Homeటాప్ స్టోరీస్Revanth Reddy Brothers : టెస్స రాక్ట్ భూముల వివాదం.. రేవంత్ సోదరులకు నిజంగానే ...

Revanth Reddy Brothers : టెస్స రాక్ట్ భూముల వివాదం.. రేవంత్ సోదరులకు నిజంగానే “భూ మేలు” జరిగిందా.. కాంగ్రెస్ సైలెన్స్ ఎందుకు..

Revanth Reddy Brothers : తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నియమితులైన నాటి నుంచి భారత రాష్ట్రపతి ఎదురు దాడి చేస్తూనే ఉంది. రేవంత్ రెడ్డి లక్ష్యంగా చేసుకొని విమర్శలు.. ఆరోపణలు.. సొంత మీడియాలో కథనాలు.. ఇవన్నీ గులాబీ పార్టీకి పరిపాటిగా మారిపోయాయి. చివరికి రేవంత్ సోదరుల విషయంలో కూడా గులాబీ పార్టీ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. రేవంత్ సోదరులను లక్ష్యంగా చేసుకొని గులాబీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వాన్ని ఇరకాటంలో […]

Revanth Reddy Brothers : తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నియమితులైన నాటి నుంచి భారత రాష్ట్రపతి ఎదురు దాడి చేస్తూనే ఉంది. రేవంత్ రెడ్డి లక్ష్యంగా చేసుకొని విమర్శలు.. ఆరోపణలు.. సొంత మీడియాలో కథనాలు.. ఇవన్నీ గులాబీ పార్టీకి పరిపాటిగా మారిపోయాయి. చివరికి రేవంత్ సోదరుల విషయంలో కూడా గులాబీ పార్టీ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. రేవంత్ సోదరులను లక్ష్యంగా చేసుకొని గులాబీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

రేవంత్ సోదరుల మీద గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఆ పార్టీ సీనియర్ నాయకుడు హరీష్ రావు పక్క వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. రేవంత్ సోదరులు తిరుపతిరెడ్డి.. కొండల్ రెడ్డి భూ దందాలకు పాల్పడుతున్నారని.. ప్రభుత్వం వారికి ఆయాచితంగా భూములు కేటాయిస్తోందని.. వందల కోట్ల విలువైన భూములు అతి తక్కువ ధరకే వారిద్దరికీ లభిస్తున్నాయని కేటీఆర్.. హరీష్ రావు ఆరోపిస్తున్నారు.

కొండల్ రెడ్డి వ్యాపారం చేస్తుంటారు. తిరుపతి రెడ్డి కొడంగల్ నియోజకవర్గం సంబంధించిన వ్యవహారాలు చూస్తూ ఉంటారు.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం టెస్స రాక్ట్ అనే కంపెనీకి భూములు కేటాయించింది. అత్యంత విలువైన భూములను ఏ కంపెనీకి ప్రభుత్వం అప్పనంగా కట్టబెట్టిందని.. ఈ కంపెనీ కొండల్ రెడ్డికి జేబు సంస్థ అని గులాబీ పార్టీ ఆరోపణలు చేస్తుంది. రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి అధికారాన్ని ఉపయోగించి.. తన సోదరుడికి భారీగా భూములు కేటాయించారని గులాబీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇలాంటి కుంభకోణాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని గులాబీ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

వాస్తవానికి ఇటువంటి ఆరోపణలను తిట్టుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ నిశ్శబ్దంగా ఉంటుంది. ఈ వివాదం మీద కాంగ్రెస్ పార్టీ లో ఉన్న సీనియర్ నాయకులు.. మంత్రులు పెద్దగా స్పందించడం లేదు.. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాత్రమే ఈ వ్యవహారం మీద మాట్లాడుతున్నారు. ప్రభుత్వాన్ని కాస్తలో కాస్త రక్షించే పని చేస్తున్నారు.. భూముల కేటాయింపు.. పారిశ్రామిక విధానం.. చట్టబద్ధమైన నిబంధనలు.. ఇలా అన్ని పాటించి కేటాయింపులు జరిపినట్టు ఆయన వివరిస్తున్నారు. గతంలో గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి నిబంధనలు అయితే పాటించారో.. వాటి ఆధారంగానే భూములు కేటాయించామని.. ఇందులో ఎటువంటి మోసం లేదని ఆయన క్లారిటీ ఇస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం భూములు ఇచ్చినప్పుడు వాటిని పారిశ్రామిక అవసరాల కోసం మాత్రమే ఉపయోగించాలి. కర్మా గారాల నిర్మాణం మాత్రమే అందులో చేపట్టాలి. అలా కాకుండా అందులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఊరుకోకూడదు. కానీ ఈ విషయాన్ని బలంగా తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విఫలమవుతున్నారు.. ఆ భూముల్లో కుంభకోణానికి పాల్పడే ఆస్కారం లేదనే విషయాన్ని బయటకు చెప్పడంలో అధికార పార్టీ నేతలు విఫలమవుతున్నారు.

గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నట్టుగా ఆ కంపెనీకి.. కొండల్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని చెప్పడంలో కాంగ్రెస్ నాయకులు విఫలమవుతున్నారు. ఇదే నేపథ్యంలో గులాబీ పార్టీ తీవ్రస్థాయిలో రెచ్చిపోతుంది. కొండ రెడ్డి పేరును పదేపదే ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తోంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కేవలం కొన్ని విషయాల గురించి మాత్రమే మాట్లాడుతోంది. అసలు ఈ కంపెనీ వెనుక కొండల్ రెడ్డి లేడు అనే విషయం మీద క్లారిటీ ఇవ్వలేకపోతోంది. మొత్తంగా ఈ వ్యవహారం ద్వారా గులాబీ పార్టీ గట్టిగానే పొలిటికల్ మైలేజ్ సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యమంత్రి మీద నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం.. రేవంత్ రెడ్డి కుటుంబం అవినీతిమయమైన కుటుంబం అని ప్రజల్లోకి తీసుకెళ్లడం.. రకరకాల డాక్యుమెంట్లను ప్రజల ముందు పెట్టడం వంటి వాటి ద్వారా గులాబీ పార్టీ లబ్ధి పొందుతోంది. అయితే ఇటువంటి వాటికి కాంగ్రెస్ పార్టీ గట్టిగా కౌంటర్ ఇవ్వకపోవడంతో గులాబీ పార్టీ చేస్తున్న ఆరోపణలు నిజమని చాలామంది నమ్ముతున్నారు. దీర్ఘకాలంలో ఇటువంటి సంఘటనలు ప్రభుత్వానికి చెడ్డ పేరు మాత్రమే కాదు.. అవసరమైతే అధికారానికి దూరంగా కూడా ఉంచుతాయి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మేలుకోకపోతే ఇక అంతే సంగతులు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper