Homeబిజినెస్2027 Suzuki across first look: ఎస్ యూవీ లన్నింటిని పడుకోబెట్టే మోడల్ ఇది.. డిజైన్,...

2027 Suzuki across first look: ఎస్ యూవీ లన్నింటిని పడుకోబెట్టే మోడల్ ఇది.. డిజైన్, ఇంటీరియర్, ఫీచర్లు మైండ్ బ్లాంక్.

2027 Suzuki across first look: ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్ యూవీ లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. వి నేపథ్యంలో ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ సుజుకి తన కొత్త 2027 across SUV తో అందరి దృష్టి ఆకర్షిస్తున్నది. ఇప్పటివరకు ఉన్న మోడల్స్ మొత్తాన్ని పడుకోబెట్టే విధంగా కొత్త మోడల్ కారును సుజుకి రూపొందించింది.ఎస్ యూవీ మార్కెట్ లో తిరుగులేనివాటాను సొంతం చేసుకోవడానికి సుజుకి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మోడల్ విషయంలో సుజుకి […]

2027 Suzuki across first look: ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్ యూవీ లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. వి నేపథ్యంలో ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ సుజుకి తన కొత్త 2027 across SUV తో అందరి దృష్టి ఆకర్షిస్తున్నది. ఇప్పటివరకు ఉన్న మోడల్స్ మొత్తాన్ని పడుకోబెట్టే విధంగా కొత్త మోడల్ కారును సుజుకి రూపొందించింది.ఎస్ యూవీ మార్కెట్ లో తిరుగులేనివాటాను సొంతం చేసుకోవడానికి సుజుకి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మోడల్ విషయంలో సుజుకి ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. పైగా డిజైన్, ఇంటీరియర్, లుక్ విషయంలో నెవర్ బిఫోర్ అన్నట్టుగా సుజుకీ ఈ మోడల్ రూపొందించినట్టు ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు.

అద్భుతమైన ఎక్స్ టీరియర్ డిజైన్

2027 సుజుకి across మందు భాగంలో పదునైన LED హెడ్ ల్యాంప్స్, ప్రత్యేకమైన గ్రిల్ డిజైన్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. వెడల్పుగా ఉండే బాడీ.. బలమైన వీల్ ఆర్చ్ లు, బ్లాక్ క్లాడింగ్ SUV రగ్ డ్ లుక్ అందిస్తోంది. వెనుకవైపు ఎల్ ఈ టైల్ ల్యాంప్స్, స్టైలిష్ బంపర్ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అల్లాయ్ వీల్స్.. రూఫ్ రైల్స్ కూడా దీనికి స్పోర్ట్ లుక్ తీసుకొస్తున్నాయి.

లగ్జరీ ఇంటీరియర్.. డిజిటల్ అనుభూతి

కారు లోపలికి వెళ్తే ప్రీమియం అనుభూతి కలుగుతుంది. ఇందులో 12.3 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12.9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫో టైం మెంట్ సిస్టం ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ.. వైర్లెస్ చార్జింగ్.. హెడ్ అప్ డిస్ప్లే వంటి ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. పవర్ అడ్జస్టబుల్ సీట్లు.. హీటేడ్ ఫ్రంట్ సీట్లు ఈ మోడల్ కారుకు సరికొత్త రూపాన్ని తీసుకొస్తున్నాయి.

భద్రతకు పెద్దపీట

ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేని కీపింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి అద్భుతమైన భద్రత ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ప్లగ్ ఇన్ హైబ్రిడ్ పవర్ ట్రెయిన్

కొత్తదరం ఎకరాసులో 2.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పాటు ఎలక్ట్రిక్ మోటార్లు, 22.7 KWh బ్యాటరీ తో కూడిన ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఆల్ వీల్ డ్రై వ్యవస్థ కూడా ఇందులో ప్రత్యేకంగా ఉంది. మొత్తంగా 2027 సుజికి ఎక్రాస్ డిజైన్, పనితీరు కలయికతో ప్రీమియం ఎస్ యూవీ విభాగంలో ఆకట్టుకునే మోడల్ మాదిరిగా నిలుస్తోంది. అయితే మన దేశంలో దీని విడుదల మీద ఇంకా అధికారికంగా క్లారిటీ రాలేదు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper