Naga Chaitanya: టాలీవుడ్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న జంట నాగ చైతన్య , శోభిత ధూళిపాళ్ల. వీళ్లిద్దరు కలిసి ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వీళ్లిద్దరు, ఆ తర్వాత ఒక కాఫీ షాప్ లో స్నేహితులై , ఆ స్నేహితులు కాస్త ప్రేమికులుగా మారి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక ఎలాంటి విబేధాలు లేకుండా, చాలా సంతోషంగా ఈ క్యూట్ కపుల్ తమ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వీళ్లిద్దరి నుండి శుభవార్త ఎప్పుడు వస్తుందా అని అక్కినేని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా శోభిత ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో నాగ చైతన్య తో వివాహ బంధం గురించి మాట్లాడిన కొన్ని మాటాలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆమె మాట్లాడుతూ ‘పెళ్ళైన మొదటి ఏడాది లో మేమిద్దరం కెరీర్ పరంగా చాలా బిజీ గా గడిపాము. వివాహం జరిగిన కొన్ని రోజులకే నేను షూటింగ్ కోసం తమిళనాడు కి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ నాగ చైతన్య ని వదిలి దాదాపుగా 150 రోజులు గడిపాను. కేవలం నెలకు ఒకసారి మాత్రమే చైతన్య కి కలిసేదాన్ని. మా ఇద్దరి వ్యక్తిగత జీవితాలను బ్యాలన్స్ చేయడానికి మొదట్లో చాలా ఛాలెంజ్ గానే అనిపించింది. కానీ కాలం గడిచేకొద్దీ , కొన్ని నెలల నుండి ఆ జీవితాన్ని అలవాటు చేసుకున్నాము. మా వైవాహిక బంధం బలపడేందుకు ఏమేమి చెయ్యాలో అవన్నీ చేస్తున్నాం. చిన్నప్పటి నుండి నా పెళ్లిని హిందూ సంప్రదాయ పద్దతిలో చేసుకోవాలని కలలు కన్నాను. కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లోని ఒక ప్రముఖ సినీ హీరో ని పెళ్లాడుతానని కలలో కూడా ఊహించలేదు. అదే విధంగా సంప్రదాయబద్ధంగా వివాహం జరుగుతుందని కూడా అనుకోలేదు. కానీ నా కల నెరవేరింది’ అంటూ చెప్పుకొచ్చింది శోభిత.
ఇక శోభిత కెరీర్ విషయానికి వస్తే , పెళ్లి తర్వాత ఈమె నుండి విడుదలైన ‘చీకటిలో’ అనే వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అయ్యి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె పీఏ రంజిత్ దర్శకత్వం లో ‘వెట్టువం ‘ అనే తమిళ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం , అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక నాగ చైతన్య విషయానికి వస్తే ‘తండేల్’ తో వంద కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టిన ఆయన , ప్రస్తుతం ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ తో ‘వృషకర్మ’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ ఏడాది లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.