Tollywood Heroes : మన టాలీవుడ్ హీరోలందరూ ఇప్పుడు వనవాసం చేస్తున్నారు. వనవాసం అంటే సినిమాలు మానేసి అడవుల్లోకి వెళ్లిపోయారు అనుకోకండి, వాళ్ళు చేస్తున్న సినిమాలన్నీ ఇప్పుడు అడవి నేపథ్యం ఉన్న సినిమాలే అని దాని అర్థం. ఇప్పటికే ఈ బ్యాక్ డ్రాప్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ‘వారణాసి’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కూడా అడవి నేపథ్యం లోనే అత్యధిక శాతం తెరకెక్కుతుంది. కర్ణాటక పరిసర అడవుల్లో ఈ చిత్రాన్ని ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలు గా పిలవబడే ఈ ఇద్దరు హీరో అడవుల బాట పట్టగా, మీడియం రేంజ్ హీరోల అప్ కమింగ్ సినిమాలు కూడా అడవి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమాలే కావడం గమనించాల్సిన విషయం.
అక్కినేని నాగ చైతన్య తండేల్ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ‘విరూపాక్ష’ డైరెక్టర్ కార్తీక్ తో ఒక మిస్టిక్ జానర్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వృషకర్మ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇది కూడా దట్టమైన అడవుల్లో, గుహలు , అందులో లోపల దాగున్న మన ఆధ్యాత్మికత కి సంబంధించిన విషయాలకు సంబంధించిన స్టోరీ అట. చాలా సస్పెన్స్ గా స్క్రీన్ ప్లే ఉంటుందని సమాచారం. అదే విధంగా సాయి ధరమ్ తేజ్ హీరో గా నటిస్తున్న ‘సంబరాల యేటి గట్టు’ చిత్రం కూడా అడవి నేపథ్యం లో సాగే కథ అట. హైదరాబాద్ లో ఈ సినిమా సెట్స్ ని చూస్తే ఒక కొత్త ప్రపంచం లోకి అడుగుపెట్టినట్టుగా అనిపిస్తుంది. ఇక మరో మీడియం రేంజ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘భోగీ’ చిత్రం కూడా అడవి నేపథ్యం లోనే తెరకెక్కుతుంది అట. ఇందులో శర్వానంద్ డైలాగ్స్ మొత్తం తెలంగాణ యాసలో ఉంటుందని సమాచారం. ఇలా టాలీవుడ్ హీరోలందరూ అడవి బాట పట్టారు. ఈ అడవి సెంటిమెంట్ ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.