Homeఆధ్యాత్మికంThiruparankundram Controversy: నేడు తిరుప్పరం కుండ్రంలో దీపం వెలుగుతుందా.. సీఎం విజయ్ ఏం చేస్తారు..

Thiruparankundram Controversy: నేడు తిరుప్పరం కుండ్రంలో దీపం వెలుగుతుందా.. సీఎం విజయ్ ఏం చేస్తారు..

Thiruparankundram Controversy: తమిళనాడులోని మధురై సమీపంలోని ఉన్న తిరుప్పరం కుండ్రం కొండ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. ఒక దీపం వెలిగించే విషయంలో మొదలైన వివాదం చివరికి సుప్రీంకోర్టు వరకు చేరింది. ఆలయం, దర్గాకు సంబంధించిన హక్కులు, సంప్రదాయాలు, మత స్వేచ్ఛ, ప్రభుత్వ బాధ్యత వంటి అంశాలు ఈ వివాదంలో కీలకంగా మారాయి. అసలు వివాదం ఏంటి మధురై లోని తిరుప్పరం కుండ్రం కొండపై సుబ్రహ్మణ్యస్వామి ఆలయం, సికిందర్ బాద్ షా దర్గా ఉన్నాయి. కొండపై […]

Thiruparankundram Controversy: తమిళనాడులోని మధురై సమీపంలోని ఉన్న తిరుప్పరం కుండ్రం కొండ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. ఒక దీపం వెలిగించే విషయంలో మొదలైన వివాదం చివరికి సుప్రీంకోర్టు వరకు చేరింది. ఆలయం, దర్గాకు సంబంధించిన హక్కులు, సంప్రదాయాలు, మత స్వేచ్ఛ, ప్రభుత్వ బాధ్యత వంటి అంశాలు ఈ వివాదంలో కీలకంగా మారాయి.

అసలు వివాదం ఏంటి

మధురై లోని తిరుప్పరం కుండ్రం కొండపై సుబ్రహ్మణ్యస్వామి ఆలయం, సికిందర్ బాద్ షా దర్గా ఉన్నాయి. కొండపై ఉన్న దీప తూన్ అనే రాతి స్తంభం వద్ద కార్తీకదీపం వెలిగించాలని కొందరు హిందూ భక్తులు చాలా కాలంగా కోరుతున్నారు. ఈ స్తంభం దర్గా కుసుమారు 50 మీటర్ల దూరంలో ఉంది. కొన్ని సంవత్సరాలుగా ఆలయ అధికారులు కార్తిక దీపాన్ని ఉచ్చి పిళ్ళ యార్ ఆలయం సమీపంలోని దీప మండపంలో వెలిగిస్తున్నారు. ఇక్కడే దీపం వెలిగించడం సంప్రదాయమని ఆలయ యాజమాన్యం చెబుతోంది. మరోవైపు రాతి స్తంభం వద్ద కూడా దీపం వెలిగించడానికి అనుమతి ఇవ్వాలని భక్తులు ఏకంగా న్యాయస్థానాలను ఆశ్రయించారు.

కోర్టులనుంచి కీలక ఆదేశాలు

2025 డిసెంబర్లో మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ రాతి స్తంభం వద్ద కూడా దీపం వెలిగించాలని ఆదేశాలు జారీ చేసింది. 2026 జనవరి 6న డివిజన్ బెంచ్ కూడా కొన్ని షరతులతో ఈ ఆదేశాన్ని సమర్థించింది. తమిళనాడు ప్రభుత్వం దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. నవంబర్ 20 న సుప్రీంకోర్టు కీలక మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 24 పర్మిత సంఖ్యలో ఆలయ ప్రతినిధులతో స్తంభం వద్ద దీపం వెలిగించడానికి అనుమతి ఇచ్చింది. అయితే నవంబర్ 24న అక్కడ దీపం వెలిగించకుండా సంప్రదాయ మండపంలోనే వెలిగించడంతో వివాదం మరింత ముదిరింది.

సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఎలా ఉన్నాయి అంటే

నవంబర్ 27న సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంపై ఆలయ ట్రస్టీల బోర్డును సస్పెండ్ చేసింది. ఇద్దరు విశ్రంత న్యాయమూర్తులను ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసేందుకు నియమించింది. నవంబర్ 28న రాతి స్తంభం వద్ద దీపం వెలిగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈసారి భక్తులు కూడా దీపం వెలిగించడానికి అనుమతి ఇచ్చింది. దర్గా, భక్తుల భద్రత కోసం కేంద్ర రిసర్వ్ పోలీసు బలగాలను మోహరించాలని సూచించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. పలుగురు అధికారులకు ధిక్కరణ నోటీసులు కూడా జారీ చేసింది.

రాజకీయంగా ప్రకంపనలు

ఈ వివాదం తమిళనాడులో రాజకీయ ప్రకంపనలకు కారణమవుతోంది. బిజెపి నాయకులు ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రభుత్వ మాత్రం సంప్రదాయ ఆచారాలు.. శాంతిభద్రతల అంశాలను ప్రస్తావిస్తోంది. ఇక ఈ కొండ మీద ఉన్న భూమి హక్కులు.. రాతి స్తంభం స్వరూపం.. మతపరమైన హక్కులు.. వంటి వాటికి సంబంధించి పూర్తి నిర్ణయాలు వెలువడాల్సి ఉంది.

విజయ్ ప్రభుత్వం మీద ఒత్తిడి

దీపం వెలిగించే విషయంలో విజయ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా హిందువులు విజయ్ కి ఓటు ఎందుకు వేశారో ఆలోచించుకోవాలని బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు. “మైనారిటీ ప్రభుత్వాన్ని విజయ్ నడిపిస్తున్నారు. మైనారిటీ నాయకుల ఒత్తిడికి తలవంచుకుంటున్నారు. అందువల్ల హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని” బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper