Bigg Boss Telugu 10 Rohith Elimination : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్న రోహిత్ నాయుడు ఎలిమినేట్ అయ్యాడు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా ని షేక్ చేస్తోంది. ఈ వార్త సోషల్ మీడియా లో లీక్ అవ్వగానే , నెటిజన్స్ భగ్గుమన్నారు. స్టార్ మా ఛానల్ , హోస్ట్ అక్కినేని నాగార్జున ని ట్యాగ్ చేసి ఒక రేంజ్ లో తిట్టడం మొదలు పెట్టారు. ట్విట్టర్ , ఇన్ స్టాగ్రామ్ మొత్తం షేక్ అయ్యింది. మొదటి నుండి అతనికి బిగ్ బాస్ టీం , నాగార్జున , హౌస్ లోని సెలబ్రిటీ కంటెస్టెంట్స్ , ఇలా ప్రతీ ఒక్కరు అన్యాయం చేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు వాళ్ళ సవాళ్ళను ఎదురుకొని ఈ వారం కాస్త కోలుకున్నాడు. ఇక రోహిత్ కి తిరుగులేదు అని అనుకుంటున్న సమయంలో అతన్ని ఎలిమినేట్ చేసి బయటకు పంపేశారు. అయితే రోహిత్ ఎలిమినేషన్ కి ముందు చాలా నాటకీయ పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే హౌస్ లోని ఎల్లో , గ్రీన్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కలిసి , రోహిత్ ఎలిమినేట్ అవ్వాలని ఓట్లు వేయగా , అతన్ని ఎలిమినేట్ చేసి స్టేజి మీదకు తీసుకొచ్చారు. హౌస్ మేట్స్ అందరితో మాట్లాడించి ఇంటికి పంపుతున్న సమయం లో , రోహిత్ ని మళ్లీ వెనక్కి పిలిచి నువ్వు ఎలిమినేట్ అవ్వలేదు , నిన్ను సీక్రెట్ రూమ్ కి పంపబోతున్నామని నాగార్జున చెప్తాడట. కానీ రోహిత్ ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్టు సమాచారం. సీక్రెట్ రూమ్ లోకి వెళ్లి , మళ్లీ హౌస్ లోకి వెళ్తే , కంటెస్టెంట్స్ అందరూ నన్ను పోక్ చేస్తూ ఉంటారని , ఎలా అయితే బయటకు వచ్చానో , అలాగే లోపలకు పంపండి , సీక్రెట్ రూమ్ మాత్రం వద్దు అని రోహిత్ అన్నాడట. నాగార్జున , బిగ్ బాస్ టీం రోహిత్ కి నచ్చజెప్పే ప్రయత్నం చాలానే చేశారట. కానీ రోహిత్ మాత్రం ఒప్పుకోలేదట. ఇదంతా మనం నేటి ఎపిసోడ్ లో చూడొచ్చు.
అయితే ఎలిమినేట్ అయినటువంటి ప్రతీ కంటెస్టెంట్ ‘బిగ్ బాస్ బజ్’ ఇంటర్వ్యూ లో పాల్గొనే సంగతి అందరికీ తెలిసిందే. అలా రోహిత్ కూడా ఈ ఇంటర్వ్యూ కి వచ్చాడు. అయితే శివాజీ ఇంటర్వ్యూ ని మధ్యలో ఆపేసి , రోహిత్ ని బిగ్ బాస్ హౌస్ లోకి తిరిగి వెళ్లేలా ఒప్పించే ప్రయత్నం చేసాడట. కానీ అందుకు రోహిత్ ఒప్పుకోలేదు. నేరుగా బిగ్ బాస్ టీం నన్ను టీఆర్ఫీ రేటింగ్స్ కోసం వాడుకొని, ఎమోషనల్ టార్చర్ కి గురి చేస్తున్నారు అని మండిపడ్డాడట. మరి రోహిత్ లేకుండా ఈ షో ఎలా నడుస్తుందో చూడాలి. ఎందుకంటే బిగ్ బాస్ ని అత్యధిక శాతం వీక్షించేది రోహిత్ కోసమే. 50 శాతం కి పైగా ప్రేక్షకులు రోహిత్ ఓటర్లు. అలాంటి రోహిత్ ని ఎలిమినేట్ చేయడం పెద్ద సాహసమే. రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో చూడాలి.