Homeఎంటర్టైన్మెంట్Naga Chaitanya: నాగార్జున తో రొమాన్స్ చేసిన హీరోయిన్ నాగ చైతన్య కి క్రష్..? ఇదేమి...

Naga Chaitanya: నాగార్జున తో రొమాన్స్ చేసిన హీరోయిన్ నాగ చైతన్య కి క్రష్..? ఇదేమి ట్విస్ట్ సామీ!

Naga Chaitanya: అక్కినేని ఫ్యామిలీ లో ప్రస్తుతం మార్కెట్ పరంగా, క్రేజ్ పరంగా నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) కి ఉన్నంతలో ఏ హీరో కి కూడా లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మధ్యలో కొన్నాళ్ళు డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు వచ్చాయి కానీ, మళ్లీ ‘తండేల్’ చిత్రంతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. అక్కినేని కుటుంబం లో మొట్టమొదటి వంద కోట్ల గ్రాస్ సినిమా ఇది. ప్రస్తుతం ఆయన ‘వృషకర్మ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. విరూపాక్ష చిత్రం తో ఇండస్ట్రీ లో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న కార్తీక్ దందు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది ఏడాది సెకండ్ హాఫ్ లో విడుదల కానుంది. ఇదంతా పక్కన పెడితే గతం లో నాగ చైతన్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన క్రష్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

మీ మొట్టమొదటి సెలబ్రిటీ క్రష్ ఎవరని యాంకర్ అడగ్గా, దానికి నాగ చైతన్య సమాధానం చెప్తూ ‘చిన్నప్పుడు నాకు సుష్మిత సేన్ అంటే చాలా ఇష్టం ఉండేది. బహుశా ఆమెనే నా మొట్టమొదటి క్రష్’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇందులో వింతేమీ ఉంది, అందరికి ఉన్నట్టుగానే నాగ చైతన్య కి కూడా చిన్న తనంలో ఆమె అంటే క్రష్ ఉన్నింది, దీని గురించి ఇప్పుడు స్పెషల్ గా ఎందుకు మాట్లాడుకుంటున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ సుష్మిత సేన్ గతంలో అక్కనేని నాగార్జున తో కలిసి ‘రచ్చగన్’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఇది నాగార్జున మొట్టమొదటి తమిళ చిత్రం, తెలుగులో రక్షకుడు పేరుతో విడుదలైంది. ఆరోజుల్లో భారీ అంచనాల నడుమ విడుదలైన కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది. కానీ ఈ చిత్రం లో సుష్మిత సేన్ అందాలను చూసి ఫిదా అవ్వని యువకుడు అంటూ ఎవ్వరూ ఉండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అలా నాగ చైతన్య కూడా ఆమెకు ఫిదా అయిపోయారు. అందుకే సోషల్ మీడియా లో తండ్రి తో రొమాన్స్ చేసిన హాట్ బ్యూటీ అంటే నాగ చైతన్య క్రష్ అట అంటూ ప్రచారం చేస్తున్నారు నెటిజెన్స్. సుష్మిత సేన్ ఈ చిత్రం తర్వాత సౌత్ లో మరో సినిమాలో కనిపించలేదు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం నాగ చైతన్య చేస్తున్న ‘వృషకర్మ’ చిత్రం మిస్టిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. అంటే గోపీచంద్ ‘సాహసం’ సినిమాలాగా అన్నమాట. ఈ చిత్రం లో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular