Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 10 Trigun : త్రిగున్ కి 'బిగ్ బాస్ 10' టీం...

Bigg Boss Telugu 10 Trigun : త్రిగున్ కి ‘బిగ్ బాస్ 10’ టీం మరో బంపర్ ఆఫర్..ఇక ఆ కంటెస్టెంట్స్ పరిస్థితి ఏంటో!

Bigg Boss Telugu 10 Trigun : ఈ సీజన్ ‘బిగ్ బాస్’ టీం ముద్దు బిడ్డగా పిలవబడే త్రిగున్ , ఇక టైటిల్ విన్నర్ అవుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిన్న బిగ్ బాస్ హౌస్ నుండి రోహిత్ ఎలిమినేట్ అవ్వడం తో , అతని తర్వాత అత్యధిక ఓట్లు సంపాదిస్తున్న త్రిగున్ కి టైటిల్ విన్నింగ్ మార్గం తేలిక అయ్యిందని అంటున్నారు విశ్లేషకులు. అంతే కాకుండా ఈ వారం ఆయన ‘అల్టిమేట్ గోట్ ‘ […]

Bigg Boss Telugu 10 Trigun : ఈ సీజన్ ‘బిగ్ బాస్’ టీం ముద్దు బిడ్డగా పిలవబడే త్రిగున్ , ఇక టైటిల్ విన్నర్ అవుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిన్న బిగ్ బాస్ హౌస్ నుండి రోహిత్ ఎలిమినేట్ అవ్వడం తో , అతని తర్వాత అత్యధిక ఓట్లు సంపాదిస్తున్న త్రిగున్ కి టైటిల్ విన్నింగ్ మార్గం తేలిక అయ్యిందని అంటున్నారు విశ్లేషకులు. అంతే కాకుండా ఈ వారం ఆయన ‘అల్టిమేట్ గోట్ ‘ గా నిలవడంతో నాగార్జున బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇతను ‘అల్టిమేట్ గోట్’ గా ఎంతటి అన్యాయమైన గేమ్ ఆడి గెలిచాడో , ఆడియన్స్ అందరూ కళ్లారా చూసారు. అతనికంటే అద్భుతంగా ఆడిన ముకేశ్ ని అభినందిస్తాడని అనుకుంటే, అతన్ని కాకుండా త్రిగున్ ని అభినందించారు. మళ్లీ బోనస్ గా నాగార్జున స్పెషల్ గిఫ్ట్ ఒకటి.

ఇంతకీ ఆయనకు వచ్చిన గిఫ్ట్ ఏమిటంటే , ఈయన్నీ కన్ఫెషన్ రోమ్ కి పిలిచి , ఇతని గురించి తప్పుగా మాట్లాడుకుంటున్న కంటెస్టెంట్స్ వీడియోలను చూపించి , రేపటి నుండి ఎలా రెచ్చిపోతావో నీ ఇష్టం అన్నట్టుగా , త్రిగున్ ని రెచ్చగొట్టి లోపలకు పంపారు. ఏమి లేని సమయం లోనే కుట్రలు , కుతంత్రాలు చేసి , హౌస్ లో అగ్ని పుట్టించే త్రిగున్ కి , ఇలాంటి ఛాన్స్ ఇస్తే ఊరుకుంటాడా చెప్పండి. రేపటి నుండి హౌస్ లో ఆయన ఎలా రెచ్చిపోతాడో చూడాలి. అయితే త్రిగున్ చేసే పనులే ఇవి. హౌస్ లోకి వచ్చిన మొదటి రోజు నుండి , మొన్నటి వరకు ఇతర కంటెస్టెంట్స్ ని ఎలా తొక్కి పైకి రావాలి, వాళ్ళ ఎమోషన్స్ తో ఎలా ఆదుకోవాలి అనేదానిపైనే త్రిగున్ గేమ్ సాగింది. దాన్ని బిగ్ బాస్ టీం , హోస్ట్ నాగార్జున సమర్థిస్తూ రావడం తో త్రిగున్ ఇంకా రెచ్చిపోయాడు.

ఇలా బిగ్ బాస్ టీం ఒక కంటెస్టెంట్ కి పూర్తిగా సరెండర్ అయిపోయి, అతని గెలుపు కోసమే కష్టపడి పని చేయడం ఎప్పుడూ జరగలేదు. మొట్టమొదటిసారి ఈ సీజన్ లోనే జరిగింది. దీంతో ఆడియన్స్ కి కూడా ఈ సీజన్ పై ఆసక్తి బాగా తగ్గిపోయింది. గత రెండు వారాల నుండి టీఆర్ఫీ రేటింగ్స్ భారీ రేంజ్ లో పడిపోయాయి. ఇక రాబోయే రోజుల్లో ఏ రేంజ్ లో పడిపోతుందో చూడాలి. షో అయితే జనాల ఇష్టానికి తగ్గట్టుగా నడవడం లేదు. ఆడియన్స్ ఓటింగ్ కి ఇసుమంత గౌరవం కూడా ఇవ్వడం లేదు. ‘అగ్ని పరీక్ష 2’ కంటెస్టెంట్స్ అందరినీ హౌస్ మేట్స్ ఓట్లతోనే ఎలిమినేట్ చేశారు. దీంతో వచ్చే ఏడాది నుండి ‘అగ్ని పరీక్ష’ షోకి వచ్చేందుకు కూడా ఆడియన్స్ ఆసక్తి చూపించరు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper