Bigg Boss 10 Telugu: ఇప్పటి వరకు ప్రసారమైన ప్రతీ తెలుగు బిగ్ బాస్ సీజన్ లో లవ్ ట్రాక్స్ ఉండేవి. కానీ ఇలాంటి లవ్ ట్రాక్స్ పై ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపించరు. అలాంటి లవ్ ట్రాక్స్ పెట్టుకున్న కంటెస్టెంట్స్ గేమ్ కూడా చాలా దెబ్బ తినింది. ఉదాహరణకు షణ్ముఖ్ , సిరి ని తీసుకోవచ్చు. షణ్ముఖ్ కి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కి అవలీల గా టైటిల్ విన్నర్ అవ్వగలడు. మొదటి ఆరు వారాలు షణ్ముఖ్ నే టాప్ లో ఉండేవాడు. కానీ ఎప్పుడైతే సిరి తో లవ్ ట్రాక్ ముదిరిందో , అప్పటి నుండి ఆయన గ్రాఫ్ పూర్తిగా గాడి తప్పింది. సీజన్ 8 లో నిఖిల్, యష్మీ లవ్ ట్రాక్ కారణంగా ఇద్దరి గేమ్ ఎఫెక్ట్ అయ్యింది. టాప్ 5 లో ఉండాల్సిన యాష్మి 12 వ వారం లో ఎలిమినేట్ అయిపోయింది.
ఇక ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అగ్ని పరీక్ష 2 ద్వారా ఎంట్రీ ఇచ్చిన రోహిత్ , షాలిని మధ్య రిలేషన్ ని మనం మొదటి వారం నుండి చూస్తూనే ఉన్నాం. వీళ్లిద్దరి మధ్య ఉన్నది ప్రేమ అని కొందరు, స్నేహం అని మరికొందరు అనుకునేవారు. కానీ నిన్నటితో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోంది అనేది స్పష్టమైంది. నిన్నటి ఎపిసోడ్ లో శ్రేష్టి తో పాటు ఎలిమినేషన్ రౌండ్ లోకి వచ్చిన షాలిని , రోహిత్ వద్ద కూర్చొని నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను ఈరోజు బయటకు వెళ్లిపోయిన తర్వాత నా మీద నీ ఫీలింగ్స్ మారవని అనుకుంటున్నాను, నీకోసం బయట ఎదురు చూస్తూ ఉంటాను , నువ్వు నాకు లైఫ్ లాంగ్ కావాలి అని ప్రపోజ్ చేస్తుంది షాలిని. దీన్ని చూసిన రోహిత్ ఫ్యాన్స్, అనవసరం గా ఈ లవ్ ట్రాక్ రోహిత్ గేమ్ ని నాశనం చేస్తుందని భయపడుతున్నారు.
ఇప్పటికే రోహిత్ ని అన్ని యాంగిల్స్ నుండి టార్గెట్ చేస్తున్నారు. చివరికి హోస్ట్ నాగార్జున కూడా రోహిత్ ని దారుణంగా టార్గెట్ చేస్తూ , ప్రతీ వారం తిడుతున్నాడు. సెలబ్రిటీస్ ఎలాగో రోహిత్ ని టార్గెట్ చేస్తూనే ఉంటారు , ఇష్టమొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటారు , ఇలాంటి సమయం లో మానసికంగా రోహిత్ చాలా డౌన్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. వీటికి తోడు ఈ లవ్ ట్రాక్ కూడా రోహిత్ కి పెద్ద భారం అవ్వనుంది. తన గేమ్ ని స్వేచ్ఛగా ఆదుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ వీటి అన్నిటిని తట్టుకొని , రోహిత్ తన గేమ్ పై ఫోకస్ చేస్తే మాత్రం అతన్ని అందుకోవడం ఎవరి తరం కాదని అనడంలో ఎలాంటి సందేహం లేదు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.