Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: త్రిగున్ ని విన్నర్ చేయడానికి 'బిగ్ బాస్ 10' టీం...

Bigg Boss 10 Telugu: త్రిగున్ ని విన్నర్ చేయడానికి ‘బిగ్ బాస్ 10’ టీం స్పెషల్ కాంట్రాక్ట్ ? ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయారు!

Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో త్రిగున్ చేసినన్ని తప్పులు హిస్టరీ లో ఏ కంటెస్టెంట్ కూడా చెయ్యలేదు. గేమ్ పేరుతో ఎన్ని చెయ్యాలో, అన్నీ చేసాడు. బయట ఆయన పీఆర్ టీం గేమ్ కూడా వేరే లెవెల్ లో ఉంది. వాళ్ళు కూడా ఎంతకు దిగజారడానికైనా రెడీ అయిపోయారు. త్రిగున్ చేసిన తప్పుల్లో పావు శాతం మరో కంటెస్టెంట్ చేసినా , నాగార్జున రెడ్ కార్డు ఇచ్చి బయటకు […]

Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో త్రిగున్ చేసినన్ని తప్పులు హిస్టరీ లో ఏ కంటెస్టెంట్ కూడా చెయ్యలేదు. గేమ్ పేరుతో ఎన్ని చెయ్యాలో, అన్నీ చేసాడు. బయట ఆయన పీఆర్ టీం గేమ్ కూడా వేరే లెవెల్ లో ఉంది. వాళ్ళు కూడా ఎంతకు దిగజారడానికైనా రెడీ అయిపోయారు. త్రిగున్ చేసిన తప్పుల్లో పావు శాతం మరో కంటెస్టెంట్ చేసినా , నాగార్జున రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపేవాడు. కానీ త్రిగున్ విషయం లో మాత్రం ఎందుకు అంత వివక్ష చూపిస్తున్నాడో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పైగా త్రిగున్ కి ఎదురెళ్ళిన వాళ్ళను ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత బిగ్ బాస్ ప్రేక్షకులు సోషల్ మీడియా లో అంటున్న మాట ఏంటంటే, బిగ్ బాస్ టీం తో త్రిగున్ ఒక కాంట్రాక్టు చేయించుకున్నాడని, టైటిల్ విన్నర్ ని చెయ్యాలి అనే ఒప్పందం మీదనే త్రిగున్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడని అంటున్నారు.

ఇది కాస్త అతిశయం అనిపించినా, బాగా అలోచించి చూస్తే నిజమేనేమో అని అనిపిస్తోంది. అందుకు బెస్ట్ ఉదాహరణ రోహిత్ ఎలిమినేషన్. హౌస్ లో ఉన్నన్ని రోజులు రోహిత్, త్రిగున్ మధ్య ఏ రేంజ్ ఫైట్ నడిచిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరిని ఒకరు కొట్టుకోవడం ఒక్కటే తక్కువ. ఇద్దరి వైపు తప్పులు ఉన్నప్పుడు, నాగార్జున ఇద్దరినీ సమానంగా తిట్టాలి. కానీ అది చెయ్యలేదు, రోహిత్ ని దారుణంగా తిట్టేవాడు, త్రిగున్ ని చాలా తక్కువ తిట్టేవాడు. ఇక గోట్ టాస్క్ లో రోహిత్ ని రెడ్ బ్లాక్ లో ఉద్దేశపూర్వకంగానే పెట్టారని స్పష్టంగా తెలుస్తోంది. త్రిగున్ కి రోహిత్ ప్రతీ విషయం లో అడ్డంగా ఉన్నాడు, పైగా ఓటింగ్ లో అయితే నెంబర్ 1 క్షణం లో ఎవ్వరూ అందుకోలేని స్థాయిలో ఉన్నాడు, ఇతను గేమ్ లో ఉంటే త్రిగున్ ని విన్నర్ ని చేయడం అసాధ్యం, ఎలా అయినా ఇతన్ని బ్యాడ్ చేసి గ్రాఫ్ తగ్గించాలని బిగ్ బాస్ టీం చాలా కష్టపడింది.

అందుకు ఒక ఉదాహరణని మీ ముందు పెడుతున్నాము. సాధారణంగా నాగార్జున వీకెండ్ ఎపిసోడ్స్ లో కేవలం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్స్ గురించే మాట్లాడేవాడు, టెలికాస్ట్ అవ్వని కంటెంట్ గురించి మాట్లాడేవాడు కాదు, అలాంటిది కనీసం లైవ్ లో కూడా చూపించని ఫుటేజీ ని తీసుకొచ్చి, రోహిత్ బిగ్ బాస్ రియాలిటీ షో ని అవమానించాడని అబద్దపు ప్రచారం చేయించారు. అలా చేస్తే రోహిత్ గ్రాఫ్ తగ్గుతుందని అనుకున్నారు కానీ, అది జరగలేదు. అలా ఎన్నో విశ్వప్రయత్నాలు చేశారు, కానీ రోహిత్ గ్రాఫ్ ఓటింగ్ లో పెరుగుతూ వెళ్తోంది. ఇక చేసేది ఏమి లేక, హౌస్ మేట్స్ అందరూ రోహిత్ కి వ్యతిరేకంగా అయ్యేలా చేసి, అతను ఎలిమినేట్ అయ్యేందుకు ఓటు వేసి బయటకు పంపేలా చేశారు. ఒక టాప్ కంటెస్టెంట్ ని ఇలా అన్యాయంగా కంటెస్టెంట్ ఓట్లతో ఎలిమినేట్ చేయడం బిగ్ బాస్ హిస్టరీ లోనే ఎక్కడ జరగలేదు.

రోహిత్ ఎలిమినేట్ అయ్యాక త్రిగున్ కి వార్ వన్ సైడ్ లాగా అయిపోయింది. ఇదంతా బిగ్ బాస్ ప్లాన్, త్రిగున్ తో కాంట్రాక్టు బ్రేక్ అవ్వకుండా ఉండేందుకే రోహిత్ ని గేమ్ నుండి తప్పించారు అని ప్రేక్షకులు అనుకోవడం లో ఎలాంటి తప్పు లేదు కదా?, ఎందుకంటే బిగ్ బాస్ టీం చర్యలు చూస్తే అలాగే అనిపిస్తోంది. కేవలం త్రిగున్ విషయం లో మాత్రమే కాదు, వర్షిణి తో కూడా బిగ్ బాస్ టీం కాంట్రాక్టు పెట్టుకుంది. లేకపోతే ఆమె ఆడే ఆటకు 12 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉండడం ఏంటి?, విచిత్రం గా అనిపిస్తుంది కదూ ?, అందుకే ఈ సీజన్ డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper