Homeఆధ్యాత్మికంToday Horoscope: రాశి ఫలాలు| నవంబర్ 28, 2026 శనివారం.. ఈ 12 రాశుల వారి...

Today Horoscope: రాశి ఫలాలు| నవంబర్ 28, 2026 శనివారం.. ఈ 12 రాశుల వారి పరిస్థితి ఎలా ఉందంటే..

Today Horoscope: నేటి శనివారం, నవంబర్ 28, 2026 జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాల సంచారం, నక్షత్రాల ప్రభావంతో ద్వాదశ రాశుల వారికి భిన్నమైన ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగ, వ్యాపార రంగాలలో చాలామందికి పురోగతి కనిపిస్తే.. ఆర్థిక విషయాల్లో మరికొందరికి ఊరట లభించే అవకాశం కల్పిస్తోంది. కుటుంబం, ఆరోగ్యం, ప్రేమ, వివాహ వ్యవహారాలలో ఎవరికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం మేషరాశి: ఈరోజు వారికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో […]

Today Horoscope: నేటి శనివారం, నవంబర్ 28, 2026 జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాల సంచారం, నక్షత్రాల ప్రభావంతో ద్వాదశ రాశుల వారికి భిన్నమైన ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగ, వ్యాపార రంగాలలో చాలామందికి పురోగతి కనిపిస్తే.. ఆర్థిక విషయాల్లో మరికొందరికి ఊరట లభించే అవకాశం కల్పిస్తోంది. కుటుంబం, ఆరోగ్యం, ప్రేమ, వివాహ వ్యవహారాలలో ఎవరికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం

మేషరాశి: ఈరోజు వారికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలను స్వీకరించాల్సిన అవసరం ఏర్పడుతోంది. వ్యాపారం చేసే వారికి కొత్త అవకాశాలు ఎదురయ్యే స్థితి ఉంది. ఆదాయం పెరుగుతుంది. అనవసరమైన ఖర్చుల బాధ కూడా ఉంటుంది.

వృషభ రాశి: ఉద్యోగాలు చేస్తున్నవారు శుభవార్తలు వింటారు. వ్యాపారాలు చేసేవారు లాభాలు స్వీకరిస్తారు. కుటుంబ సభ్యులు అండగా ఉంటారు. దాంపత్య జీవితంలో సుఖం ఉంటుంది. అనుకోని ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తోంది.

మిధున రాశి: గతంతో పోల్చి చూస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగాలు చేసే వారికి ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. కొత్తగా వచ్చే ఆదాయ మార్గాల మీద దృష్టి పెడతారు. ఇతరులకు ఆర్థిక సాయం చేసే విషయంలో ఆలోచించాల్సి ఉంటుంది.

కర్కాటక రాశి: ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. వ్యాపారం చేసే వారికి నిలకడగా లాభాలు వస్తాయి. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతుంటారు.

సింహరాశి: వృత్తులు.. ఉద్యోగాలు చేసే వారికి గుర్తింపు దక్కుతుంది. నిరుద్యోగులకు కొత్తగా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కుటుంబంలో చిన్న బండి సమస్యలు ఎదురైనప్పటికీ సామరస్యంగా పరిష్కరించుకుంటారు.

కన్య రాశి: ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు చేసేవారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. జీవిత భాగస్వామితో నెలకొన్న విభేదాలు తగ్గిపోతాయి. పెండింగ్ పనులు పూర్తి కావడానికి అవకాశం ఉంది.

తుల రాశి: ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు లభించే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారు ఆదాయాన్ని పెంచుకుంటారు. ప్రయాణాలు లాభం చేకూర్చుతాయి. కుటుంబ సభ్యులు ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తారు.

వృశ్చిక రాశి: ఆర్థికంగా మంచి రోజులు వస్తుంటాయి. చేతికి రావాల్సిన డబ్బు అందుతుంది. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులు సహకారం అందించడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి.

ధనస్సు రాశి: ఉద్యోగుల్లో బాధ్యతలు మారే అవకాశం ఉంది. వ్యాపారాలు చేసే వారికి లాభాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి కొంతమేర ఉపశమనం దక్కుతుంది.

మకర రాశి: వృత్తి, ఉద్యోగాలు చేసుకునే వారికి ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త మార్పులు కలిసి వస్తాయి. ఇంట్లో శుభకార్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఏ విషయంలో కూడా ఇతరులను గుడ్డిగా నమ్మకూడదు.

కుంభరాశి: చేపట్టే పనుల్లో విజయాలు దక్కి అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగం చేసే వారి ప్రతిభకు గుర్తింపు దక్కుతుంది. ఆస్తి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. బంధువులతో మాట్లాడుతున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి.

మీనరాశి: ఉద్యోగాలు చేసేవారు గుర్తింపును సాధిస్తారు. వ్యాపారాలు చేసేవారు లాభాలు పొందుతారు. కొత్తగా పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ దర్శనం చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper