ఎక్కువగా చెమట పడుతోందా.. ఆ వ్యాధుల బారిన పడే ఛాన్స్..?

మనలో చాలామంది అధిక చెమట సమస్యతో బాధ పడుతూ ఉంటారు. అధిక చెమట సమస్య చిన్నదే అయినా కొన్ని సందర్భాల్లో పలు అనారోగ్య సమస్యలకు అధిక చెమట సూచన అవుతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అధిక చెమట సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. థైరాయిడ్ పనితీరులో అసమతుల్యత, పిట్యుటరీ గ్రంథి బలహీనమైన పనితీరు, డయాబెటిస్, అంటువ్యాధులు, గౌట్, కొన్ని మందుల ప్రభావం, ఆందోళన అధిక చెమటకు కారణమవుతాయి. శరీరానికి చెమట పట్టడం ద్వారా శరీరంలోని వ్యర్థాలు […]

  • Written By: Navya
  • Published On:
ఎక్కువగా చెమట పడుతోందా.. ఆ వ్యాధుల బారిన పడే ఛాన్స్..?

Follow us on

మనలో చాలామంది అధిక చెమట సమస్యతో బాధ పడుతూ ఉంటారు. అధిక చెమట సమస్య చిన్నదే అయినా కొన్ని సందర్భాల్లో పలు అనారోగ్య సమస్యలకు అధిక చెమట సూచన అవుతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అధిక చెమట సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. థైరాయిడ్ పనితీరులో అసమతుల్యత, పిట్యుటరీ గ్రంథి బలహీనమైన పనితీరు, డయాబెటిస్, అంటువ్యాధులు, గౌట్, కొన్ని మందుల ప్రభావం, ఆందోళన అధిక చెమటకు కారణమవుతాయి.

శరీరానికి చెమట పట్టడం ద్వారా శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళతాయి. శరీరంలోని వేడిని తగ్గించడంలో చెమట సహాయపడుతుంది. చర్మంపై ఉన్న చెమటకు బ్యాక్టీరియా తోడైతే శరీరం నుంచి దుర్వాసన వచ్చే అవకాశాలు ఉంటాయి. అరచేతులు, పాదాలు, చంకలలో ఎక్కువగా చెమట పట్టడాన్ని చాలామంది అసౌకర్యంగా భావిస్తారు. కారంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకున్న చెమట పడుతోంది.

స్థూలకాయం, కారణం తెలియని జ్వరం, మధుమేహం అధిక చెమటకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. హార్మోన్‌ల ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు కూడా అధిక చెమటకు కారణమవుతాయని చెప్పవచ్చు. శరీరంలోని ఉష్ణోగ్రత కంటే భావోద్వేగాల్లో హెచ్చుతగ్గుల వల్ల అరికాళ్లు, అరచేతుల్లో అధిక చెమట పట్టే అవకాశం ఉంటుంది. అధిక చెమట నివారణకు అరచేతులను చల్లని బ్లాక్ టీలో ముంచిన మెత్తని గుడ్డతో తుడిస్తే మంచిది.

బ్లాక్ టీ నేచురల్ యాంటీపెర్సెపిరెంట్‌ గా పని చేయడంతో పాటు చెమట ప్రవాహాన్ని నియంత్రించి అనుకున్న ఫలితం కనిపిస్తుంది. అరచేతులను బ్లాక్ టీలో 20 నిమిషాల పాటు ముంచినా మంచి ఫలితం ఉంటుంది. అధిక చెమట సమస్యతో ఇబ్బంది పడేవాళ్లు గంధం లేదా అలోవెరా జెల్‌ అరికాళ్లు లేదా చంకలలో రాసినా మంచి ఫలితం ఉంటుంది. ఎక్కువ కారం ఉండే ఆహారాలు, వేడివేడి ఆహార పదార్థాలను తినడం మానేయాలి.

Read Today's Latest Health news News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు