వైద్యులకు అండగా ప్రభుత్వం.. భారీగా ఎక్స్ గ్రేషియా

ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి అండగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. జూనియర్ డాక్టర్ల ఎక్స్ గ్రేషియా డిమాండ్ నెరవేరుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ తో మరణించే వైద్యులు, సిబ్బందికి ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వర్కర్లను ఆదుకునేందుకు అండగా నిలవడం ఆహ్వానించదగ్గ విషయమే. కొవిడ్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ల కుటుంబానికి రూ.25 లక్షలు , స్టాఫ్ నర్సులకు రూ.20 లక్షలు, ఎంఎన్వో, ఎఫ్ఎన్వోలకు రూ.15 […]

  • Written By: Srinivas
  • Published On:
వైద్యులకు అండగా ప్రభుత్వం.. భారీగా ఎక్స్ గ్రేషియా

Follow us on

ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి అండగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. జూనియర్ డాక్టర్ల ఎక్స్ గ్రేషియా డిమాండ్ నెరవేరుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ తో మరణించే వైద్యులు, సిబ్బందికి ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వర్కర్లను ఆదుకునేందుకు అండగా నిలవడం ఆహ్వానించదగ్గ విషయమే.

కొవిడ్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ల కుటుంబానికి రూ.25 లక్షలు , స్టాఫ్ నర్సులకు రూ.20 లక్షలు, ఎంఎన్వో, ఎఫ్ఎన్వోలకు రూ.15 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇతర వైద్య సిబ్బంది చనిపోతే రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇస్తామని ప్రకటించింది. దీంతో డాక్టర్లలో హర్షం వ్యక్తమైంది. బాధిత కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.

కేంద్ర ప్రభుత్వం చెల్లించే ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ పథకానికి అదనంగా ఈ ఎక్స్ గ్రేషియా చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. తక్షణమే ఎక్స్ గ్రేషియా అందేలా కలెక్టర్లకు అధికారం ఇచ్చింది. జిల్లా కలెక్టర్లు సంబంధిత డాక్యుమెంట్లు పరిశీలించి ఎక్స్ గ్రేషియా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం కోరింది.

గుర్తింపు కార్డుతో పాు కొవిడ్ 19 పాజిటివ్ సర్టిఫికెట్, మరణ ధృవీకరణ పత్రం సమర్పించి ఈ ఎక్స్ గ్రేషియాకు కుటుంబ సభ్యులు నివేదించాలని ప్రభుత్వం సూచించింది. దీంతో ఇన్నాళ్లు కొవిడ్ కాటుకు బలైన వైద్యుల కుటుంబాలకు ఊరట లభించనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో డాక్టర్లలో హర్షం వ్యక్తమవుతోంది.

Read Today's Latest Ap politics News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు