‌ యుద్ధం కారణంగా యుద్ధంతో ఎలాంటి సంబంధం లేదని గల్ఫ్‌ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. అమెరికాకు అనుకూలంగా వ్యవహరించడంతోపాటు అమెరికాకు స్థావరాలు ఇచ్చిందుకు ఇరాన్‌ గల్ఫ్‌ దేశాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. దీంతో సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రెయిన్‌ తదితర దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. హర్మూజ్‌ మూసివేతతో గల్ఫ్‌ నుంచి చమురు సరఫరాకు అంతరాయం కలుగుతోంది. దీంతో ఆర్థికంగా నష్టపోతున్నాయి. ఈ పరిస్థితిలో సౌదీ అరేబియా ఇప్పటికే ఒపెక్‌ దేశాల […]

Pakistan Saudi Alliance: అమెరికా›– ఇరాన్‌ యుద్ధం కారణంగా యుద్ధంతో ఎలాంటి సంబంధం లేదని గల్ఫ్‌ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. అమెరికాకు అనుకూలంగా వ్యవహరించడంతోపాటు అమెరికాకు స్థావరాలు ఇచ్చిందుకు ఇరాన్‌ గల్ఫ్‌ దేశాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. దీంతో సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రెయిన్‌ తదితర దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. హర్మూజ్‌ మూసివేతతో గల్ఫ్‌ నుంచి చమురు సరఫరాకు అంతరాయం కలుగుతోంది. దీంతో ఆర్థికంగా నష్టపోతున్నాయి. ఈ పరిస్థితిలో సౌదీ అరేబియా ఇప్పటికే ఒపెక్‌ దేశాల నుంచి బయటకు వచ్చింది. తాజాగా దేశ రక్షణ కోసం పాకిస్తాన్, తుర్కికేతో డిఫెన్స్‌ డీల్‌ ఏర్పాటు చేసుకుంది. మూడు దేశాలు కూటమిగా ఏర్పడ్డాయి. ఎవరిపై దాడి జరిగినా అందరిపై దాడిజరిగినట్లు భావిస్తాయి. దాడిచేసిన దేశంపై మూడు కలిసి ప్రతిదాడి చేస్తాయి. అయితే పాకిస్తాన్‌–సౌదీ అరేబియా గతేడాదే డిఫెన్స్‌ డీల్‌ కుదుర్చుకున్నాయి. కానీ సౌదీ అరేబియాపై ఇటీవల ఇరాన్‌ దాడిచేసినప్పుడు పాకిస్తాన్‌ సైలెంట్‌గా ఉండిపోయింది. ఇప్పుడు కొత్తగా తుర్కియే చేరింది. అయినా కూటమి ఐక్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఆపరేషన్‌ సిందూర్‌తో నష్టపోయిన పాకిస్తాన్‌..
పాకిస్తాన్, సౌదీ అరేబియా భూభాగాలు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఇటీవలే పరస్పర రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయినా ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పాకిస్తాన్‌ ఇప్పటికే తీవ్ర నష్టాలను ఎదుర్కొంది. ఆ తర్వాత అమెరికా ఇరాన్‌పై దాడి చేయగా, ప్రతిస్పందనగా సౌదీలోని అమెరికన్‌ స్థావరాలపై ఇరాన్‌ దాడులు సాగించింది. ఒప్పందం ప్రకారం సౌదీకి సహాయం అందించాల్సిన పాకిస్తాన్‌ మాత్రం ముందుకు రాలేదు.

పాకిస్తాన్‌ వెనుకంజకు కారణాలు..
ఇరాన్‌తో పాకిస్తాన్‌కు సరిహద్దు ఉంది. ఏ చిన్న ప్రయత్నం చేసినా ఇరాన్‌ తన సైనిక బలంతో ఇస్లామాబాద్‌పై దాడికి దిగే అవకాశం ఉంది. అంతర్గత సమస్యలతో ఇప్పటికే అలసిపోయిన పాకిస్తాన్‌ పక్కనే భారత్‌ లాంటి బలమైన శక్తి ఉండటంతో మరిన్ని ఘర్షణలు తీసుకురావడం ప్రమాదకరం. టెహ్రాన్‌తో కొత్త వివాదం అంటే స్వయంగా తనకే నష్టం కలిగించుకోవడమే.

తుర్కియే చేరికతో బలం..
ఇటీవల పాకిస్తాన్‌–సౌదీ కూటమిలో తుర్కియే కూడా చేరింది. ఒకరిపై దాడి అంటే ముగ్గురిపై దాడి అని ప్రకటించారు. అయినా తుర్కియే స్థితి అంత బలంగా లేదు. దేశంలో కుర్దులు బలమైన శక్తిగా ఉన్నారు. వారిని అదుపులో ఉంచడానికే ఎక్కువ వనరులు ఖర్చవుతున్నాయి. గాజా విషయంలో ఇజ్రాయెల్‌తో సంబంధాలు కూడా సజావుగా లేవు. నాటో సభ్యత్వం ఉన్నప్పటికీ ఇజ్రాయెల్‌తో వివాదం వచ్చినా నాటో మద్దతు రావడం కష్టం.

సౌదీ–భారత్‌ బంధం
సౌదీ అరేబియాతో భారత్‌కు దృఢమైన సంబంధాలు ఉన్నాయి. పశ్చిమాసియాలో ఇరాన్‌ బలపడకుండా చూడటం రియాద్‌కు ముఖ్యమైన లక్ష్యం. భారత్‌తో కలిసి ‘అల్మహద్‌ అల్‌ హింద్‌’ పేరుతో నావికా విన్యాసాలు నిర్వహించారు. సౌదీ ఆర్థిక వ్యవస్థలో లక్షలాది భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ కారణాల వల్ల రియాద్‌ ఢిల్లీతో ద్వైపాక్షిక సంబంధాలను విస్మరించలేదు.

భారత్‌ సైనిక బలం..
ప్రపంచంలోని అత్యంత బలమైన సైనిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటి. అమెరికా, రష్యా, చైనా స్థాయిలో నిలుస్తోంది. ఏ దేశం దుస్సాహసం చేసినా ప్రతిస్పందించగల సామర్థ్యం ఉంది. పాకిస్తాన్, సౌదీ, తుర్కియే భౌగోళికంగా చాలా దూరంగా ఉన్నాయి. వాటి సైన్యాలు ఒకచోట కలవడం కష్టం. సౌదీకి హుతీలు, ఇరాన్‌ సమస్యలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ పరిశీలిస్తే భారత్‌ పత్యక్ష ముప్పు లేదని భావిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper