Balakrishna: బాలకృష్ణ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా చేసిన సినిమా ఏంటో తెలుసా?

ఎన్ని జనరేషన్ లు మారినా ఈ సినిమాలను నచ్చని ప్రేక్షకులు లేరు. అలాంటి సంచలనాత్మక చిత్రాలు బాలయ్య కెరీర్ లో చాలా ఉన్నాయి. ఫ్యాక్షన్ జానర్ చిత్రాలను టాలీవుడ్ కి పరిచయం చేసిన హీరో బాలయ్య బాబునే.

  • Written By: Suresh
  • Published On:
Balakrishna: బాలకృష్ణ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా చేసిన సినిమా ఏంటో తెలుసా?

Follow us on

Balakrishna: సినిమా హీరోలందరికి ఒక్కో విధంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అందులో సీనియర్స్ కూడా మరో రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. ఇక అందరిలో కలిపి బాలకృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీనియర్ ఎన్టీఆర్ కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ప్రత్యేకమైన మార్క్ వేసుకున్నారు బాలయ్య. ఈ క్రేజ్ ను మొదటి సినిమా నుంచే సంపాదిస్తూ వస్తున్నాడు. ఇలా మాస్ ఇమేజ్ ను కూడా పొందాడు బాలయ్య. కేవలం మాస్ సినిమాలు మాత్రమే కాదు ఆదిత్య 369, భైరవ ద్వీపం వంటి ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులు అందించిన ఘనత కూడా బాలయ్యకు దక్కింది.

ఎన్ని జనరేషన్ లు మారినా ఈ సినిమాలను నచ్చని ప్రేక్షకులు లేరు. అలాంటి సంచలనాత్మక చిత్రాలు బాలయ్య కెరీర్ లో చాలా ఉన్నాయి. ఫ్యాక్షన్ జానర్ చిత్రాలను టాలీవుడ్ కి పరిచయం చేసిన హీరో బాలయ్య బాబునే. ఈయన పరిచయం చేసిన తర్వాత ఈ జానర్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అలా ఎన్నో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ అందించిన బాలయ్య బాబు అప్పట్లో మెగాస్టార్ చిరంజీవితో సమానంగా రెమ్యూనరేషన్ అందుకునేవాడు. ఇలా హిట్ లు, డిఫరెంట్ సినిమాలు చేస్తున్న బాలయ్య బాబు తో సినిమాలు చేయడానికి క్యూ కట్టే వారు దర్శక నిర్మాతలు.

ఆ రోజుల్లో బాలయ్య బాబు ఎంత బిజీగా ఉండేవారంటే.. ఒకే రోజు రెండు సినిమాలను విడుదల చేసేంత బిజీగా ఉండేదట ఆయన క్యాలెండర్. అప్పట్లో ఈ స్టార్ హీరో ఫ్లాప్ సినిమాలకు పూర్తి స్థాయి రెమ్యూనరేషన్ తీసుకునేవారు కాదట. అలాగే నా అనుకున్న వారి దగ్గర అసలు పైసా రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా నటించిన సినిమాలు కూడా ఉన్నాయి. మంచు మనోజ్ హీరోగా నటించిన ఊ కొడతావా ఉలిక్కి పడుతావా అనే సినిమాలో బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషించారు. దీనికోసం ఒక్క రూపాయి కూడా అందుకోలేదు బాలకృష్ణ.

మోహన్ బాబు మీద గౌరవంతో బాలకృష్ణ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని మంచు లక్ష్మీ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఇస్తామని తెలిపినా కూడా వద్దన్నారట. మంచు కుటుంబంతో ఉన్న సంబంధం వల్ల రెమ్యూనరేషన్ వద్దన్నారని గతంలోనే లక్ష్మీ పేర్కొంది. ఇలా ఆయన ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుసుకోకుండా సినిమాలు చేసేవారు. ఫ్లాప్ అయితే కాస్త తగ్గించి మరీ తీసుకునేవారు. అంత గొప్ప మనుసు, మంచి నటనతో ఈ రోజుకు ఇండస్ట్రీని ఏలుతున్నారు బాలయ్య.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు