Homeటాప్ స్టోరీస్Revanth Reddy : రేవంత్ గ్లోబరీనా తేనె తుట్టెను కదుపుతున్నాడు.. కేటీఆర్ ను ఏం చేయబోతున్నాడు..

Revanth Reddy : రేవంత్ గ్లోబరీనా తేనె తుట్టెను కదుపుతున్నాడు.. కేటీఆర్ ను ఏం చేయబోతున్నాడు..

Revanth Reddy : నిజమే ఫార్ములా ఈ కారు రేసులో.. ఏసిబి అనుమతులు తీసుకుంది. కేటీఆర్ ను విచారించింది.. కేటీఆర్ పై విచారణ అంటే యావత్తు తెలంగాణపై విచారణ అని నమస్తే తెలంగాణ రాసింది. గులాబీ పార్టీ కార్యకర్తలు సరే సరి. సోషల్ మీడియాలో ఆ రచ్చ సరేసరి. ఆ కేసులో విచారణ.. దర్యాప్తు.. అనేక పెద్ద పెద్ద మాటలు వినిపించినప్పటికీ.. అది ఏమైందో తెలియదు. పైగా తెలంగాణలో ఇప్పుడు రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. కొండా సురేఖ […]

Revanth Reddy : నిజమే ఫార్ములా ఈ కారు రేసులో.. ఏసిబి అనుమతులు తీసుకుంది. కేటీఆర్ ను విచారించింది.. కేటీఆర్ పై విచారణ అంటే యావత్తు తెలంగాణపై విచారణ అని నమస్తే తెలంగాణ రాసింది. గులాబీ పార్టీ కార్యకర్తలు సరే సరి. సోషల్ మీడియాలో ఆ రచ్చ సరేసరి.

ఆ కేసులో విచారణ.. దర్యాప్తు.. అనేక పెద్ద పెద్ద మాటలు వినిపించినప్పటికీ.. అది ఏమైందో తెలియదు. పైగా తెలంగాణలో ఇప్పుడు రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. కొండా సురేఖ వ్యవహారంతో రేవంత్ రెడ్డి పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయారు.. అయితే ఇకపై గులాబీ పార్టీ నేతలపై ఎటువంటి చర్యలు ఉండవా.. వారు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అక్రమాల మీద ఎటువంటి శిక్షలు ఉండవా.. రేవంత్ రెడ్డి పూర్తిగా లైన్ తప్పాడా.. ఇక ఆయన ఏం చేయలేడా.. ఇదిగో ఇలాంటి చర్చలు పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతున్నాయి. కానీ సైలెంట్ గా ఉండే రకం కాదు రేవంత్ రెడ్డి. ఆల్రెడీ మొదలుపెట్టాడు.. తవ్వకాలు స్టార్ట్ చేశాడు

అధికారంలో ఉన్నవారు మీడియాకు లీకులు ఇస్తుంటారు. వాటి ఆధారంగా విశ్లేషణ చేయడం మీడియా పని. అలా మీడియాలో వచ్చింది ఒక వార్త.. దాని సారాంశం ఏంటంటే.. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్లోబరీనా అనే సంస్థ చేసిన అరాచకాలు మామూలువి కాదు. ఏకంగా 23 మంది ఇంటర్ పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు.. ఒక రకంగా ఆ కంపెనీ ఆ పిల్లల ఉసురు తీసుకుంది. అప్పట్లోనే పెద్ద రచ్చ జరిగింది. ఏకంగా రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. ఇప్పుడు తాజాగా ఈ కంపెనీ ప్రస్తావన ఎందుకంటే.. ఈ కంపెనీ వ్యవహారాలను రేవంత్ గెలుకుతున్నాడు. రేవంత్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే.. గ్లోబరీనా కంపెనీ కేటీఆర్ బినామీ అని ఆరోపించాడు. దానిని కేటీఆర్ కాదు అంటూ తప్పు పడుతూనే వచ్చాడు. అప్పట్లోనే ఒక లీగల్ నోటీస్ కూడా పంపించాడు. ఇక తాజాగా మీడియాలో వస్తున్న వార్తలు ప్రకారం రాష్ట్రంలో సరిగా ఏడు సంవత్సరాల క్రితం ఇంటర్ ఫలితాల ప్రాసెసింగ్ టెండర్ ను గ్లోబరీనా కంపెనీ దక్కించుకుంది. ఆ కంపెనీ మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ షురూ అయింది. విచారణ అధికారులు ఇంటర్ బోర్డు కార్యాలయానికి చేరుకుని.. 2019లో ఇంటర్ బోర్డు కార్యదర్శిగా పనిచేసిన అశోక్ ను విచారించారు. నాలుగు గంటల పాటు ఈ విచారణ సాగింది. గతంలో ఫలితాలు ప్రాసెసింగ్ చేసినప్పుడు ఫ్రీ ఎగ్జామ్స్ కు .. పోస్ట్ ఎగ్జామ్స్ కు వేర్వేరు సంస్థలు ఉండేవి. అయితే దానిని ఇంటిగ్రేడ్ చేయాలి అని నిర్ణయం ఎవరిదని అశోక్ ను విచారణ అధికారులు ప్రశ్నించారు. నాడు కన్సల్టెంట్ లా సూచన మేరకే తాము ఆ నిర్ణయం తీసుకున్నట్టు అశోక్ చెప్పారు. ఇక టెండర్ల విషయంలో రెండుసార్లు ఎందుకు పిలిచారని ప్రశ్నిస్తే.. ముందుగా ఏ సంస్థలు కూడా ముందుకు రాలేదని.. ఆ తర్వాత నిబంధనలు మార్చడం వల్ల సంస్థలు వచ్చాయని అశోక్ చెప్పారు. నిబంధనలు ఎందుకోసం మార్చారు అని ప్రశ్నిస్తే అశోక్ మౌనంగా ఉండి పోయారు.

ఇక ప్రస్తుతం గ్లోబరినా సంస్థ పేరు మారిపోయింది.. దానికి కో ఎంప్ట్ అనే పేరు పెట్టారు. సరిగ్గా జూలై 24న మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ పై రేవంత్ విమర్శలు చేశారు. గ్లోబరీనా అనేది కేటీఆర్ బినామీ కంపెనీ అని.. కేటీఆర్ కు ఎటువంటి సంబంధం లేకుంటే సిసిఎస్ లో ఫిర్యాదు చేయాలని.. నిజాలు బయటపెడతామని హెచ్చరించారు. అయితే నాడు ఆ సంస్థ ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్లే 23 మంది విద్యార్థులు చనిపోయారని సీఎం ప్రశ్నించారు.. సరిగ్గా ఆ విలేకరుల సమావేశంలోనే త్వరలోనే విజిలెన్స్ విచారణ జరుగుతుందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఆయన హెచ్చరించినట్టుగానే విచారణ అయింది.

ఇక 2018లో టెండర్లను ఆహ్వానించడం.. 4.57 కోట్ల విలువైన టెండర్ ను గ్లోబరీనా కంపెనీకి దక్కే విధంగా చేయడం.. 2019 మార్చిలో ఇంటర్ ఫలితాల ప్రాసెసింగ్ వ్యవహారాన్ని ఆ సంస్థ చేపట్టడం వంటి విషయాలను విచారణ అధికారులు సేకరించారు. అయితే ఈ కేసును రేవంత్ రెడ్డి లోతుగా తవ్వితే ఏం జరుగుతుంది.. కేటీఆర్ అరెస్టు సాధ్యమవుతుందా.. కేటీఆర్ బినామీ కంపెనీ గ్లోబరీనా అని నిరూపించగలడా.. లేదా దీనిని కూడా ఫార్ములా ఈ కారు రేసు మాదిరిగానే చేయగలడా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుందని విశ్లేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper