Big Boss Agnipariksha 2: ‘అగ్ని పరీక్ష 2’ పై సోషల్ మీడియా లో ప్రతీ రోజు ఏ రేంజ్ లో చర్చలు జరుగుతున్నాయో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. సామాన్యులు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఎంత కష్టపడుతున్నారో , తమ టాలెంట్ ని చూపించడానికి ఎంత పరితపిస్తున్నారో , ఈ షోలో మనమంతా చూడొచ్చు. కొంతమంది సామాన్యుల స్టోరీలు వింటుంటే గూస్ బంప్స్ వచ్చాయి. అసలు ఇలాంటోళ్ళు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు రా బాబు అని అనిపించిన కనిపించిన కంటెస్టెంట్స్ ఉన్నారు. అలాంటి కంటెస్టెంట్స్ లో ఒకరి గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. ఆ అమ్మాయి పేరు గౌరీ త్రినేత్ర. ఈమె కోనసీమ ప్రాంతానికి చెందిన అమ్మాయి. ఈమె ఈ షో కోసం తన జీవితం లో ఎంతో రహస్యం గా దాచుకున్న ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చింది.
ఇది నా తల్లిదండ్రులకు తప్ప , ఎవరికీ తెలియదు.. నా స్నేహితులకు కూడా ఇప్పటి వరకు చెప్పలేదు , ఆ రహస్యాన్ని ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను అంటూ మొదలెట్టింది. ‘నేను బయోలాజికల్ గా అమ్మాయిని కాదు, అబ్బాయిని. ఇంటర్ పూర్తి అయ్యాక నేను అమ్మాయిగా మారాను. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా, వాళ్ళతో పోరాడి ఈ నిర్ణయం తీసుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాదు , ఈమె కూచిపూడి నాట్యం లో ప్రదర్శన ఇస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా తన పేరుని నమోదు చేసుకుందట. అయితే ఈమె పరీక్షల్లో కూడా జెండర్ క్యాటగిరీ లో ‘ట్రాన్స్ జెండర్’ అని పెట్టానంటూ చెప్పుకొచ్చింది. ఇక్కడే ఈమెకు అసలు పరీక్ష మొదలైంది. వెంటనే నవదీప్ స్పందిస్తూ ‘ఇందాకే నీ జెండర్ గురించి నీ తల్లిదండ్రులకు తప్ప ఎవరికీ తెలియదు అని చెప్పావు , కానీ ఇప్పుడు పరీక్షల్లో జెండర్ ఇలా పెట్టాను అంటున్నావు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?, షో కోసం ఇలా చెప్తే మేము సెలెక్ట్ చేస్తాము అనే ఉద్దేశ్యంతో చెప్పావా?’ అని అడుగుతాడు.
నవదీప్ అడిగిన ప్రశ్న కు గౌరీ కాస్త తడబడింది. ఆమె ఉద్దేశ్యం లో ఎలా చెప్పిందో ఏమో తెలియదు కానీ , నవదీప్ అడిగిన దాంట్లో కూడా అర్థం ఉంది. నువ్వు ఏమి చెప్పాలనుకుంటున్నావో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదంటూ ఆమెకు రెడ్ ఫ్లాగ్ ఇస్తాడు. ఆ తర్వాత బిందు మాధవి కూడా రెడ్ ఫ్లాగ్ ఇస్తుంది. దీంతో గౌరీ వెక్కిళ్లు పెట్టి ఏడ్చేస్తుంది. కానీ అభిజిత్ మాత్రం ఈ సమాజం లో అందరికీ సమానమైన అవకాశాలు రావాలని నేను బలంగా నమ్ముతున్నాను , నేను నువ్వు ఎలా పెర్ఫార్మ్ చేస్తావో చూడాలని అనుకుంటున్నాను కాబట్టి , నీకు గ్రీన్ ఫ్లాగ్ ఇస్తున్నాను అని చెప్పుకొచ్చాడు అభిజిత్. మరి ఈమె తదుపరి టాస్కుల్లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.