Junior NTR: ‘డ్రాగన్’ మూవీ షూటింగ్ లో గాయపడిన ఎన్టీఆర్ , రీసెంట్ గానే సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. డాక్టర్లు ఆయనకు మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. నిన్న మొన్నటి వరకు హాస్పిటల్ లోనే గడిపిన ఎన్టీఆర్, నేడు డిశ్చార్జ్ అయ్యాడు. ఈ సందర్భంగా ఆయన హాస్పిటల్ సిబ్బందితో కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ ఫొటోలో ఎన్టీఆర్ చేతి కట్టుతో కనిపించడం అభిమానులను కాస్త బాధకి గురి చేస్తోంది. ఎప్పుడూ ఫుల్ ఎనర్జీ తో కనిపించే ఎన్టీఆర్ ని , ఇలాంటి పరిస్థితి లో చూడలేకపోతున్నాం అంటూ ఫ్యాన్స్ పోస్టులు వేస్తున్నారు. అదే సమయం లో సర్జరీ విజయవంతం అయ్యినందుకు సంతోషిస్తున్నారు. అయితే ఇప్పుడు ‘డ్రాగన్’ మూవీ షూటింగ్ కి అసలైన సమస్య ఎదురైంది.
ఎన్టీఆర్ తప్పనిసరిగా మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పడం తో , ఆయన వైద్యుల పర్యవేక్షణ లోనే ఈ మూడు నెలలు గడపాలి. ఆయనకు వైద్యులు ఫిజియోథెరఫీ కూడా చేయనున్నారు. కాబట్టి ఈ మూడు నెలల పాటు డ్రాగన్ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడినట్టే. ప్రస్తుతానికి ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఇది పూర్తి అయ్యాక , మూడు నెలల తర్వాత ఎన్టీఆర్ కి సంబంధించిన షూటింగ్ ని జరపనున్నారు. షూటింగ్ కి బ్రేక్ పడింది కాబట్టి , సినిమా విడుదల కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని జూన్ 11 , 2027 వ సంవత్సరం లో విడుదల చేయబోతున్నామని మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. అంతే కాకుండా ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి కూడా ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
అదే ఏడాది డిసెంబర్ నెలలో ఈ సినిమా సీక్వెల్ ని కూడా విడుదల చేసేలా ప్లాన్ చేసుకున్నారు మేకర్స్. కానీ ఇప్పుడు ఈ ప్లానింగ్ లో మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఎన్టీఆర్ కంఫర్ట్ ఫీల్ అయితే ఈ మధ్యలోనే షూటింగ్ లో తిరిగి జాయిన్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. రుక్మిణి వాసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ లూగర్, డ్రాగన్ అనే రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. లూగర్ నెగెటివ్ షేడ్స్ లో ఉండబోతుంది. ద్విపాత్రాభినయం ఎన్టీఆర్ కి కొత్తేమి కాదు , కానీ ఈ సినిమా మాత్రం చాలా స్పెషల్ అని చెప్పొచ్చు.
#NTR with the doctors at KIMS after his successful surgery.
Wishing him speedy recovery. ❤️ pic.twitter.com/hiSM2Ia6V7
— Suresh PRO (@SureshPRO_) August 13, 2026