Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan Mohan Reddy: పొలిటికల్ గుసగుస: విశాఖ, గుంటూరు, నెల్లూరు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలను...

YS Jagan Mohan Reddy: పొలిటికల్ గుసగుస: విశాఖ, గుంటూరు, నెల్లూరు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలను నమ్ముకున్న జగన్

YS Jagan Mohan Reddy: వైసీపీలో వారసత్వ రాజకీయాలు జోరుగా సాగుతూ ఉంటాయి. జగన్ కూడా వైయస్ వారసుడే కాబట్టి.. పైగా ఆయన పేరు చెప్పుకునే పార్టీకి పేరు పెట్టుకున్నారు. వైయస్ పేరు లేకుంటే జగన్ కు ఈరోజుకు కూడా గుర్తింపు లేదు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి వేసిన రాజకీయ పునాదులు అటువంటివి. జగన్ పార్టీలో కూడా వారసత్వ రాజకీయాలు జోరుగా సాగుతూ ఉంటాయి. అందువల్లే ఆ పార్టీలో ఉన్న నాయకులు తమ వారసులను లేదా బంధువులను.. ఇతర […]

YS Jagan Mohan Reddy: వైసీపీలో వారసత్వ రాజకీయాలు జోరుగా సాగుతూ ఉంటాయి. జగన్ కూడా వైయస్ వారసుడే కాబట్టి.. పైగా ఆయన పేరు చెప్పుకునే పార్టీకి పేరు పెట్టుకున్నారు. వైయస్ పేరు లేకుంటే జగన్ కు ఈరోజుకు కూడా గుర్తింపు లేదు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి వేసిన రాజకీయ పునాదులు అటువంటివి. జగన్ పార్టీలో కూడా వారసత్వ రాజకీయాలు జోరుగా సాగుతూ ఉంటాయి. అందువల్లే ఆ పార్టీలో ఉన్న నాయకులు తమ వారసులను లేదా బంధువులను.. ఇతర అనుచరులను రాజకీయాల్లోకి తీసుకొస్తూ ఉంటారు.

ప్రస్తుతం ఏపీలో పురపాలక ఎన్నికలు జరగబోతున్నాయి. వైసిపి ఇప్పుడు అధికారం లేదు. అలాగని పూర్తిగా హ్యాండ్సప్ అవ్వకుండా.. గట్టిగా పోరాటం చేయాలని నేతలు నిర్ణయించుకున్నారు. అందువల్లే కీలకమైన నగర పాలకాలలో పోటీకి సై అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. నాడు విశాఖపట్నం.. గుంటూరు.. నెల్లూరు నగర పాలకాలను వైసిపి దక్కించుకుంది. అయితే ఈసారి కూడా ఆ మూడు స్థానాల మీద గట్టిగా దృష్టి సారించినట్టు సమాచారం.. అందువల్లే ఈ మూడు కార్పొరేషన్లలో కొత్త పేర్లు తెరమీదకి వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది.

విశాఖపట్నంలో బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష.. గుంటూరు నుంచి మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక.. నెల్లూరు నుంచి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత పేర్లు వినిపిస్తున్నాయి. విశాఖపట్నం వైసిపికి కీలకమైన రాజకీయ కేంద్రం. ఇక్కడ బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. పొలిటికల్గా యాక్టివ్ గా ఉన్న అనూషకు ఇటీవల భీమిలి సెగ్మెంట్ బాధితులు అప్పగించింది పార్టీ. వాస్తవానికి ఆమెను జిల్లా పరిషత్ కు పోటీ చేయించే ఆలోచనలో బొత్స ఉన్నారని చర్చ కూడా నడిచింది. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు వేరే విధంగా మారిపోయాయి. దీంతో భీమిలి అనూష చేతికి సొంతమయ్యాయి. భీమిలిలో పార్టీని బలోపేతం చేస్తూనే.. విశాఖ మేయర్ పీఠం రేసులో అనూషను నిలబడితే ఎలా ఉంటుందనే ఆలోచన వైసీపీకి వచ్చినట్టు తెలుస్తోంది.

ఇక గుంటూరు కార్పొరేషన్ విషయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక పేరు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఈమె తండ్రికి సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఆమధ్య రాంబాబు కు సంబంధించిన కొన్ని వ్యవహారాలు చర్చకు దారి తీసినప్పుడు మౌనిక పొలిటికల్ స్క్రీన్ మీదకి వచ్చారు. నాడు ఆమె తండ్రికి సపోర్ట్ గా నిలిచారు. ఇక అధికార పక్షానికి గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. నాడు రాంబాబుకు సరైన వారసురాలు దొరికిందని రాజకీయవర్గాలలో చర్చ మొదలైంది. రాంబాబు ఆ మధ్య జైలుకు వెళ్లిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ తర్వాత మౌనిక అంతగా కనిపించలేదు. అయినా సరే ఆమెనే గుంటూరుకు దించితే బాగుంటుంది అని చర్చ నడుస్తోంది.

నెల్లూరు కార్పొరేషన్ విషయానికొస్తే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత పేరు వినిపిస్తోంది. గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయిన సమయంలో పూజిత తండ్రికి సపోర్ట్ గా నిలిచారు. రాజకీయంగా స్పందించారు. ప్రస్తుతం ఆమె వైసీపీ మహిళా విభాగం సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. అనూష, మౌనికతో పోల్చి చూస్తే పూజిత పార్టీ వ్యవహారాలలో ప్రత్యక్షంగా.. పరోక్షంగా పాత్రలు పోషిస్తున్నారు. రాజకీయంగా యాక్టివ్గా కొనసాగుతున్నారు.. సో ఈ దగ్గర 3 ముఖ్యమైన కార్పొరేషన్లలో ముగ్గురు వారసురాళ్లను రంగంలోకి దింపితే.. క్యాడర్లో కూడా ఉత్సాహం పెరుగుతుందని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు.. తండ్రులకు సీనియారిటీ ఉండడం.. కుమార్తెలు కూడా దూకుడుగా ఉండడంతో రాజకీయంగా కలిసి వస్తుందని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. అయితే ఇంతవరకు రిజర్వేషన్లు తేలలేదు కాబట్టి.. రాజకీయ సమీకరణాలు.. కేడర్ అభిప్రాయాలు.. ఇతర విషయాలను పరిశీలనలోకి తీసుకున్న తర్వాత వీరి ముగ్గురి పోటీ గురించి అసలు విషయాలు బయటకు తెలుస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper