Union bank home loan: సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలని.. లేదంటే ఇప్పటికే నిర్మించిన ఇంటిని కొనుగోలు చేయాలని చాలామంది కలలు కంటూ ఉంటారు. అయితే పెరుగుతున్న నిర్మాణ వ్యయం.. భూముల ధరలు.. ఇంటి కొనుగోలు ఖర్చుల కారణంగా చాలామంది హోమ్ లోన్ మీద ఆధారపడుతున్నారు. ఇలాంటి వారికి ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలు ఒక ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి.
వడ్డీ రేట్లు ఎంత
యూనియన్ బ్యాంకు లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు 7.15 శాతం నుంచి ప్రారంభమవుతున్నట్టు తెలుస్తోంది. రుణ గ్రహీత సిబిల్ స్కోర్, ఆదాయం, లోన్ మొత్తం, ఉద్యోగం వంటి అంశాలు ఆధారంగా వడ్డీ రేటు మారుతూ ఉంటుంది. రుణం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు కచ్చితంగా వడ్డీ రేటు గురించి నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది.
సిబిల్ స్కోర్ అత్యుత్తమం
హోమ్ లోన్ తీసుకున్న సమయంలో క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం. సిబిల్ స్కోర్ ఉన్నవారికి తక్కువ వడ్డీ రేటు లభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 800 కు పైగా స్కోర్ ఉండటం ప్రయోజనకరంగా ఉంటుంది.
యూనియన్ బ్యాంక్ హోమ్ లోన్ ప్రత్యేకతలు
- ఇంటి కొనుగోలు, నిర్మాణం కోసం రుణ సదుపాయం
- అర్హతను బట్టి టాప్ అప్ లోన్ పొందే అవకాశం
- ముందస్తు చెల్లింపు పై ప్రీ పేమెంట్ పెనాల్టీ ఉండదు
- అర్హత కలిగిన రుణ గ్రహీతలకు ఆదాయపు పన్ను ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది
ఏ డాక్యుమెంట్లు అవసరం
ఆధార్ కార్డు.. పాన్ కార్డు.. చిరునామా రుజువు.. జీతం స్లిప్పులు.. వ్యాపార ఆదాయ వివరాలు.. బ్యాంకు స్టేట్మెంట్లు.. ఇంటికి సంబంధించిన ఆస్తి పత్రాలు అవసరమవుతాయి. బ్యాంకు లీగల్ అధికారిని సంప్రదిస్తే ఎలాంటి ధ్రువపత్రాలు కావాలో అయన చెబుతారు. ఆయన చెప్పిన పత్రాలను బ్యాంకులో సమర్పిస్తే వెంటనే రుణం మంజూరు చేస్తారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి
యూనియన్ బ్యాంక్ శాకం సంప్రదించి లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైటు లో ఫ్రీక్వెన్సీ ఆస్కింగ్ క్వశ్చన్ లు కూడా అడగవచ్చు. సొంత ఇంటి కాలను నెరవేర్చుకోవాలి అనుకునే వారికి యూనిట్ బ్యాంకు హోమ్ లోన్ ఒక అత్యుత్తమమైన అవకాశం. అయితే లోన్ తీసుకునే ముందు వడ్డీ రేటు.. ప్రాసెసింగ్ ఫీజు.. ఈఎంఐ.. తిరిగి చెల్లించే కాలపరిమితిని తప్పనిసరిగా పోల్చి చూడాలి.