Bigg Boss 10 Telugu: ఈ వారం బిగ్ బాస్ హౌస్ లోకి పాత కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చి, ప్రస్తుత హౌస్ మేట్స్ తో ఆసక్తికరమైన గేమ్స్ ఆడుతున్నారు. ఇప్పటి వరకు ఇమ్మానుయేల్, సంజన, కళ్యాణ్, దివ్య నిఖిత, రీతూ చౌదరి, డిమోన్ పవన్, టేస్టీ తేజ, శోభా శెట్టి వంటి వారు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి గేమ్స్ ఆడారు. నేడు సన్నీ, సిరి మరియు నిఖిల్, పృథ్వి రాజ్ లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ అనే సంగతి తెలిసిందే. సన్నీ సీజన్ 5 టైటిల్ విన్నర్. వీళ్ళిద్దరిలో నేడు ఎవరు బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి అయితే అందరి చూపు నిఖిల్ పైనే ఉంది. ఆయనతో ఎవరితో జత కలిపి ఆడుతాడు?, ఎవరికీ వ్యతిరేకంగా ఆడుతాడు అనేది చూడాలి.
ఇకపోతే కాసేపటి క్రితమే నిఖిల్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రోమో ని విడుదల చేశారు. ఈ ప్రోమో లో నిఖిల్ గేమ్ ని చాలా ఆసక్తికరంగా మార్చేశాడు. మీలో ఎవరో ఇద్దరు మాత్రమే మాతో కెప్టెన్సీ కంటెండర్ టాస్కులు ఆడగలరు. అది ఎవరో మీరే చర్చించుకొని నిర్ణయం తీసుకోండి, మీ కోసం ఎదురు చూస్తుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. నరేష్ , దేబ్జాని ల కోసం నేను త్యాగం చేస్తాను అంటూ ముందుకొచ్చాడు. ఆ తర్వాత వర్షిణి , ముకేశ్ లలో ఎవరు త్యాగం చేస్తారు అనేది తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు ఆగాల్సిందే. నిఖిల్ తో పాటు పృథ్విరాజ్ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. వీళ్లిద్దరు సీజన్ 8 లో ఎంతటి పవర్ ఫుల్ కంటెస్టెంట్స్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీళ్లిద్దరు కలిసి గేమ్ ఆడితే , వీళ్ళను ఓడించే వాళ్ళు ఎవ్వరు ఉండరు అనే రేంజ్ కంటెస్టెంట్స్. అలాంటి కంటెస్టెంట్స్ కి ఎవరు టఫ్ ఫైట్ ఇస్తారో చూడాలి.