Homeజాతీయ వార్తలుRed Fort Blast: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు అల్‌ఖైదా పనే.. ఐక్యరాజ్య సమితి భద్రతా...

Red Fort Blast: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు అల్‌ఖైదా పనే.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆందోళన

Red Fort Blast: గతేడాది నవంబర్‌లో ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ) తాజా నివేదిక ఆ దాడి చేసింది అల్‌ఖైదా ఇన్‌ ది ఇండియన్‌ సబ్‌కాంటినెంట్‌ (ఏక్యూఐఎస్‌)అని అధికారికంగా ప్రకటించింది. దక్షిణాసియాలో ఉగ్రవాదం రూపాంతరం చెందుతున్న విధానంపై ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ గుర్తింపు ఎర్రకోట మెట్రో స్టేషన్‌ సమీపంలో కారులో జరిగిన […]

Red Fort Blast: గతేడాది నవంబర్‌లో ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ) తాజా నివేదిక ఆ దాడి చేసింది అల్‌ఖైదా ఇన్‌ ది ఇండియన్‌ సబ్‌కాంటినెంట్‌ (ఏక్యూఐఎస్‌)అని అధికారికంగా ప్రకటించింది. దక్షిణాసియాలో ఉగ్రవాదం రూపాంతరం చెందుతున్న విధానంపై ఆందోళన వ్యక్తం చేసింది.

అంతర్జాతీయ గుర్తింపు
ఎర్రకోట మెట్రో స్టేషన్‌ సమీపంలో కారులో జరిగిన అధిక తీవ్రత గల పేలుడు సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకుంది. భారతీయ దర్యాప్తు ఏజెన్సీలు ఇప్పటికే అనేక మందిని అరెస్ట్‌ చేసి, చార్జీషీట్‌ దాఖలు చేశాయి. ఇప్పుడు యూఎన్‌ఎస్‌సీ మానిటరింగ్‌ టీమ్‌ నివేదిక ఈ దాడిని ఏక్యూఐఎస్‌కు అధికారికంగా లింక్‌ చేయడం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఇచ్చింది. నివేదిక ప్రకారం, ఏక్యూఐఎస్‌ విచ్ఛిన్నమైన సమూహం నుంచి ప్రాంతీయ ఉగ్రవాద సంస్థగా మారుతోంది. ఇది లాజిస్టిక్స్, ఆర్థిక నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసుకుంది. పెద్ద యూనిట్లకు బదులు చిన్న, వికేంద్రీకృత సెల్‌ల ద్వారా పనిచేస్తోంది. ఈ వ్యూహం గుర్తించడం కష్టతరం చేస్తుంది, ఎందుకంటే సాంప్రదాయిక పెద్ద నెట్‌వర్క్‌లను అణచివేయడం సులభమైనప్పటికీ, చిన్న సమూహాలు పనిచేస్తాయి.

ప్రాంతీయ ముప్పు..
నివేదికలో మరో కీలక అంశం ఉంది. ఏక్యూఐఎస్‌ బంగ్లాదేశ్‌లో సెల్‌లు ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా సవాళ్లను పెంచుతుంది. అల్‌ఖైదా, ఇతర ఉగ్ర సంస్థలు రసాయన, జీవ ఆయుధాలపై ఆసక్తి చూపుతున్నా, సాంకేతిక అడ్డంకుల కారణంగా వాటిని అభివృద్ధి చేయలేకపోయాయని కూడా పేర్కొనబడింది. అయినప్పటికీ, ఆన్‌లైన్‌లో అటువంటి సమాచారం వ్యాప్తి చెందడం ప్రమాదకరం. భారత దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ఏక్యూఐఎస్‌కు సంబంధించిన అన్సార్‌ ఘజ్‌వత్‌–ఉల్‌–హింద్‌ వంటి గ్రూపుల లింకులను గుర్తించాయి. వైద్య నిపుణులు సహా కొందరు రాడికలైజ్‌ అయిన వ్యక్తులు ఈ నెట్‌వర్క్‌లో ఉన్నట్లు వెల్లడైంది. ఇది ఉగ్రవాదం సామాజిక అంచులకు మాత్రమే పరిమితం కాకుండా, విద్యావంతుల్లో కూడా చొచ్చుకుపోతున్నదని సూచిస్తుంది.

భారత్‌కు సవాళ్లు..
ఈ నివేదిక భారత్‌ భద్రతా వ్యవస్థకు హెచ్చరిక. పెద్ద ఎత్తున దాడులకు బదులు చిన్న, అపారదర్శక సెల్‌ల ద్వారా దాడులు జరగడం మరింత కష్టతరం. ఆర్థిక నెట్‌వర్క్‌లు, లాజిస్టిక్స్‌ను అడ్డుకోవడం, సరిహద్దు నిఘా బలోపేతం, పొరుగు దేశాలతో సమాచార మార్పిడి అవసరం. అదే సమయంలో, రాడికలైజేషన్‌ను నివారించే సామాజిక, విద్యా కార్యక్రమాలు కూడా ముఖ్యం.

ఏక్యూఐఎస్‌ గుర్తింపు అంతర్జాతీయ సహకారానికి ద్వారాలు తెరుస్తుంది. అయితే, అసలు పని భారత్‌లోనే జరగాలి. నిఘా, నివారణ, వేగవంతమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి. ఎర్రకోట సమీపంలో దాడి ఒక హెచ్చరికగా మిగిలింది. ఏయ్యూఐఎస్‌ వంటి సంస్థలు ప్రాంతీయ ముప్పుగా మారుతున్న నేపథ్యంలో, నిరంతర అప్రమత్తత పెంచాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper