Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ప్రేమ జంటల లిస్ట్ తీస్తే మన అందరికీ గుర్తుకు వచ్చే పేర్లు ముకేష్, వర్షిణి. వీళ్లిద్దరు హౌస్ లో చేసుకున్న రొమాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీళ్ళు కేవలం కంటెంట్ కోసం చేస్తున్నారు, వీళ్ళ రిలేషన్ లో ఎలాంటి నిజం లేదని అందరూ అనుకున్నారు. కానీ ఒక సెక్షన్ ఆడియన్స్ మాత్రం వీళ్ళ మధ్య ఉన్నది నిజమైన ప్రేమనే అని నమ్మారు. అలా నమ్మిన వాళ్లకు దిమ్మ తిరిగే రేంజ్ లో సమాధానం ఇచ్చింది వర్షిణి. నిన్నటి ఎపిసోడ్ లో రామ కృష్ణ తో వర్షిణి మాట్లాడుతూ, నేను, ముకేశ్ అన్నా చెల్లెలు లాగా ఉంటాము కదా, మా ఇద్దరికీ పోలికలు కూడా మ్యాచ్ అయ్యాయి అని అంటుంది. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. నెటిజెన్స్ వర్షిణి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. షో చివరి దశకు వచ్చేసింది, ఇక వర్షిణి లవ్ కంటెంట్ ని బ్రేక్ చేసే పనిలో పడింది అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ఇకపోతే ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ లిస్ట్ లో వర్షిణి కూడా ఉంది. కచ్చితంగా ఈ వారం ఆమెనే ఎలిమినేట్ చెయ్యాలి. కానీ బిగ్ బాస్ టీం మొదటి నుండి ఆమెకు చాలా సానుకూలంగా ఉంటూ వస్తోంది. ఎన్నోసార్లు ఎలిమినేట్ అయ్యే సందర్భాలు వచ్చినా బిగ్ బాస్ టీం వాటిని తప్పించి వర్షిణి ని సేవ్ చేస్తూ వచ్చాయి. మరి ఈ వారం కూడా అలాగే చేస్తుందా లేదా ఆమెని ఎలిమినేట్ చేసి పంపిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ వారం కూడా ఆమెని ఎలిమినేట్ చేయకపోతే బిగ్ బాస్ రియాలిటీ షో పై ఆడియన్స్ లో ఉన్న కాస్త పాజిటివ్ ఫీలింగ్ కూడా పోతుంది. దీని ప్రభావం తదుపరి సీజన్స్ పైన కూడా పడొచ్చని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.