Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి ‘అగ్ని పరీక్ష 2’ ద్వారా సామాన్యులు అనవసరంగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారేమో అని అనిపిస్తోంది. ఎందుకంటే సెలబ్రిటీలు వాళ్ళను అత్యంత దారుణంగా టార్గెట్ చేస్తున్నారు , ఇష్టమొచ్చినట్టు మాట్లాడి అవమానిస్తున్నారు. ‘మీలాగా మేము అగ్ని పరీక్ష’ నుండి రాలేదు అంటూ అవహేళన చేస్తున్నారు. రోహిత్ ‘బిగ్ బాస్ ‘ ని ఏమి అనకపోయినా , అన్నట్టుగా చూపించి , డోర్లు ఓపెన్ చేసి గెటౌట్ అన్న నాగార్జున, సెలబ్రిటీలు పదే పదే ‘అగ్ని పరీక్ష’ షోని కించపరుస్తున్నప్పటికీ ఒక్క మాట కూడా అనకపోవడాన్ని చూస్తుంటే , నాగార్జున సపోర్టు కూడా వాళ్ళ వైపే ఉందని నెటిజెన్స్ కి స్పష్టంగా అర్థం అవుతోంది. దీనిపై సోషల్ మీడియా లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది , పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి.
ఇదంతా పక్కన పెడితే సెలబ్రిటీలు మరోపక్క ‘ఆపరేషన్ అగ్ని పరీక్ష 2’ కంటెస్టెంట్స్ మొదలు పెట్టారు. నాగార్జున నామినేషన్స్ గురించి మాట్లాడుకోవద్దు అంటూ పదే పదే వార్నింగ్ ఇచ్చినప్పటికీ , లెక్కచేయకుండా సెలబ్రిటీలు నామినేషన్స్ గురించి మాట్లాడుకొని , ఈ వారం ఎలా అయినా ‘అగ్ని పరీక్ష 2’ కంటెస్టెంట్స్ అందరినీ నామినేషన్స్ లోకి తీసుకొని రావాలనే నిర్ణయం తీసుకొని , వాళ్ళు అనుకున్నది సాధించి శ్రేష్టి ని ఎలిమినేట్ అయ్యేలా చేశారు. ఇక ఈ వారం నామినేషన్స్ లోకి కూడా ‘అగ్ని పరీక్ష 2’ కంటెస్టెంట్స్ అందరూ వచ్చారు. సెలబ్రిటీస్ లో వర్షిణి కెప్టెన్ కాబట్టి , ఆమెని నామినేట్ చేయడానికి లేదు. అదే విధంగా సుధీర్ , వంశీ లకు 6 వ వారం వరకు ఇమ్మ్యూనిటి లభించింది. వీళ్ళు వీక్ కంటెస్టెంట్ , ఈ వారం ఈ ముగ్గురు నామినేషన్స్ లోకి వచ్చి ఉండుంటే కచ్చితంగా ఇద్దరు ఎలిమినేట్ వాళ్ళు.
కానీ లక్కీ గా తప్పించుకున్నారు. అందుకే ఈ వారం చరణ్ , షాలిని , అపూర్వ డేంజర్ జోన్ లోకి వచ్చారు. ఈ వీకెండ్ లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు కాబట్టి, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ని ప్లాన్ చేశారట మేకర్స్. అదే కనుక జరిగితే అపూర్వ కచ్చితంగా ఎలిమినేట్ అవుతుంది. ఇక చరణ్ , షాలిని లలో ఇద్దరికీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు సమానంగా ఉన్నాయి. షాలిని కి ౩వ వారం వరకు భారీ రేంజ్ లో ఓటింగ్ పడేది. కానీ గత వీకెండ్ లో శ్రేష్టి తో పాటు డేంజర్ జోన్ లోకి వచ్చింది. తాను ఎలిమినేట్ అయిపోతానేమో అని ఫిక్స్ అయిన షాలిని రోహిత్ పై తన ఫీలింగ్స్ ని వ్యక్తపరిచింది. నువ్వు అంటే నాకు పిచ్చి ఇష్టమని, నేను బయటకు వెళ్లిన తర్వాత ఆ ఫీలింగ్ ని నువ్వు మార్చవని అనుకుంటున్నాను అని, నీ కోసం బయట ఎదురు చూస్తూ ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది షాలిని.
ఇది రోహిత్ ఫ్యాన్స్ కి అసలు నచ్చడం లేదు. అసలే రోహిత్ ని హోస్ట్ నాగార్జున తో పాటు , హౌస్ మేట్స్ అందరూ టార్గెట్ చేశారు, అతను ఏ చిన్న తప్పు చేసినా భూతద్దం లో చూపించి ఇష్టమొచ్చినట్టు తిడుతున్నారు. ఇలాంటి సమయం లో షాలిని ఇలాంటి లవ్ ట్రాక్ పెట్టుకుంటే , తమ అభిమాన కంటెస్టెంట్ గేమ్ చెడిపోతుందని భావిస్తున్నారు. అయితే షాలిని ది నిజమైన ప్రేమ అనేది గత వీకెండ్ తో స్పష్టమైంది. ఎందుకంటే రోహిత్ కి సపోర్ట్ చెయ్యాలంటే భయపడే సందర్భాన్ని నాగార్జున శనివారం ఎపిసోడ్ లో క్రియేట్ చేశాడు, అలాంటి సందర్భంలో షాలిని రోహిత్ కి సపోర్టు గా నిల్చింది. అంతే కాకుండా , ఆమె తన లవ్ ని ఎలిమినేట్ అవ్వబోతున్నాను అనే సమయం లో రోహిత్ కి వ్యక్తపరిచింది. ఇందులో ఎలాంటి ఫేక్ లవ్ ట్రాక్ లేదని , షాలిని కి నిజంగానే రోహిత్ అంటే ఇష్టమని అర్థం అవుతున్నప్పటికీ, రోహిత్ ఫ్యాన్స్ చల్లబడడం లేదు, ఆమె వల్ల రోహిత్ టైటిల్ రేస్ కి దూరం అవుతాడనే భయం వారిలో నెలకొంది.
అందుకే ‘ఆపరేషన్ షాలిని’ ని మొదలు పెట్టారు రోహిత్ ఫ్యాన్స్. ఎలా అయినా ఆమెని ఎలిమినేట్ చెయ్యాలని కంకణం కట్టుకున్నారు. దీంతో ఈ వారం అపూర్వ , షాలిని ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్లిద్దరు ఎలిమినేట్ అయితే ‘అగ్ని పరీక్ష 2’ నుండి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో సగం మంది తగ్గిపోయారని అనుకోవచ్చు. వచ్చే వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు. అప్పుడు వర్షిణి కచ్చితంగా నామినేషన్స్ లోకి వస్తుంది కాబట్టి , ఆమె ఎలిమినేట్ అవుతుంది , ఆమెతో పాటు చరణ్ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీంతో ఇక కేవలం రోహిత్ , అమన్, ఝాన్సీ లు మాత్రమే నిలబడతారు.
రోహిత్ , అమన్ లు టాప్ 5 లో ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి , ప్రస్తుతం సెలబ్రిటీస్ నీడలో ఝాన్సీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు రాబోయే వారాల్లో ఉన్నాయి. సెలబ్రిటీలు ఈమెకు వెన్నుపోటు పొడుస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలా సెలబ్రిటీలు ప్లాన్ చేసుకొని మరీ అగ్ని పరీక్ష 2 కంటెస్టెంట్స్ మొత్తాన్ని బయటకు పంపిస్తున్నారు. ఈ వారం నామినేషన్స్ లో కూడా సెలబ్రిటీలు ‘అగ్ని పరీక్ష 2’ కంటెస్టెంట్స్ ని దారుణంగా టార్గెట్ చేసినట్టు సమాచారం. ఇలా అన్యాయంగా సామాన్యులపై సెలబ్రిటీలు చేస్తున్న ఈ టార్గెట్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.