Homeఆంధ్రప్రదేశ్‌Amaravati:అమరావతిలో రోడ్ల నిర్మాణం.. సర్కారు ఆలోచనకు సెల్యూట్ చేయాల్సిందే..

Amaravati:అమరావతిలో రోడ్ల నిర్మాణం.. సర్కారు ఆలోచనకు సెల్యూట్ చేయాల్సిందే..

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరంలో మౌలిక సదుపాయాల కల్పన జోరుగా సాగుతోంది. 2019 నుంచి 2024 వరకు ఇక్కడ ముళ్ళ పొదలు కనిపించాయి. నిర్మాణాలు పడావు పడ్డాయి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రూపురేఖలు మారిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని భవనాలు సిద్ధమయ్యాయి. ముళ్ళ పొదలు తొలగించే పని పూర్తయింది. వాస్తవానికి ఏ ప్రాంతానికైనా సరే కనెక్టివిటీ అనేది అత్యంత ముఖ్యం. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి రాజధానికి కనెక్టివిటీ […]

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరంలో మౌలిక సదుపాయాల కల్పన జోరుగా సాగుతోంది. 2019 నుంచి 2024 వరకు ఇక్కడ ముళ్ళ పొదలు కనిపించాయి. నిర్మాణాలు పడావు పడ్డాయి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రూపురేఖలు మారిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని భవనాలు సిద్ధమయ్యాయి. ముళ్ళ పొదలు తొలగించే పని పూర్తయింది.

వాస్తవానికి ఏ ప్రాంతానికైనా సరే కనెక్టివిటీ అనేది అత్యంత ముఖ్యం. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి రాజధానికి కనెక్టివిటీ రోడ్లు ఉండాలి. రాజధాని నగరంలో కూడా రోడ్లు అద్భుతంగా ఉండాలి. ఈ నేపథ్యంలో రోడ్లమీద కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని గ్రీన్ మొబిలిటీకి పెద్దపీట వేస్తోంది. వాస్తవానికి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సాహసోపేతం. సాధారణంగా ఇటువంటి రహదారులను పెద్దపెద్ద నగరాలలో కూడా ఏర్పాటు చేసేందుకు వెనుకడుగు వేస్తారు. కానీ అమరావతిలో మాత్రం గ్రీన్ మొబిలిటీని మాత్రమే ప్రధానంగా తీసుకుంటున్నారు. కేవలం వాహనాల మార్గమే కాకుండా.. మాస్టర్ ప్లాన్ లో భాగంగా నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ కు అతిపెద్దమైన ప్రాధాన్యం ఇస్తున్నారు. కారు లేదా బైక్ లేకపోయినా సురక్షితంగా ఈ రోడ్డుమీద ప్రయాణించే విధంగా డిజైన్లు చేస్తున్నారు.

ఈ ప్రత్యేక స్మార్ట్ రోడ్లలో మూడు మీటర్ల వరకు ఫుట్పాత్ ఉంటుంది. మూడు మీటర్ల వరకు సైకిల్ ట్రాక్ ఉంటుంది. మూడు మీటర్ల గ్రీన్ బెల్ట్ ఏరియా కూడా ఉంటుంది. ఫుట్పాత్ ను సైకిల్ ట్రాక్ అంటే కొంత ఎత్తులో లేదా ఒకే స్థాయిలో ఉంచే విధంగా రెండు రకాల డిజైన్లను పరిశీలిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.. సైక్లిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఉండే విధంగా ప్రత్యేకమైన రంగులు లేదా పిగ్మెంటేషన్ ఉపయోగిస్తామని అధికారులు చెబుతున్నారు. వీటివల్ల వాహనాల మార్గం.. పాదచారుల మార్గం.. సైక్లిస్టుల మార్గం స్పష్టంగా తెలుస్తాయి. అంతేకాకుండా స్మార్ట్ వాటర్ బ్రెయిన్లపైన సైకిల్ ట్రాక్లు.. ఐ సి టి యుటిలిటీ డక్ట్ లు.. సీసర్ లైన్ ల పైన పాదాచారుల మార్గాలను ఏర్పాటు చేయబోతున్నారు. రోడ్డు.. డ్రైనేజీ.. పాదచారులు.. సైకిల్ ట్రాకులు మొత్తం ఒకే డిజైన్ లో రాబోతున్నాయి.

ఏపీ సిఆర్డిఏ ప్రణాళిక ప్రకారం అమరావతిలో సుమారు 3200 కిలోమీటర్ల మేర పాదచారుల మార్గాలు.. సైకిల్ ట్రాక్లు నెట్వర్క్ డెవలప్ చేస్తున్నారు. పార్కులు.. ఓపెన్ స్పేస్ లు.. గ్రీన్ పార్క్ ఏరియాలో.. ఈ నెట్వర్క్ లో అనుసంధానం చేస్తారు. వ్యక్తిగత వాహనాల వినియోగం పెరిగే సమయంలో ట్రాఫిక్ ఒత్తిడి ఏర్పడుతుంది. కాలుష్యం కూడా పెరిగిపోతుంది. అందువల్ల భవిష్యత్తు కాలంలో ట్రాఫిక్ ఒత్తిడి.. కాలుష్యాన్ని తగ్గించడానికి నడక.. సైక్లింగ్.. ప్రజా రవాణాను అనుసంధానం చేసి గ్రీన్ మొబిలిటీని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్మార్ట్ రోడ్లలో భాగంగా అందమైన టైల్స్ ఏర్పాటు చేస్తారు.. సెక్యూరిటీ.. వెలుతురు.. వాన నీరు పారే విధానం.. ట్రాఫిక్ నియంత్రణ.. వంటి అంశాలకు విపరీతమైన ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. అమరావతి మొత్తం ఈ స్మార్ట్ రోడ్లు విస్తరిస్తే రాజధాని రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper