Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: నాగ చైతన్య కంటే నేనే బెటర్ అంటూ త్రిగున్ హాట్...

Bigg Boss 10 Telugu: నాగ చైతన్య కంటే నేనే బెటర్ అంటూ త్రిగున్ హాట్ కామెంట్స్!

Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో విచిత్రమైన పర్సనాలిటీ తో ప్రవర్తిస్తున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది త్రిగున్ మాత్రమే. త్రిగున్ లాంటి మనుషులు బయట ఉంటారా?, కావాలని గేమ్ లో స్పెషల్ గా కనిపించడం కోసం ఇలా ప్రవర్తిస్తున్నాడా? అనే సందేహాలు ఆడియన్స్ లో ఉన్నాయి. చుట్టూ పక్కన వంద కెమెరాలు ఉన్నాయి అనే స్పృహ అసలు లేదు , జనాలు చూస్తున్నారు , ఏమనుకుంటారో అనే […]

Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో విచిత్రమైన పర్సనాలిటీ తో ప్రవర్తిస్తున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది త్రిగున్ మాత్రమే. త్రిగున్ లాంటి మనుషులు బయట ఉంటారా?, కావాలని గేమ్ లో స్పెషల్ గా కనిపించడం కోసం ఇలా ప్రవర్తిస్తున్నాడా? అనే సందేహాలు ఆడియన్స్ లో ఉన్నాయి. చుట్టూ పక్కన వంద కెమెరాలు ఉన్నాయి అనే స్పృహ అసలు లేదు , జనాలు చూస్తున్నారు , ఏమనుకుంటారో అనే భయం లేదు, ఈ మాట మాట్లాడితే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఆలోచన లేదు , తనకు ఏది అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్తున్నాడు. నెగెటివ్ గేమ్ తో ఇంతటి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న కంటెస్టెంట్ బిగ్ బాస్ హిస్టరీ లో ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. త్రిగున్ లేని బిగ్ బాస్ 10 ని ఊహించుకోవడం కూడా కష్టమే అన్నట్టుగా తయారైంది పరిస్థితి.

ఇదంతా కేవలం బిగ్ బాస్ త్రిగున్ కొని తెచ్చుకున్న క్యారెక్టర్ లాగా ఉంది, బయట ఆయన చాలా మామూలుగా ఉంటాడేమో అని అంతా అనుకున్నారు. కానీ త్రిగున్ పాత ఇంటర్వ్యూస్ కొన్ని చూస్తే అతను ఎంత అగ్రేసీవ్ గా ఉంటాడో అర్థం అవుతుంది. బయట ఉన్నట్టుగానే, బిగ్ బాస్ హౌస్ లో కూడా ఉంటున్నాడనే క్లారిటీ అందరికీ వస్తుంది. ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడతూ నా మొదటి సినిమాలు కథ, నాగ చైతన్య జోష్ చిత్రాలు ఒకే సమయం లో విడుదల అయ్యాయి, ఆ రెండు సినిమాల్లో మా ఇద్దరి నటన చూడండి, ఎవరు బాగా చేసారో మీకే క్లారిటీ వస్తుంది అంటూ యాటిట్యూడ్ తో సమాధానం చెప్తాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

దీనిని రోహిత్ అభిమానులు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ నాగార్జున ని ట్యాగ్ చేసి మీ కొడుకు పై ఎలాంటి కామెంట్స్ చేసాడో చూడండి అంటున్నారు. అయితే ఇక్కడ త్రిగున్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. గతం లో ఈ మాట మాట్లాడాడు కాబట్టి కచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత నెటిజెన్స్ ఈ ఇంటర్వ్యూ ని బయటకు తీసి తనని టార్గెట్ చేస్తారు అనే విషయం త్రిగున్ కి తెలుసు. అయినప్పటికీ ఆయన ధైర్యం గా హౌస్ లోకి అడుగుపెట్టి , తనకు అనిపించింది చేసుకుంటూ వెళ్తున్నాడంటే , సాధారణమైన విషయం కాదు అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper