Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు అద్భుతంగా ఆడే కంటెస్టెంట్స్ లో ఒకరు అమన్. ‘అగ్నిపరీక్ష 2’ లో టాస్కులు పెద్దగా ఆడలేదు కానీ, ఆడిన ఒకటి రెండు టాస్కుల్లో కూడా అతను ఓడిపోయాడు కానీ, హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత మాత్రం ఆటల్లో తన సత్తా చాటుతూ ముందుకు వెళ్ళాడు. మొదటి నాలుగు వారాలు కాస్త తడబడ్డాడు కానీ, ఆ తర్వాత మాత్రం అమన్ రేస్ గుర్రం అనే ట్యాగ్ ని సంపాదించుకున్నాడు. అయితే అమన్ కేవలం ఆటల్లో మాత్రమే పర్ఫెక్ట్ కానీ, పర్సనాలిటీ పరంగా మాత్రం కాదు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. గేమ్ లో సరైన నిర్ణయం తీసుకునే సత్తా లేదు, ఎవరు మనోళ్లు, ఎవరు పగుళ్లు అని పసిగట్టే తెలివి లేదు, అసలు గేమ్ ఎలా వెళ్తుందో అంచనా వేయగలిగే తెలివి లేదు. అందుకే సోషల్ మీడియా లో బోలెడంత నెగెటివిటీ ని మూటగట్టుకున్నాడు.
ఇక హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి అమన్ గేమ్ లో రోహిత్ సలహాలు తీసుకుంటూ వచ్చాడు. రోహిత్ ఇతనికి ప్రతీ కష్టమైన సమయం లో తోడున్నాడు. ఇతని తరుపున ఫైట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ చివరికి రోహిత్ కే వెన్నుపోటు పొడిచి, అతన్ని హౌస్ నుండి బయటకు పంపేందుకు ఓటు వేశాడు. అంతే కాకుండా ఈమధ్య కాలం లో జరిగిన నామినేషన్స్ రోహిత్ నా వెనుక చేరి ఎన్నోసార్లు వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నం చేసాడని, అవన్నీ భరించి ఒక రోజు బ్లాస్ట్ అయ్యి అతనికి వ్యతిరేకంగా ఓటు వేశానని చెప్పుకొచ్చాడు. ఇదేంటి అమన్ ఇలా మాట్లాడుతున్నాడు, రోహిత్ ఇతని గేమ్ మెరుగుపడేందుకు ఎంతో మోటివేట్ చేసాడు, త్రిగున్ ఇతన్ని ఎన్నో సార్లు మోసం చేసాడు, అయినప్పటికీ త్రిగున్ ని నమ్ముతూ రోహిత్ గురించి ఇలా మాట్లాడడం ఏంటి? అని ప్రతీ ఒక్కరు బాధపడ్డారు. రోహిత్ అభిమానులకు అయితే త్రిగున్ మీద కంటే అమన్ మీదనే ఎక్కువ కోపం ఉంది. అతని ఎలిమినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆ క్షణాలు వచ్చేసాయి అనే అంటున్నారు విశ్లేషకులు.
ఈ వారం అమన్ చేసిన ఓవర్ యాక్షన్ మామూలు రేంజ్ లో లేదు. కెప్టెన్ గా శివ్ ని అత్యంత దారుణంగా శిక్షించాడు. ఇక ముకేశ్ ని అయితే అనరాని మాటలు అన్నాడు. వయస్సు లో తనకంటే పెద్ద వాడు అనే గౌరవం లేదు, టీవీ లో పెద్ద స్టార్ అనే ఇంకితం కూడా లేదు, ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు. బహుశా ముకేశ్ తన జీవితం లో ఇలాంటి అవమానాన్ని ఎదురుకొని ఉండదు. పాపం అతని కుటుంబ సభ్యులు ఆ మాటలని చూసి ఎంత బాధపడి ఉంటారో. అంత దారుణంగా ముకేశ్ ని తిడుతాడు అమన్. ఎపిసోడ్ టెలికాస్ట్ లో అమన్ తిట్టిన మాటలు చాలా వరకు కట్ చేశారు, కానీ ఈ వీకెండ్ అమన్ కి రేడు కార్డు ఇచ్చేందుకు బిగ్ బాస్ టీం రెడీ అయ్యిందట. నాగార్జున అమన్ కి రెడ్ కార్డు ఇచ్చి, ఇలాంటి ప్రవర్తన ఉన్న కంటెస్టెంట్స్ కి నా హౌస్ లో చోటు లేదు, గెట్ అవుట్ అని చెప్పేలా స్క్రిప్ట్ ని రెడీ చేశారట. ఇదే కనుక నిజమైతే రోహిత్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు. తమ పగ ఎట్టకేలకు తీరబోతుందని , అమన్ లాంటి కంటెస్టెంట్ టాప్ 5 కి అసలు అర్హుడు కాదని రోహిత్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.