Toxic Movie: మరికొద్ది గంటల్లో కన్నడ సూపర్ స్టార్ యాష్ నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ‘టాక్సిక్’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎప్పుడో మార్చి 19 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా, కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. జూన్ నెలలో విడుదల చెయ్యాలని అనుకున్నారు కానీ , చివరికి ఆగస్టు 26 కి షిఫ్ట్ అయ్యింది. ఈసారి ఎలాంటి వాయిదా లేకుండా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే యాష్ రేంజ్ ఏంటి?, ప్రభాస్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ తరహాలోనే , మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ ని రాబట్టేంత సత్తా ఉందా?, లేదా వన్ మూవీ వండర్ లాగా, కేజీఎఫ్ హీరో లాగానే మిగిలిపోతాడా అనే అనుమానాలు ట్రేడ్ వర్గాల్లో ఉండేవి. అలా ఆయన స్టార్ స్టేటస్ ని అనుమానించిన ప్రతీ ఒక్కరికి ‘టాక్సిక్’ అడ్వాన్స్ బుకింగ్స్ తో దిమ్మ తిరిగే రేంజ్ లో సమాధానం ఇచ్చాడు యాష్.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో జరిగాయి. ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టం ద్వారా , ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు అన్ని భాషలకు కలిపి 60 కోట్ల రూపాయలకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయట. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 60 వేల టికెట్లు అమ్ముడుపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే టికెట్ రేట్స్ పెంచినప్పటికీ కూడా జనాలు ఎగబడి ఈ వెళ్ళబోతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో అయితే స్టార్ హీరో సినిమా కి పెట్టినట్టు స్పెషల్ షోస్ పెట్టారు. ఒక్కో టికెట్ ధర 600 రూపాయిలు. ఇవి హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. దీన్ని బట్టీ ఈ చిత్రానికి ఆడియన్స్ లో ఏ రేంజ్ క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టీ చూస్తుంటే ఈ చిత్రం కచ్చితంగా 100 నుండి 120 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ముఖ్యంగా నార్త్ ఇండియా అడ్వాన్స్ బుకింగ్స్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. కేవలం ప్రభాస్, అల్లు అర్జున్ , రామ్ చరణ్ లకు మాత్రమే నార్త్ ఇండియా లో క్రేజ్ ఉందని ఇన్ని రోజులు అనుకున్నారు. కానీ యాష్ కి వాళ్లకు మించిన క్రేజ్ ఉందని అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే అర్థం అవుతోంది. ముఖ్యంగా మాస్ సెంటర్స్ లో అయితే ఖాన్స్ సినిమాలకంటే ఈ చిత్రానికే ఎక్కువ క్రేజ్ ఉంది అట. ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ ట్రెండ్ ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి కచ్చితంగా నార్త్ ఇండియా నుండి 40 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వస్తాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక పాజిటివ్ టాక్ రావడం ఒక్కటే బ్యాలన్స్, అవలీలగా ఈ చిత్రం 1000 కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుంది.