India Pakistan Tensions : పాకిస్తాన్ దేశానికి సరిహద్దులో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది. ఈ రాష్ట్రంలో ధర్మశాల ప్రాంతంలో క్రికెట్ స్టేడియం ఉంది. చుట్టూ హిమాలయ పర్వతాలు.. ఆహ్లాదకరమైన వాతావరణ మధ్య ధర్మశాల క్రికెట్ మైదానం ఉంటుంది. ఈ మైదానంలో మూడు ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. ఇటీవల జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు ఘనవిజయం సాధించింది. ఇక బుధవారం ఈ మైదానం వేదికగా పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి.. హిమాచల్ ప్రదేశ్ పాకిస్తాన్ దేశానికి సరిహద్దులో ఉండడంతో.. ఇక్కడి ధర్మశాల విమానాశ్రయాన్ని భారత పౌర విమానాయన శాఖ తాత్కాలికంగా మూసివేసింది. దీంతో బుధవారం ఢిల్లీ, పంజాబ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ వాయిదా పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ మ్యాచ్ కు భారత ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఇదొక్క మ్యాచ్ మాత్రం నిర్వహించుకోవచ్చని సూచించింది. దీంతో ఐపీఎల్ నిర్వాహక కమిటీ ఊపిరి పీల్చుకుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇక్కడ తదుపరి మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాదని భావించిన ఐసీసీ నిర్వాహక కమిటీ.. మే 11న ఇదే మైదానంలో జరగవలసిన ముంబై – పంజాబ్ మ్యాచ్ వేదికను అహ్మదాబాద్ కు షిఫ్ట్ చేసింది. ఈ మ్యాచ్ చూసేందుకు టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు రీఫండ్ చేస్తామని వెల్లడించింది. ధర్మశాల విమానాశ్రయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ తాత్కాలికంగా మూసివేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఐపీఎల్ నిర్వహణ కమిటీ ప్రకటించింది.
ఇతర విమానాశ్రయాలు కూడా
ఇక పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న రాజస్థాన్.. గుజరాత్.. హిమాచల్ ప్రదేశ్.. జమ్ము కాశ్మీర్ రాష్ట్రాలలోని విమానాశ్రయాలను సివిల్ ఏబీఎన్ డిపార్ట్మెంట్ టెంపరరీ గా షట్ డౌన్ చేసింది. అక్కడ ప్రజలను గుమి గూడ వద్దని సూచిస్తోంది.. రైల్వేస్టేషన్ లలో ముమ్మరంగా తనిఖీలు చేపడుతోంది. అనుమానిత వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. వారి వద్ద ఉన్న గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు.. ఇక పాకిస్తాన్ దేశంతో ఏర్పడిన ఉద్రిక్తతుల నేపథ్యంలో ఐపీఎల్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నప్పటికీ.. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఎవరైనా సపోర్ట్ చేయాల్సిందే. ధర్మశాల మైదానం మనదేశంలోనే అత్యంత అందమైన క్రికెట్ గ్రౌండ్లలో ఒకటి. ఈ మైదానం అద్భుతంగా ఉంటుంది. హిమాలయ పర్వతాల పక్కన.. చుట్టూ విస్తారమైన వృక్షాల మధ్య ఈ మైదానం ఉంటుంది. ఇక్కడి వాతావరణం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక ఐపీఎల్ లో భాగంగా బుధవారం ఈ మైదానంలో ఢిల్లీ – పంజాబ్ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా ఉంది. ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలిచినా ప్లే ఆఫ్ వెళ్తుంది. గత సీజన్లో ఈ రెండు జట్లు ప్లే ఆఫ్ వెళ్లలేదు. అయితే ఈ రెండు జట్లకు ఈసారి కొత్త కెప్టెన్లు వచ్చారు. దీంతో ఈ జట్ల రాత ఒక్కసారిగా మారిపోయింది. ఫలితంగా స్థిరమైన ఆట తీరు ప్రదర్శిస్తూ ఏకంగా ప్లే ఆఫ్ ముంగిట వరకు వచ్చాయి. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ పరంగా రెండు జట్లు సమానంగా ఉన్నాయి. అయితే పంజాబ్ కంటే కూడా ఢిల్లీ జట్టుకు ఈ మ్యాచ్ లో గెలవడం అత్యంత ముఖ్యం. అయితే ప్రస్తుతం ధర్మశాల మైదానంలో వర్షం కురుస్తున్న నేపథ్యంలో.. టాస్ వేసే ప్రక్రియ కాస్త ఆలస్యం అయింది.