Anchor Suma: ఒకే రోజు నాలుగు ఈవెంట్లు.. యాంకర్ సుమను రీప్లేస్ చేసే మరో యాంకర్ లేనట్టేనా?

నిన్న కార్తీక పౌర్ణమి కావడంతో సినిమా ఈవెంట్లు కూడా ఎక్కువగానే జరిగాయి. బబుల్ గమ్, ఎక్ట్రార్డినరీ మ్యాన్, యానిమల్, హాయ్ నాన్న సినిమాల ఈవెంట్లకు సుమ యాంకర్ గా వ్యవహరించింది సుమ.

  • Written By: Suresh
  • Published On:
Anchor Suma: ఒకే రోజు నాలుగు ఈవెంట్లు.. యాంకర్ సుమను రీప్లేస్ చేసే మరో యాంకర్ లేనట్టేనా?

Follow us on

Anchor Suma: యాంకర్ లలో నెంబర్ వన్ గా నిలుస్తున్న యాంకర్ ఎవరంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు యాంకర్ సుమ. బుల్లితెర మీద ఈమెకు ఉన్న క్రేజ్, రేంజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవల్ లో ఉంటుందనే సంగతి తెలిసిందే. ఎక్కువ మొత్తంలో పారితోషికం తీసుకునే యాంకర్ కూడా సుమనే. అయినా కూడా మరో టాప్ యాంకర్ లేకపోవడంతో సుమకే ఫుల్ ఆఫర్లు వస్తున్నాయి. ఒకే రోజు నాలుగు ఈవెంట్లకు సుమ యాంకర్ గా చేస్తున్నారంటే ఇండస్ట్రీలో ఆమెకు ఏ స్థాయిలో ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు.

నిన్న కార్తీక పౌర్ణమి కావడంతో సినిమా ఈవెంట్లు కూడా ఎక్కువగానే జరిగాయి. బబుల్ గమ్, ఎక్ట్రార్డినరీ మ్యాన్, యానిమల్, హాయ్ నాన్న సినిమాల ఈవెంట్లకు సుమ యాంకర్ గా వ్యవహరించింది సుమ. బబుల్ గమ్ సినిమా కొడుకు సినిమా అని తెలిసిందే. మిగతా మూడు ఈవెంట్ల ద్వారా ఏకంగా సుమకు మూడు లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ పొందిందని టాక్. అయితే ఒకే రోజు నాలుగు సినిమాలకు హోస్ట్ గా వ్యవహరించడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి ఆఫర్లన్నీ సుమకే రావడం గమనార్హం. ఈమెను మించిన యాంకర్ లేరనే ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కరు కూడా సుమనే హోస్ట్ గా ఎంచుకుంటున్నారు.

సుమ వయస్సు 48 సంవత్సరాలు కాగా మరో ఐదేళ్ల పాటు సుమ కెరీర్ పరంగా బిజీగా ఉండే ఛాన్స్ ఉంది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఇప్పటికీ సుమ యాంకర్ గా చేస్తున్న పలు షోలు ప్రసారమవుతున్నాయి. కొడుకును హీరోగా నిలబెట్టడానికి సుమ పడుతున్న కష్టం కూడా అంతా ఇంతా కాదు. సుమ ఈవెంట్ లో ఎక్ట్రార్డినరీ మ్యాన్ ట్రైలర్ రిలీజ్ కాగా ఈ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. షర్మిలను ఇమిటేట్ చేస్తూ నితిన్ చెప్పిన డైలాగ్ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

వక్కంతం వంశీ ఈ సినిమాకు కథ, కథనం అందించగా ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి. జీవిత, జీవితం రెండూ ఒకటే అంటూ ట్రైలర్ ను ముగించిన తీరు సూపర్ అనే చెప్పాలి. ఈ సినిమా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిందని తెలుస్తోంది. ఈ సినిమా కమర్షియల్ గా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి మరి…

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు