Homeఎంటర్టైన్మెంట్Kajal Agarwal: ప్రాణాపాయ ప్రమాదం నుండి తప్పించుకున్న కాజల్ అగర్వాల్..ఆందోళనలో అభిమానులు!

Kajal Agarwal: ప్రాణాపాయ ప్రమాదం నుండి తప్పించుకున్న కాజల్ అగర్వాల్..ఆందోళనలో అభిమానులు!

Kajal Agarwal: ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒక పెద్ద ప్రాణాపాయ పరిస్థితి నుండి తప్పించుకుందనే వార్త తెలిసి ఆమె అభిమానులు షాక్ కి గురి అవుతున్నారు. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కాజల్ అగర్వాల్ ఒక సంఘటన గురించి చెప్తూ బాగా ఎమోషనల్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ ఇండియన్ 2 షూటింగ్ సమయం లో ప్రమాదం జరిగి ముగ్గురు ప్రాణాలను కోల్పోయినప్పుడు నేను 80 ఏళ్ళ బామ్మ గెటప్ లో నేను క్రేన్ […]

Kajal Agarwal: ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒక పెద్ద ప్రాణాపాయ పరిస్థితి నుండి తప్పించుకుందనే వార్త తెలిసి ఆమె అభిమానులు షాక్ కి గురి అవుతున్నారు. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కాజల్ అగర్వాల్ ఒక సంఘటన గురించి చెప్తూ బాగా ఎమోషనల్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ ఇండియన్ 2 షూటింగ్ సమయం లో ప్రమాదం జరిగి ముగ్గురు ప్రాణాలను కోల్పోయినప్పుడు నేను 80 ఏళ్ళ బామ్మ గెటప్ లో నేను క్రేన్ వెనుక కూర్చొని ఉన్నానని, ఆ సమయం లో కన్ను మూసి తెరిచే లోపల ప్రమాదం జరిగిందని, దీంతో అందరూ అక్కడి నుండి పరుగులు తీసారని , అసలు ఏమి జరుగుతుందో తెలియని అయ్యోమయ్యం లో ఉన్న నన్ను ఎవరో చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్లారని చెప్పుకొచ్చింది. అయితే అలా నన్ను లాక్కొని వెళ్లిన వాళ్ళు ఎవరో తెలియదని, ఎదో ఒక శక్తి నన్ను కాపాడింది చెప్పుకొచ్చింది.

ఇది ఇలా ఉండగా ఇండియన్ 2 చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాత శంకర్ బ్రాండ్ ఇమేజ్ బాగా పడిపోయింది. అయినప్పటికీ ఆయన ‘ఇండియన్ 3′ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. త్వరలోనే ఈ సినిమా కి సంబంధించిన షూటింగ్ మొదలు కాబోతుందని, ఈమధ్యనే ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఫ్లాప్ అయిన సినిమాకు సీక్వెల్ తీయడం అనేది బహుశా ఇండియన్ సినిమా హిస్టరీ లో ఇదే తొలిసారి అయ్యుంటుందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఇండియన్ 3 సినిమా స్టోరీ చాలా సాలిడ్ గా ఉంటుందని , కచ్చితంగా ఈ చిత్రం అందరి అంచనాలను తారుమారు చేస్తుందని, శంకర్ కం బ్యాక్ ఈ చిత్రం తోనే ఉంటుందని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper