India Vs Pakistan: దౌత్యపరంగా పాకిస్తాన్ దేశానికి చుక్కలు చూపించడానికి భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. యుద్ధం చేసేందుకు రంగం కూడా సిద్ధం చేస్తోంది.. ఇప్పటికే భారత్ సింధు నది జలాలను పాకిస్తాన్ వైపు వెళ్లకుండా ఆపివేసింది. ఫలితంగా సింధు ట్రావెల్స్ ప్రాంతంలో పంటలకు నీళ్లు వెళ్లడం ఆగిపోయాయి. ఒకరకంగా ఇది పాకిస్తాన్ దేశాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం. ఇక టెర్రరిస్టుల శిబిరాలను.. టెర్రరిస్టులను.. ప్రపంచ దేశాలు ముందు పాకిస్తాన్ ను ద్రోహిగా నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తోంది.. అంతేకాదు రక్షణ పరంగా కూడా విన్యాసాలు చేస్తోంది. ఆయుధాలను, మందుగుండు సామగ్రిని సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆయుధాలు తయారు చేసే ఫ్యాక్టరీలలో పనిచేసే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం సెలవులు నిలిపివేసింది. అంతేకాదు రష్యా నుంచి కూడా అధునాతన ఆయుధాలను, క్షిపణులను భారత్ దిగుమతి చేసుకుంది. మొత్తానికి యుద్ధసన్నాహాలను గట్టిగానే చేస్తోంది. త్రివిధ దళాల అధిపతులతో.. జాతీయ భద్రతా సలహాదారు తో ఇప్పటికే అనేకసార్లు నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. అంతేకాదు సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఇంటెలిజెన్స్.. ఇతర వర్గాల ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా రక్షణ దళాలు జమ్మూ కాశ్మీర్లోని అనేక ప్రాంతాలలో సోదాలు చేస్తున్నాయి. అడవుల్లో ముమ్మరంగా కూంబింగ్ చేపడుతున్నాయి.
Also Read: ఖాళీ అయిపోయిన పాక్ ఎయిర్ స్పేస్.. నిండిన ఇండియన్ ఎయిర్ స్పేస్
మోదీ నా అత్త కొడుకు కాదు
యుద్ధం చేయడానికి భారత్ సిద్ధమవుతున్న నేపథ్యంలో పాకిస్థాన్లో లుకలుకలు బయటపడుతున్నాయి. అంతర్గతంగా పాకిస్తాన్ దేశంలో ఒకరకంగా సంక్షోభం నెలకొందని చెప్పవచ్చు. ఇక భారత్ చేస్తున్న యుద్ధ సన్నాహాల నేపథ్యంలో పాకిస్తాన్ ఎంపీ షేర్ అఫ్జల్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ” ఒకవేళ భారత దేశంతో యుద్ధం గనుక మొదలైతే మీరు తుపాకీ పట్టుకొని సరిహద్దు వరకు వెళ్తారా? మీరు పాకిస్తాన్ సైన్యానికి అండదండగా ఉంటారా” అని విలేకరులు ఆయనను ప్రశ్నిస్తే..” యుద్ధం సైనికులు మాత్రమే చేస్తారు. సైనికులు మాత్రమే యుద్ధం చేయగలరు. రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తారు. నేను సైనికుడిని కాదు. ఒకవేళ మీరు అన్నట్టుగా అదే సందర్భం గనుక వస్తే.. నేను తుపాకీ పట్టుకొని సరిహద్దుకు వెళ్లడం కాదు.. శరణార్థిగా ఇంగ్లాండ్ పారిపోతానని” ఆయన వ్యాఖ్యానించాడు.” భారత్ యుద్ధం చేయడానికి రెడీ అవుతోంది. దానికి తగ్గట్టుగానే సంకేతాలు పంపించింది. ఇప్పటికే యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టింది. ఒకవేళ అలా జరిగితే మన దేశం పరిస్థితి ఏమిటి? యుద్ధం వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతాయి. అలాంటప్పుడు మోదీ ఏమైనా వెనక్కి తగ్గే అవకాశం ఉందా” అని విలేకరులు ప్రశ్నిస్తే.” యుద్ధం ఎప్పుడైనా జరగొచ్చు. యుద్ధం ఆపడం నా చేతిలో లేదు. యుద్ధం విషయంలో మోదీ వెనకడుగు వేస్తాడనేది నేను నమ్మను. ఒకవేళ మోడీ గనుక యుద్ధం విషయంలో వెనుకంజ వేస్తే మంచి పరిణామం. కానీ అలా వేయమని నేను చెబితే వినడానికి మోడీ నా అత్త కొడుకు కాదు కదా” అని అఫ్జల్ ఖాన్ పేర్కొన్నాడు. అఫ్జల్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వ్యాప్తిలో ఉన్నాయి. అతడు చేసిన వ్యాఖ్యలు విపరీతంగా నవ్వు తెప్పిస్తున్నాయి.