Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ మొత్తం గొడవలతో , కుట్రలతో నిండిపోయింది. ఇలాంటి వాతావరణం లో పాజిటివ్ ఎనర్జీ తో ఒక కంటెస్టెంట్ ఉండడం అసాధ్యం. అయినప్పటికీ కూడా శ్రేష్టి వ్యాకరణం పాజిటివ్ గా ఉండేందుకు ప్రయత్నం చేసింది. ఎంత పాజిటివ్ అంటే , ప్రతీ ఒక్కరితోనూ చాలా స్నేహం గా ఉంటుంది, అంతే కాకుండా కంటెస్టెంట్స్ మధ్య ఎంత పెద్ద గొడవ జరిగినా , వాళ్ళని కలిపే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది, స్నేహానికి చాలా విలువ ఇస్తుంది , ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి లక్షణాలు ఈ అమ్మాయిలో ఉండేవి. ముఖ్యంగా రోహిత్ తో ఈమె స్నేహాన్ని ఆడియన్స్ చాలా ఇష్టపడేవాళ్లు. ఇలాంటి స్నేహితురాలు ప్రతీ ఒక్కరి జీవితం లో ఉండాలి అని అనుకునేవారు నెటిజెన్స్.
ఇంతటి పాజిటివిటీ ని సొంతం చేసుకున్న శ్రేష్టి , మూడవ వారం సుధీర్ పట్ల సహనం కోల్పోయి, అగ్రెషన్ తో వ్యవహరించిన తీరు కారణంగా నిన్నటి ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయ్యింది. వాస్తవానికి శ్రేష్టి బిగ్ బాస్ హౌస్ లో షాలిని , చరణ్ , ఝాన్సీ , వంశీ , వర్షిణి కంటే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. గత వారం టాస్కుల్లో అద్భుతంగా ఆడి, నాగార్జున నుండి ప్రశంసలు కూడా అందుకుంది. అయినప్పటికీ ఎలిమినేట్ అవ్వడం బాధాకరం. ఎలిమినేట్ అయ్యాక ‘బిగ్ బాస్ బజ్’ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో సన్సేషనల్ గా మారింది. త్రిగున్ అంటే నాకు ఇష్టమని చెప్పిన శ్రేష్టి , రోహిత్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అగ్ని పరీక్ష 2 నుండి రోహిత్ తో స్నేహం చేస్తూ వచ్చిన శ్రేష్టి , ఒక్కసారిగా ఇలా అతని గురించి మాట్లాడకపోవడం పై నెటిజెన్స్ షాక్ కి గురయ్యారు.
రోహిత్ గురించి నెగెటివ్ గా మాట్లాడలేదు , అలా అని పాజిటివ్ గా కూడా మాట్లాడలేదు. అసలు అతని పేరే ప్రస్తావన కి తీసుకొని రాకపోవడం గమనార్హం. గత వారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో , రోహిత్ శ్రేష్టి చెయ్యి విరిగేంత పని చేయడాన్ని మనసులో పెట్టుకుందేమో , అందుకే ఆమె రోహిత్ పై కోపం తో ఉండి ఉండొచ్చు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే , శ్రేష్టి రాబోయే రోజుల్లో ఇచ్చే ఇంటర్వూస్ చూస్తే తెలుస్తుంది. ఇక పోతే నాలుగు వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు గానూ శ్రేష్టి కి 4 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు టాక్.