Homeఎంటర్టైన్మెంట్Vrushakarma Movie: 'వృష కర్మ' మూవీ మొట్టమొదటి రివ్యూ..చివరి 40 నిమిషాలు ఇలా ఉంటుందని ఊహించలేదు!

Vrushakarma Movie: ‘వృష కర్మ’ మూవీ మొట్టమొదటి రివ్యూ..చివరి 40 నిమిషాలు ఇలా ఉంటుందని ఊహించలేదు!

Vrushakarma Movie: తండేల్ వంటి భారీ కమర్షియల్ సక్సెస్ తర్వాత అక్కినేని నాగ చైతన్య హీరో గా నటించిన ‘వృష కర్మ’ అనే చిత్రం వచ్చే నెల 4 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఇప్పటి వరకు నాగచైతన్య లవ్ స్టోరీస్ చేసాడు, మాస్ కమర్షియల్ సినిమాలు కూడా చేసాడు, కానీ హారర్ థ్రిల్లర్ జానర్ లో సినిమా చేయడం ఇదే తొలిసారి. అందుకే ఈ చిత్రం పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో […]

Vrushakarma Movie: తండేల్ వంటి భారీ కమర్షియల్ సక్సెస్ తర్వాత అక్కినేని నాగ చైతన్య హీరో గా నటించిన ‘వృష కర్మ’ అనే చిత్రం వచ్చే నెల 4 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఇప్పటి వరకు నాగచైతన్య లవ్ స్టోరీస్ చేసాడు, మాస్ కమర్షియల్ సినిమాలు కూడా చేసాడు, కానీ హారర్ థ్రిల్లర్ జానర్ లో సినిమా చేయడం ఇదే తొలిసారి. అందుకే ఈ చిత్రం పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. పైగా విరూపాక్ష వంటి భారీ కమర్షియల్ సక్సెస్ తర్వాత డైరెక్టర్ కార్తీక్ దందు నుండి రాబోతున్న చిత్రం కావడం తో మార్కెట్ లో ఈ సినిమా పై భారీ హైప్ ఏర్పడింది. ఇక రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండడం తో కచ్చితంగా ఈ చిత్రం నాగ చైతన్య కెరీర్ లో ల్యాండ్ మార్కు గా నిలుస్తుందని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు.

అయితే రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షో ని హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో డిస్ట్రిబ్యూటర్స్ కోసం ఏర్పాటు చేశారు. వాళ్ళ నుండి ఈ చిత్రానికి వచ్చిన టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. సినిమా ఆరంభం లోనే ఆడియన్స్ కి గూస్ బంప్స్ రేంజ్ థియేట్రికల్ అనుభూతి దక్కే సన్నివేశాలు ఉన్నాయట. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ లో ఉందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఏ హారర్ సినిమాలోనూ చూడని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పెట్టడం లో డైరెక్టర్ కార్తీక్ సక్సెస్ అయ్యాడని, ఇంటర్వెల్ లో వచ్చే ఒక ట్విస్ట్ ఆడియన్స్ మైండ్ ని బ్లాక్ అయ్యేలా చేస్తుందని, ఇలాంటి సన్నివేశాలు పెట్టాలనే ఆలోచన వచ్చినందుకు డైరెక్టర్ కి సెల్యూట్ అని ఈ చిత్రాన్ని చూసిన డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నారు. ఇక సెకండ్ హాఫ్ కూడా ఇదే రేంజ్ లో ఉందని అంటున్నారు.

ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ నెవెర్ బిఫోర్ రేంజ్ లో ఉన్నాయని, ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్, ఆ తర్వాత వచ్చే హారర్ ఎలిమెంట్స్ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్తాయని , ఓవరాల్ గా ఈ చిత్రం నాగ చైతన్య కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలుస్తుందని అంటున్నారు. ప్రివ్యూ షో నుండి వచ్చిన టాక్, ఆడియన్స్ నుండి కూడా వస్తే, ఈసారి నాగ చైతన్య 200 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొడుతాడు. మరి ఆ రేంజ్ టాక్ వస్తుందో లేదో తెలియాలంటే డిసెంబర్ 4 వరకు ఆగాల్సిందే. ఈ చిత్రం లో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటించింది. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసే ఈమె, ఈ ఏడాది కేవలం రెండు సినిమాలకే పరిమితమైంది. ఎందుకంటే ‘వృష కర్మ’ విడుదల అయ్యేంత వరకు మరో సినిమాకు కమిట్ అవ్వకూడదని అగ్రిమెంట్ మీద సంతకం చేసిందట. దీన్ని బట్టి ఆమె ఈ సినిమా కోసం ఎంత కష్టపడిందో అర్థం చేసుకోవచ్చు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper