Homeఆంధ్రప్రదేశ్‌Vijayawada Politics: పొలిటికల్ గుసగుస: విజయవాడ మీద చేతులెత్తేసిన వైసిపి..

Vijayawada Politics: పొలిటికల్ గుసగుస: విజయవాడ మీద చేతులెత్తేసిన వైసిపి..

Vijayawada Politics: అధికారంలో ఉన్నప్పుడు విపరీతమైన పోటీ. అందరూ తాడేపల్లికి వెళ్లేవారు. జగన్ దర్శన భాగ్యం కోసం ఎదురుచూసేవారు. జగన్ కలిసే అవకాశాలు లేకపోవడంతో సజ్జలను కలిసి తమ విన్నపాలను విన్నవించుకునేవారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. అధికారం లేదు. మిగతా వాళ్ళు పోటీ చేసే అవకాశం లేదు. అధికారంలో ఉన్నప్పుడు దాచుకున్న వాళ్ళు.. బ్రహ్మాండంగా వెనకేసుకున్నవాళ్లు.. మాకెందుకులే అన్నట్టుగా ఉండిపోతున్నారు. దీంతో అసలు పోటీ చేస్తారా.. పోటీ చేసే అవకాశం ఉందా.. అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. […]

Vijayawada Politics: అధికారంలో ఉన్నప్పుడు విపరీతమైన పోటీ. అందరూ తాడేపల్లికి వెళ్లేవారు. జగన్ దర్శన భాగ్యం కోసం ఎదురుచూసేవారు. జగన్ కలిసే అవకాశాలు లేకపోవడంతో సజ్జలను కలిసి తమ విన్నపాలను విన్నవించుకునేవారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. అధికారం లేదు. మిగతా వాళ్ళు పోటీ చేసే అవకాశం లేదు. అధికారంలో ఉన్నప్పుడు దాచుకున్న వాళ్ళు.. బ్రహ్మాండంగా వెనకేసుకున్నవాళ్లు.. మాకెందుకులే అన్నట్టుగా ఉండిపోతున్నారు. దీంతో అసలు పోటీ చేస్తారా.. పోటీ చేసే అవకాశం ఉందా.. అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరి దృష్టి ముఖ్యంగా విజయవాడ మేయర్ స్థానం మీద ఉంది. కూటమిలో అయితే పోటీ విపరీతంగా ఉంది. జనసేన కూడా తగ్గేదే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఇక టిడిపి నుంచి అయితే చాంతాడంత జాబితా ఉంది. ఇప్పుడే కాదు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా టిడిపి నుంచి విపరీతంగా పోటీ ఉండేది. నాడు జరిగిన విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో 64 డివిజన్లు ఉంటే.. ఇందులో వైసిపి 49 గెలుచుకుంది. అంటే ఎక్కడ కూడా వైసిపికి వైట్ వాష్ చేసే అవకాశం టిడిపి ఇవ్వలేదు. పైగా నాడు జరిగిన ఎన్నికల్లో అన్ని స్థానాలలో గెలవాలని జగన్ గట్టిగా డిసైడ్ అయ్యారు. కానీ టిడిపి నాయకులు ఆయన అంచనాలను తలకిందులు చేశారు.

నాడు వైసిపి ఆ స్థాయిలో చేస్తేనే విజయవాడలో 49 డివిజన్లు దక్కాయి. మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా.. పైగా కూటమి బలంగా ఉంది. విజయవాడ అభివృద్ధి విషయంలో తగ్గేదే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తోంది. అలాంటప్పుడు విజయవాడ లో వైసీపీ పోటీ చేస్తుందా.. ఒకవేళ పోటీ చేస్తే మేయర్ అభ్యర్థి ఎవరు.. అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. అయితే వైసిపి నుంచి పోటీ విషయంలో ఇంతవరకు ఆ పార్టీ అధినాయకత్వం స్పందించలేదు. పైగా ఈ వ్యవహారంలో కొంతమంది కీలక నాయకులు టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటున్నారు.

ఒకవేళ అభ్యర్థిని ప్రకటిస్తే ఆర్థిక మూలాలు దెబ్బతీసే అవకాశం ఉంది కాబట్టి.. తమ చెప్పడం లేదని వైసీపీ నాయకులు సరికొత్త పల్లవి అందుకుంటున్నారు.. కానీ, వాస్తవం మాత్రం అలా లేదు. పార్టీ అధినాయకత్వం నుంచి ఆర్థికంగా భరోసా లభించడం లేదు. పైగా కూటమినేతలను ఎదుర్కొని నిలబడాలి అంటే అంత ఈజీ కాదు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలలో ఒక రకమైన నిరాశ ఉంది. అలాంటప్పుడు అందరినీ కలుపుకొని పోవాలంటే అంత ఈజీ కాదు. ఇదంతా ఎందుకు అని చాలామంది మేయర్ వద్దు.. పోటీ కూడా వద్దు అన్నట్టుగా దూరంగా ఉంటున్నారు. అందువల్లే విజయవాడ మేయర్ విషయంలో వైసిపి ఎటువంటి లీకులు బయటికి ఇవ్వడం లేదని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ఇక విజయవాడ మేయర్ విషయంలో టిడిపి ఇప్పటికే ఒక అంచనాకొచ్చింది. జనసేన నుంచి పోటీ ఉన్నప్పటికీ.. మరో కీలకమైన కార్పొరేషన్ ఆ పార్టీకి కేటాయించి.. విజయవాడ మీద పాగా వేయాలని ఆ పార్టీ బలంగా కోరుకుంటున్నది. టిడిపి తో పోల్చి చూస్తే విజయవాడలో జనసేనకు బలమైన ఓటు బ్యాంకు లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాంటప్పుడు విజయవాడ విషయంలో టిడిపి తో తగువులు పెట్టుకోకుండా.. బలం ఉన్నచోట మాత్రమే పోటీ చేయాలని.. అక్కడ మాత్రమే సత్తా చూపించాలని.. అదే జనసేనకు శిరోధార్యం అని పొలిటికల్ విశ్లేషకులు చెబుతున్నారు. మరి దీనిపై జనసేన అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper