Avinash Mishra: ఖత్రోన్ కే ఖిలాడి సీజన్ 15 విజేత గా అవినాష్ మిశ్రా నిలిచాడు. దీంతో ఇతడి పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది..ఖత్రోన్ కే ఖిలాడి సీజన్ 15 విజేతగా నిలిచిన అవినాష్ మిశ్రాకు 20 లక్షల నగదు బహుమతి లభించింది. దాంతోపాటు ట్రోఫీ.. కారు.. యూరప్ ట్రిప్ కూడా సొంతం చేసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్లో రిత్విక్ ధంజాని, ఓరీ ని ఓడించాడు.
అవినాష్ మిశ్రా చూసేందుకు బాలీవుడ్ హీరో లాగా ఉంటాడు. కాకపోతే అతడు బాలీవుడ్ హీరో కాదు. హిందీ టెలివిజన్లో దాదాపు దశాబ్ద కాలంగా నటిస్తున్నాడు. ఇతడు 1995 డిసెంబర్ 9న చత్తీస్ గడ్ ప్రాంతంలోని రాయ్ పూర్ ప్రాంతంలో జన్మించాడు..
నటుడిగా తన కెరియర్ మొదలుపెట్టకు ముందు.. ఇతడు డీజే గా పని చేశాడు. ఆ తర్వాత అనేక రకాల కమర్షియల్ ప్రకటనలలో కనిపించాడు. కెమెరా ముందు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. వచ్చిన తర్వాత మాత్రం ఇతడికి వరుసగా అవకాశాలు వచ్చాయి…
2017లో వచ్చిన సేత్ జీ అనే సీరియల్ ద్వారా తన కెరీర్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత అదే ఏడాది ప్యార్ తునే క్యా కియా ఇష్క్ బాజీ వంటి సీరియల్స్ లో కనిపించాడు. 2018 లో వచ్చిన మరియన్ ఖాన్ రిపోర్టింగ్ లైవ్ ఇతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఇతడు ఏ తేరీ గాలియన్ లో శంతను మజుందార్ పాత్రలో నటించిన ఆయనకు.. విశేషమైన గుర్తింపు దక్కింది.
అవినాష్ మిశ్రా కెరియర్లో కీలక మెట్టు నాథ్ జేవర్ ఏ జంజీర్ .. ఇది అత్యంత కీలకమైన ప్రాజెక్టుగా నిలిచింది. ఈ సీరియల్ ద్వారా అతడికి క్రేజ్ మరింత పెరిగింది. దాదాపు 10 ఏళ్లపాటు టెలివిజన్ రంగంలో కొనసాగుతూ పలు పాత్రలు పోషించాడు.
టెలివిజన్ సీరియల్స్ లో వచ్చిన గుర్తింపును అవినాష్ బిగ్ బాస్ 18లోకి వెళ్లడం ద్వారా మరింత పెంచుకున్నాడు. 2024లో ప్రసరమైన ఈ సీజన్లో అతడు ఫైనల్ దశ వరకు వెళ్లి.. నాలుగో స్థానంలో నిలిచాడు.. బిగ్ బాస్ లో అతడి ప్రదర్శన తర్వాత.. ఖత్రోన్ కే ఖిలాడి లో అంచనాలు పెరిగిపోయాయి.ఖత్రోన్ కే ఖిలాడి సీజన్ 15లో అవినాష్ మిస్రాకు అనేక రకాల సవాళ్లు ఎదురయ్యాయి. రోహిత్ శెట్టి నిర్వహించిన ఈ సీజన్లో కఠినమైన పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చింది.. అయితే ఆశ్చర్యకరంగా అవినాష్ ఒక్క టాస్క్ ను కూడా మధ్యలో వదిలిపెట్టలేదు. అంతేకాదు Swift immunity jacket ను అతడు దక్కించుకున్నాడు.. ఫైనల్ పోటీలో రిత్విక్, ఓరీ తో పోటీపడి విజేతగా నిలిచాడు.
విజయం తర్వాత అవినాష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇప్పటివరకు తనకు టెలివిజన్లో ఎక్కువగా గుడ్ లుకింగ్ పర్సన్ గా మాత్రమే చూసే వాళ్ళని.. ఇప్పుడు తనలో ఉన్న మరో కోణాన్ని కూడా ప్రేక్షకులకు చూపించానని అతడు చెప్పాడు. తనలో భయాలు ఎదుర్కొనే అవకాశాన్ని ఖత్రోన్ కే ఖిలాడి ఇచ్చిందని అతడు చెప్పుకొచ్చాడు.
డిజే నుంచి యాడ్స్.. ఆ తర్వాత సీరియల్స్.. అనంతరం బిగ్ బాస్.. ఇప్పుడు ఖత్రోన్ కా ఖిలాడీ 15 సీజన్ విజేత.. అంటే అవినాష్ మిశ్రా కథ ఒక్కసారిగా వచ్చిన విజయ గాధ కాదు. టెలివిజన్లో దాదాపు దశాబ్దం పాటు కొనసాగిన కెరియర్ కు ఖత్రోన్ కా ఖిలాడీ విజయం మరో పెద్ద గుర్తింపుగా మారింది..