Bigg Boss Telugu 10 Rohith Elimination : ఎట్టకేలకు ‘బిగ్ బాస్ 10’ లో సెలబ్రిటీలు అనుకున్నది సాధించారు. ఈ సీజన్ మొత్తం ఎవరి చుట్టూ అయితే తిరుగుతుందో అతన్నే ఎలిమినేట్ చేశారు. వాళ్ళు ఎలిమినేట్ చేసింది మరెవరినో కాదు..రోహిత్..ఈ సీజన్ లో మొదటి వారం నుండి ఇప్పటి వరకు తిరుగులేని టాప్ ఓటింగ్ తో కొనసాగుతూ వచ్చిన రోహిత్ ని, సెలబ్రిటీలు మొత్తం కలిసి ఓట్లు వేసి బయటకి పంపేశారు. సడన్ ఎలిమినేషన్ పేరిట , రెడ్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఒకరిని ఎలిమినేట్ చేసే బాధ్యతని ఎల్లో మరియు గ్రీన్ టీం కంటెస్టెంట్స్ కి ఇస్తాడు నాగార్జున. దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా అందరూ కలిసి రోహిత్ కి ఓటు వేస్తారు. అలా రోహిత్ ఈ సీజన్ నుండి ఎలిమినేట్ అయిపోయాడు. మళ్లీ రీ ఎంట్రీ ఉంటుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.
అయితే ఇంటికి తిరిగి వెళ్తున్న రోహిత్ ని నాగార్జున వెనక్కి పిలిచి సీక్రెట్ రూమ్ ని ఆఫర్ చేసాడట. అందుకు రోహిత్ ఒప్పుకోలేదని, నాగార్జున ఒప్పించే ప్రయత్నం చేసిన కుదరలేదని అంటున్నారు. అయితే కొంతమంది మాత్రం రోహిత్ కి సీక్రెట్ రూమ్ లాంటివి అసలు ఆఫర్ చేయలేదు, నేరుగా ఎలిమినేట్ చేసి పంపేశారని అంటున్నారు. ఇందులో ఏది నిజమో తెలియాలంటే ఈరోజు రాత్రి వరకు ఆగాల్సిందే. అయితే శుక్రవారం రోజున సడన్ ఎలిమినేషన్ ఉందని బిగ్ బాస్ ఒక ప్రకటన చేస్తాడు. కంటెస్టెంట్స్ అత్యధిక శాతం రోహిత్ , రామకృష్ణ ఇంటి నుండి వెళ్లిపోవడానికి ఓట్లు వేస్తారు. కానీ బిగ్ బాస్ ఆడియన్స్ ఓటింగ్ లో తక్కువ ఓట్లు వచ్చింది సుధీర్ కాబట్టి , అతన్ని ఎలిమినేట్ చేస్తున్నట్టు ప్రకటిస్తాడు.
దీంతో ముకేశ్ తన మ్యాజికల్ కీ ని ఉపయోగించి , ఝాన్సీ దగ్గర ఉన్నటువంటి ‘ఏవిక్షన్ పాస్’ ని రీ యాక్టీవేట్ చేసి , సుధీర్ ని ఎలిమినేషన్ నుండి రక్షిస్తాడు. దీంతో సడన్ ఎలిమినేషన్ ప్రక్రియ ఈ వారం రద్దు అయ్యింది, కేవలం సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ చివరికి ఇలాంటి టీఆర్ఫీ గేమ్ ఆడి , రోహిత్ ని సీక్రెట్ రూమ్ కి పంపే ప్రయత్నం చేశారు. కానీ రోహిత్ బిగ్ బాస్ టీం ప్లాన్స్ ని సర్వనాశనం చేసాడు. మరి భవిష్యత్తులో రోహిత్ ని ఒప్పించి మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొస్తాడా లేదా అనేది చూడాలి.