Hair Fall Tips: వ్యక్తిగత భద్రతకు హెల్మెట్ తప్పనిసరి. ప్రమాద సమయంలో శిరస్త్రానం ధరించడం వల్ల ప్రాణాలు కాపాడుకున్న వల్లకు తెలుసు.. దాని ప్రాధన్యత ఏంటో . అయితే చాలా మంది హెల్మెట్‌ను ఎక్కువసేపు ధరించడం వల్ల జుట్టు దెబ్బతింటుందని హెల్మెట్ ధరించడం మానేస్తుంటారు. నిజానికి హెల్మెట్ ధరించడం వల్ల గాలి ఆడదు, చెమటను ఎక్కువగా వస్తాయి. చుండ్రు మరియు జుట్టు రాలడానికి కారణమవుతుంది. అయితే ఇవన్నింటికి కారణం హెల్మెట్‌ను సరిగ్గా ధరించకపోవడమే. జుట్టు హాని కలగకుండా ఉండాలంటే హెల్మెట్‌ను సరిగ్గా ఉపయోగించడం చాలా అవసరం.
హెల్మెట్ వల్ల జుట్టు రాలకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చిట్కాలు ఇవే!
1. జుట్టు పరిశుభ్రత – నెత్తి మీద చర్మం శుభ్రంగా మరియు జిడ్డు లేకుండా ఉండటానికి ప్రతిరోజూ మీ జుట్టును శుభ్రం చేసుకుంటూ ఉండాలి. మురికి & నూనె చుండ్రు రావడానికి, జుట్టు రాలడానికి కారణమవుతాయి. మురికిగా ఉన్న జుట్టుపై హెల్మెట్ ధరించడం వల్ల అది మరింతగా ఇబ్బందులకు గురిచేస్తుంది. కాబట్టి హెల్మెట్లతో డ్యామేజ్ కాకుండా జుట్టును శుభ్రంగా ఉంచండి.
2. ప్రీకాండిషనింగ్ – బాగా హైడ్రేటెడ్ జుట్టు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. రెగ్యులర్ ప్రికాండిషనింగ్ (వాష్ చేయడానికి ముందు జుట్టుకు నూనె వేయడం) హెల్మెట్ల వల్ల జరిగే నష్టాన్ని ఖచ్చితంగా నివారిస్తుంది.
3. తడి జుట్టుపై హెల్మెట్ ధరించకండి – తడి జుట్టు మీద హెల్మెట్ ధరించడం వలన అది చితికిపోతుంది, చుండ్రు ఏర్పడుతుంది మరియు జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. హెల్మెట్ ధరించే ముందు పూర్తిగా జుట్టు పొడిగా ఉండేలా చూసుకోండి.
Also Read: Aadavallu Meeku Johaarlu Box Office Collection: ఫస్ట్ వీక్ లో దారుణంగా తేలిపోయిన ‘ఆడవాళ్లు..’
4. కాటన్ మాస్క్ ధరించడం – జుట్టు డ్యామేజ్ కాకుండా ఉండేందుకు మీ హెల్మెట్ కింద పల్చని కాటన్ క్లాత్ మాస్క్‌ని ధరించడం మంచిది. ఇది పరిశుభ్రతను కాపాడుతుంది, జుట్టు లాగడం మరియు చెమట పట్టడం నిరోధిస్తుంది.
5. మంచి నాణ్యమైన హెల్మెట్‌ని ఉపయోగించండి – మీ తలకు బాగా సరిపోయే హెల్మెట్ ధరించండి మరియు జుట్టు చిట్లడం, ఇతర సమస్యలను నివారించడానికి మంచి నాణ్యంగా హెల్మెట్‌ని ధరించండి.
6. హెల్మెట్‌ను శుభ్రంగా ఉంచండి – మీ హెల్మెట్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోండి – హెల్మెట్‌లోని దుమ్ము, చెమట, బ్యాక్టీరియా మీ జుట్టుకు ఇబ్బంది కలిగిస్తాయి. శుభ్రమైన హెల్మెట్ ఎల్లప్పుడూ మంచిది!
7. హెల్మెట్‌ను సున్నితంగా తీయండి – మీ తలపై నుండి హెల్మెట్‌ను తీసే సమయంలో సున్నితంగా తీయండి. మీరు మీ హెల్మెట్‌ను లాగితే, దానితో మీ జుట్టును లాగుతున్నారనే విషయాన్ని గుర్తించుకోండి!
8. మీ స్వంత హెల్మెట్ ఉపయోగించండి – మీ స్వంత హెల్మెట్ ఉపయోగించడం ఎల్లప్పుడూ మంచిది, వేరొకరి హెల్మెట్ ఉపయోగించడం వల్ల జెర్మ్స్, దుమ్ము మొదలైనవి మీ జుట్టులోకి చేరి సమస్యలను కలిగిస్తుంది.
9. శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుకోండి – మీ స్కాల్ప్ ఆరోగ్యంగా ఉంటే, హెల్మెట్‌తో జుట్టు రాలిపోయే అవకాశాలు తక్కువ. జుట్టు కడుక్కోవడానికి ముందు తలకు వారానికి ఒకసారి తాజా కలబంద జెల్‌ను పట్టించండి
10. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి – మంచి ఆహారం ఎల్లప్పుడూ మీ జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని అరికట్టడానికి మరియు మీ జుట్టు బలంగా ఉండటానికి మంచి ఆహారం తీసుకోండి.
హెల్మెట్‌ను రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల జుట్టు రాలడాన్ని నివారించడం సాధ్యమవుతుంది. పై చిట్కాలను ప్రయత్నించండి మరియు మీ జుట్టు సమస్యలను దూరం చేసుకోండి.
Also Read: Mahesh Trivikram Movie: మహేష్ బాబు’ మరదలిగా ప్రముఖ హీరో కుమార్తె
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Tips to prevent hair loss from helmets details here
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com