కీళ్ల నొప్పులకు సులభంగా చెక్ చెప్పే చిట్కాలు ఇవే..?

మనలో చాలామంది భుజాలు, మెడ, నడుము నొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఇతర కారణాల వల్ల చాలామందిని ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. నొప్పులు తీవ్రమైతే పనులు చేయాలనే ఆలోచన సైతం తగ్గుతుంది. కీళ్ల నొప్పులకు చెక్ పెట్టాలంటే కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. చాలామంది బకెట్ లేదా కూరగాయలను ఒకే చేతితో మోయడం వల్ల మెడ, భుజం నొప్పితో బాధ పడుతున్నారు. శక్తికి మించిన బరువు లేకుండా […]

  • Written By: Navya
  • Published On:
కీళ్ల నొప్పులకు సులభంగా చెక్ చెప్పే చిట్కాలు ఇవే..?

Follow us on

మనలో చాలామంది భుజాలు, మెడ, నడుము నొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఇతర కారణాల వల్ల చాలామందిని ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. నొప్పులు తీవ్రమైతే పనులు చేయాలనే ఆలోచన సైతం తగ్గుతుంది. కీళ్ల నొప్పులకు చెక్ పెట్టాలంటే కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. చాలామంది బకెట్ లేదా కూరగాయలను ఒకే చేతితో మోయడం వల్ల మెడ, భుజం నొప్పితో బాధ పడుతున్నారు.

శక్తికి మించిన బరువు లేకుండా చూసుకోవడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆహారపు అలవాట్లను మార్చుకుని పప్పు ధాన్యాలు, బఠాని, సోయా, బ్రొకోలి, గుమ్మడి గింజలు, నువ్వులు, పిస్తా, బాదం గుడ్డు, పెరుగు, పాలు తీసుకోవడం ద్వారా ఎముకలు పటిష్టంగా ఉండటంతో పాటు కీళ్ల సంబంధిత సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. కంప్యూటర్, ల్యాప్ టాప్ ముందు పని చేసేవాళ్లు మెడను స్టిఫ్ గా పెట్టకుండా కదిలిస్తూ ఉంటే మంచిది.

పడుకునే, కూర్చునే భంగిమలు సరిగ్గా లేకపోయినా నడుము, మెడ నొప్పులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. తరచూ తలనొప్పి వస్తే ఆ సమస్య నరాలు, ఎముకలకు సంబంధించిన సమస్య అయ్యే అవకాశం ఉంది. తరచూ తలనొప్పి సమస్యతో బాధ పడేవాళ్లు వైద్యుల సలహా తీసుకుని చికిత్స చేయించుకుంటే మంచిది. ఏకబిగిన పని చేయకుండా మధ్యలో చిన్నచిన్న వ్యాయామాలు చేస్తూ పని చేస్తే మంచిదని చెప్పవచ్చు.

తీసుకునే ఆహారంలో ఉప్పును తగ్గిస్తే కీళ్ల నొప్పులను సులువుగా నియంత్రించే అవకాశం ఉంటుంది. ఖాళీ సమయంలో మెడ, భుజాలకు సంబంధించిన వ్యాయామాలు చేయడం ద్వారా ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

Read Today's Latest Health news News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు