Homeటాప్ స్టోరీస్Cash-for-Vote case : ఓటుకు నోటు కేసులో బిగ్ ట్విస్ట్.. సీఎం రేవంత్ పరిస్థితేంటి..

Cash-for-Vote case : ఓటుకు నోటు కేసులో బిగ్ ట్విస్ట్.. సీఎం రేవంత్ పరిస్థితేంటి..

Cash-for-Vote case : కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో.. పకడ్బందీ ప్రణాళికతో.. ఏసీబీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో వారు అప్పటి టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని పట్టుకున్నారు. ఓటుకు నోటు కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత తెలంగాణలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రకే పరిమితం కావలసి వచ్చింది. నాడు జరిగిన ఈ సంఘటన తెలంగాణ రాజకీయాలను సమూలంగా మార్చేసింది. నాడు నమోదైన ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. […]

Cash-for-Vote case : కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో.. పకడ్బందీ ప్రణాళికతో.. ఏసీబీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో వారు అప్పటి టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని పట్టుకున్నారు. ఓటుకు నోటు కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత తెలంగాణలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రకే పరిమితం కావలసి వచ్చింది. నాడు జరిగిన ఈ సంఘటన తెలంగాణ రాజకీయాలను సమూలంగా మార్చేసింది.

నాడు నమోదైన ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. అనేక ప్రకంపనాలను సృష్టించింది. చివరికి ఈ కేసులో ఇప్పుడు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసు విచారణలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను మళ్లీ మొదటికి తీసుకువచ్చింది. గతంలో ఈ కేసును ధర్మాసనం విచారించింది. తీర్పును రిజర్వ్ చేసింది.. అనేక రకాలుగా వాదనాల విన్న ఈ ధర్మాసనంలోనే న్యాయమూర్తులు ఇటీవల పదవి విరమణ చేశారు. నిబంధనల ప్రకారం చూసుకుంటే ఈ కేసు వాదనలను మళ్లీ మొదటి నుంచి వినాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వివరించారు. ఈ క్రమంలో ఈ కేసు మళ్లీ విచారణకు వస్తుందని సమాచారం.

పది సంవత్సరాల క్రితం ఓటుకు నోటు కేసు నమోదయింది. నాడు ఈ కేసు పై నమోదైన పిటిషన్ల పై సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. ఈ వాదనలను విన్న ధర్మాసనంలోని న్యాయమూర్తులు పదవీ విరమణ చేశారు. ఫలితంగా సాంకేతిక కారణాల నేపథ్యంలో విచారణ కొంత పరిధిలో ఆగిపోయింది. రోస్టర్ ప్రక్రియలో భాగంగా ఈ కేసు ఇటీవల సీజేఐ ముందుకు వచ్చింది. న్యాయ ప్రక్రియ.. ఇతర నియమాల నేపథ్యంలో పాత వాదనలను తాము లెక్కలోకి తీసుకోలేమని సూర్యకాంత వివరించారు. ఈ ప్రకారం కొత్త బెంచ్ ఈ కేసును విచారించాల్సి ఉంటుంది. ఈ కేసులో మొదటి నుంచి వాదనలు వింటామని సిజెఐ ప్రకటించారు. మరోవైపు ఈ కేసు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్నది. అందువల్ల దీనిని వేగంగా విచారించడానికి ప్రత్యేకమైన ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సిజెఐ వెల్లడించారు. నూతన ధర్మసనం ఏర్పాట తర్వాత.. వాదులు.. ప్రతిభాదులు తరపున న్యాయవాదులు మళ్లీ తమ వాదనలు వినిపించాల్సి ఉంటుంది. ఇన్నాళ్లపాటు ఈ కేసులో ఎటువంటి కదలిక లేదు. ఈ క్రమంలో ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం రీ హియరింగ్ కు వస్తున్నామని సంకేతాలు ఇవ్వడంతో.. పొలిటికల్ గా హీట్ పెరిగింది.

ఈ కేసు సంబంధించి మీడియా నుంచి అనేక రకాలుగా ప్రస్తుతం ముఖ్యమంత్రి కి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ ప్రశ్నలకు ఆయన నేరుగాని సమాధానం చెప్పారు. తనను ఏ విధంగా ఇరికించారు.. దాని వెనుక ఉన్న మనుషులు ఎవరు.. వారి ప్రయోజనాలు ఏంటి అనే విషయాలను రేవంత్ రెడ్డి అనేక పర్యాయాలు వివరించారు. ఈ కేసు కు సంబంధించి తనలో ఎటువంటి ఆందోళన లేదని.. తీర్పు తనకు అనుకూలంగానే వస్తుందని అనేక సందర్భాల్లో రేవంత్ చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుకు ఈ కేసు మళ్ళీ వస్తున్న నేపథ్యంలో.. రేవంత్ వర్గీయులు పెద్దగా ఆందోళన చెందడం లేదు. కంగారు పడడం లేదు. నాటి ప్రభుత్వం ఏకపక్షంగా ఈ కేసు నమోదు చేసిందని.. ఇందులో స్థాయికి మించి వ్యవహరించిందని.. పొలిటికల్ గా రేవంత్ రెడ్డికి నష్టం చేయాలని చూశారని.. చివరికి వారే నష్టపోయారని రేవంత్ రెడ్డి వర్గీయులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper