Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నే ఓడించిన నాగ చైతన్య.. ఇది మామూలు మాస్ కాదు!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నే ఓడించిన నాగ చైతన్య.. ఇది మామూలు మాస్ కాదు!

Pawan Kalyan: సౌత్ ఇండియా లో ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ లో ఒకటి సైమా. గత 15 ఏళ్ళ నుండి ఈ సైమా అవార్డ్స్ వేడుక ఎంతో గ్రాండ్ గా జరుగుతూ వస్తోంది. ఈ ఏడాది కూడా బెంగళూరు లో ఈ అవార్డ్స్ ఫంక్షన్ ఎంతో అట్టహాసం గా జరిగింది. ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో ఊహించని సంఘటనలు చోటు చేసుకున్నాయి. బెస్ట్ యాక్టర్ క్యాటగిరీ లో ఓజీ చిత్రం నుండి పవన్ కళ్యాణ్, తండేల్ చిత్రం […]

Pawan Kalyan: సౌత్ ఇండియా లో ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ లో ఒకటి సైమా. గత 15 ఏళ్ళ నుండి ఈ సైమా అవార్డ్స్ వేడుక ఎంతో గ్రాండ్ గా జరుగుతూ వస్తోంది. ఈ ఏడాది కూడా బెంగళూరు లో ఈ అవార్డ్స్ ఫంక్షన్ ఎంతో అట్టహాసం గా జరిగింది. ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో ఊహించని సంఘటనలు చోటు చేసుకున్నాయి. బెస్ట్ యాక్టర్ క్యాటగిరీ లో ఓజీ చిత్రం నుండి పవన్ కళ్యాణ్, తండేల్ చిత్రం నుండి నాగ చైతన్య , కుబేర చిత్రం నుండి ధనుష్, హిట్ 3 చిత్రం నుండి నాని నామినేట్ అయ్యారు. కచ్చితంగా పవన్ కళ్యాణ్ కే అవార్డు వస్తుందని అంతా ఆశించారు. ఇదంతా ఓటింగ్ పద్దతిలోనే చేశారు. పవన్ కళ్యాణ్ కి అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టే , ఆయనకే ఈ అవార్డు దక్కుతుందని అనుకున్నారు.

కానీ ఎవ్వరూ ఊహించని విధంగా నాగ చైతన్య కి ఈ అవార్డు దక్కింది. దీంతో సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ ని ఓడించిన నాగ చైతన్య అంటూ మీమ్స్ ప్రచారం అవుతున్నాయి. ఓటింగ్ ని ఆధారంగా తీసుకొని అవార్డు ఇచ్చేలా ఉంటే కచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలవాలి. కానీ అలా జరగకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే సైమా అవార్డ్స్ ఈమధ్య కాలం లో నామమాత్రంగానే ఈ ఓటింగ్ ప్రక్రియ ని కొనసాగిస్తుంది. కానీ వాస్తవం ఏమిటంటే , ఆ సమయం లో నామినేషన్స్ లో ఉన్న హీరోల్లో , ఎవరైతే ఈవెంట్ కి హాజరయ్యేందుకు అందుబాటులో ఉంటారో , వాళ్ళకే అవార్డు ని ఇస్తారట. పవన్ కళ్యాణ్ ఎంత బిజీ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక నాని అయితే ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ విడుదల హడావిడి లో ఉన్నాడు. ధనుష్ కూడా అందుబాటులో లేకపోవడం తో , చివరికి నాగ చైతన్య కి ఈ అవార్డు సొంతమైంది.

ఇది ఆయన కెరీర్ లోనే మొట్టమొదటి సైమా అవార్డు అని చెప్పొచ్చు. కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నప్పటికీ , ఒక్క సినిమాకు కూడా అవార్డు రాలేదు. కానీ తండేల్ చిత్రానికి వచ్చింది. నిజానికి ఆ సినిమాలో నాగ చైతన్య అద్భుతంగానే నటించాడు. ఆయన కెరీర్ లోనే బెస్ట్ యాక్టింగ్ ఈ చిత్రం లోనే చేసాడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయనకు అవార్డు రావడం పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కూడా ఎలాంటి అభ్యంతరం లేకపోవడం తో , సోషల్ మీడియా లో పెద్దగా గొడవలు జరగడం లేదు. ఇకపోతే నాగ చైతన్య ప్రస్తుతం ‘వృష కర్మ’ అనే చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకునే దశలో ఉన్న ఈ సినిమా , దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper