Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 10 Rohith Naidu : రోహిత్ కోసం రంగం లోకి దిగిన...

Bigg Boss Telugu 10 Rohith Naidu : రోహిత్ కోసం రంగం లోకి దిగిన అభిజీత్.. అయినప్పటికీ పని అవ్వలేదు!

Bigg Boss Telugu 10 Rohith Naidu : ఏ మనిషి అయినా ఒక లిమిట్ వరకే సహనం చూపించగలడు. ఆ లిమిట్ దాటితే ఎంతకైనా తెగిస్తారు. ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో రోహిత్ అదే చేసింది. మొదటి వారం నుండి తనని నాగార్జున , బిగ్ బాస్ టీం , హౌస్ లోని సెలబ్రిటీలు మొత్తం చెయ్యని తప్పులకు టార్గెట్ చేస్తూ వచ్చారు. రోహిత్ చేసిన తప్పులే మిగిలిన కంటెస్టెంట్స్ కూడా చేస్తుంటారు , […]

Bigg Boss Telugu 10 Rohith Naidu : ఏ మనిషి అయినా ఒక లిమిట్ వరకే సహనం చూపించగలడు. ఆ లిమిట్ దాటితే ఎంతకైనా తెగిస్తారు. ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో రోహిత్ అదే చేసింది. మొదటి వారం నుండి తనని నాగార్జున , బిగ్ బాస్ టీం , హౌస్ లోని సెలబ్రిటీలు మొత్తం చెయ్యని తప్పులకు టార్గెట్ చేస్తూ వచ్చారు. రోహిత్ చేసిన తప్పులే మిగిలిన కంటెస్టెంట్స్ కూడా చేస్తుంటారు , కానీ రోహిత్ ని మాత్రమే తిడుతారు, మిగిలిన వాళ్ళని మాత్రం వదిలేస్తుంటారు. గత వారమే మీరంతా ఎంతటి అన్యాయం జరిగిందో చూసుంటారు. రోహిత్ చేసిన తప్పులే , బిగ్ బాస్ ముద్దు బిడ్డ త్రిగున్ కూడా చేసాడు. కానీ అతనికి శిక్ష గా కేవలం బేడీలు మాత్రమే వేశారు, కానీ రోహిత్ కి బ్లాక్ కార్డు ఇచ్చి , సీజన్ మొత్తం కెప్టెన్సీ టాస్కులు ఆడనివ్వకుండా చేశారు. ఆ తర్వాత తోటి కంటెస్టెంట్స్ వద్దు అనేసరికి రెండు వారాలకు పరిమితం చేశారు.

ఇలాంటివి రోహిత్ కి కొత్త కాదు , మొదటి వారం నుండి బిగ్ బాస్ టీం అతనికి అన్యాయం చేస్తూనే ఉన్నారు. ఇది చూసి చూసి బాగా విసుగెత్తిపోయిన రోహిత్ , నిన్న తెగించేసాడు. హౌస్ లోని కంటెస్టెంట్స్ అందరూ కలిసి రోహిత్ ని ఎలిమినేట్ చేయగా , రోహిత్ ని సీక్రెట్ రూమ్ లోకి పంపే ప్రయత్నం చేసాడు నాగార్జున. కానీ రోహిత్ ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసాడు. నాగార్జున చాలా వరకు అతన్ని ఒప్పించే ప్రయత్నం చేసాడు, చివరికి స్టేజి మీద నుండి తన తల్లితో మాట్లాడించారు, ఆమె రోహిత్ ఇష్టానికే వదిలేసింది అట. చివరికి రోహిత్ ని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ లోకి పంపిన అభిజీత్ తో కూడా మాట్లాడించారట. కానీ రోహిత్ ఒప్పుకోలేదట, నాకు ఓపిక పోయింది అని చెప్పేసి వెళ్ళిపోయాడట. దీంతో రోహిత్ నాయుడు బిగ్ బాస్ జర్నీ అర్థాంతరంగా ఇక్కడితో ఆగిపోయింది.

బిగ్ బాస్ టీం రోహిత్ ఎమోషన్స్ తో చెడుగుడు ఆడుకొని , అతన్ని టార్చర్ కి గురి చేశారు. వాళ్ళ లక్ష్యం ఒక్కటే , రోహిత్ గ్రాఫ్ ని బాగా తగ్గించి , త్రిగున్ ని పైకి లేపడం. ఎందుకంటే ఈ సీజన్ లో సెలబ్రిటీ కంటెస్టెంట్స్ పాల్గొనడానికి పెద్దగా ఇష్టం చూపించలేదు. వాళ్లకు అత్యధిక రెమ్యూనరేషన్స్ ఆఫర్ ని చూపించి తీసుకొని రావాల్సి వచ్చింది. ఎందుకంటే గత సీజన్ లో ‘అగ్ని పరీక్ష’ కంటెస్టెంట్ కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యాడు. ఈ సీజన్ లో రోహిత్ కి ‘అగ్ని పరీక్ష 2’ సమయం లోనే విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఈసారి కూడా అతనే విన్ అయ్యే అవకాశాలు ఉండడం తో సెలబ్రిటీలు పెద్దగా ఆసక్తి చూపలేదు. అందుకే ఈ సీజన్ లో ఎట్టిపరిస్థితిలోనూ సెలబ్రిటీలే టైటిల్ విన్ అవ్వాలని గట్టిగ ప్లాన్ చేశారు బిగ్ బాస్ టీం. ప్లాన్ ప్రకారం రోహిత్ ని టార్గెట్ చేసి గ్రాఫ్ తగ్గించాలని చూసారు , ఎంత ప్రయత్న చేసినా గ్రాఫ్ తగ్గకపోవడంతో ఎలిమినేట్ చేసి పంపేశారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper