Hyderabad Crime : పురుషులందు పుణ్యపురుషులు వేరు అన్నట్టు.. దొంగలందు మంచి దొంగలు వేరు. ఇతడిది మంచి దొంగ కేటగిరి. పాపం దొంగతనం చేయడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. చివరికి అనేక రకాలుగా రెక్కీ నిర్వహించాడు. ఆ తర్వాత ఓ ఇంట్లో ప్రవేశించాడు. దొంగతనం చేశాడు. కానీ దొరికిపోయాడు.
హైదరాబాద్ నగరంలో పాతబస్తీ ఏరియాలో వాడి ఏ ముస్తఫా ప్రాంతంలో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. పీకలదాకా మద్యం తాగిన ఓ దొంగ ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. మద్యం మత్తులో నేరుగా ఒక గదిలోకి వెళ్ళాడు. అక్కడ అతనికి బంగారం కనిపించింది. దానిని తన సంచిలో వేసుకున్నాడు.. ఖరీదైన ఫోన్లు.. ఇతర వస్తువులను తస్కరించాడు. వాటిని కూడా తన సంచిలో వేసుకున్నాడు. ఇక వాటిని తనతో పాటు తీసుకెళ్లే క్రమంలో.. అతనిలో మత్తుస్థాయి పెరిగిపోయింది. బయటికి వెళ్లే ఓపిక లేకుండా పోయింది. ఆ గదిలోనే పడుకున్నాడు. మద్యం మత్తు విపరీతంగా ఉండడంతో అక్కడే ఆద మరిచి నిద్రపోయాడు.
ఆ ఇంటి యజమాని తెల్లవారుజామున ఆ గది తలుపు తెరిచాడు. లోపలికి వెళ్ళాడు. గదిలో ఉన్న దృశ్యాన్ని చూసి ఒకసారి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత తేరుకున్నాడు. పోలీసులకు సమాచారం అందించాడు. మద్యం మత్తులో ఉన్న ఆ దొంగ ఆదమరిచి నిద్రపోయాడు. అదే సమయంలో గట్టిగా గురక శబ్దం చేశాడు. ఆ శబ్దమే అతడిని పట్టించింది. ఇంటి యజమాని ఆ గదిలో నుంచి గురక శబ్దం వస్తున్న నేపథ్యంలో.. ఏదైనా జంతువు ఉందా లేదా ఇంకా ఎవరైనా ఉన్నారా అని అనుమానంతో తలుపు తీశాడు. తలపు తీయడంతోనే ఆ దొంగ అందులో పడుకొని ఉన్నాడు.
దొంగ గురక శబ్దం పెట్టి పడుకున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ దొంగ ఖరీదైన వస్తువులను దొంగలించినప్పటికీ.. వాటిని తనతో తీసుకెళ్లే క్రమంలో నిద్రపోయాడు. మద్యం మత్తులో ఉండడంతో అతని నోటి నుంచి విపరీతమైన గురక శబ్దం వచ్చింది. దీంతో అతడిని పట్టుకోవడం ఇంటి యజమానికి ఈజీ అయిపోయింది. పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో వారు ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. “పురుషులందు పుణ్య పురుషులు వేరు. దొంగలందు మంచి దొంగలు వేరు. ఇతడు మంచి దొంగ. మద్యం మత్తులో దొరికిపోయిన దొంగ. గురక శబ్దంతో పోలీసులకు చిక్కిన దొంగ అంటూ” నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
చోరీకి వెళ్లి.. గురకపెట్టి నిద్రపోయిన దొంగ
హైదరాబాద్ పాతబస్తీలో చోటు చేసుకున్న విచిత్రమైన ఘటన
ఓ ఇంట్లో చోరీ చేసేందుకు.. మద్యం మత్తులో చొరబడిన ఓ యువకుడు
బంగారం, విలువైన వస్తువుల కోసం వెతికి.. బెడ్రూంలోనే నిద్రపోయాడు
ఉదయాన్నే లేచిన యజమానికి గురక శబ్దం రావడంతో.. రూంలోకి వెళ్లి… pic.twitter.com/qqyLctQHEE
— PulseNewsBreaking (@pulsenewsbreak) August 13, 2026