Chiranjeevi: కష్టపడకుండా రీరికార్డింగులా… చిరంజీవి కామెంట్స్ ఆ స్టార్ హీరోని ఉద్దేశించేనా?

తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… చక్కగా సెట్ కి వెళ్లి మేకప్ వేసుకుని, కష్టపడకుండా నడిచి వస్తుంటే రీరికార్డింగ్ తో ఎలివేట్ చేస్తారులే అనుకుని. డబ్బులు తీసుకుని జేబులో పెట్టుకునే టైప్ కాదు నేను.

  • Written By: Shiva
  • Published On:
Chiranjeevi: కష్టపడకుండా రీరికార్డింగులా… చిరంజీవి కామెంట్స్ ఆ స్టార్ హీరోని ఉద్దేశించేనా?

Follow us on

Chiranjeevi: ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి చేసిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి. ఆ స్టార్ హీరోపై పరోక్షంగా సెటైర్స్ వేశారన్న మాట వినిపిస్తోంది. భోళా శంకర్ ఫెయిల్యూర్ నేపథ్యంలో చిరంజీవి విమర్శలు ఎదుర్కొన్నారు. చివరికి ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ఆయనకు సలహాలు ఇచ్చారు. ఇంకా యంగ్ హీరోయిన్స్ తో డాన్సులు, ఫైట్స్ ఏమిటీ? వయసుకు దగ్గ పాత్రలు చేయండి అంటూ సూచనలు ఇచ్చారు. ఇందుకు రజినీకాంత్, కమల్ హాసన్ వంటి హీరోలను ఉదాహరణగా చూపారు.

గత ఏడాది విక్రమ్ తో కమల్ హాసన్, ఇటీవల జైలర్ తో రజినీకాంత్ భారీ విజయాలు సాధించిన నేపథ్యంలో చిరంజీవి భోళా శంకర్ వంటి రీమేక్స్ ఎంచుకోవడం సరికాదని వారి వాదన. ఇండియా వైడ్ తిరుగులేని స్టార్డం అనుభవించిన చిరంజీవి దృష్టి కోణం వేరేలా ఉంది. చిరంజీవి అంటే ముందుగా గుర్తొచ్చేది డాన్స్. ఆ గ్రేస్ మరొక హీరోలో ఉండదని నమ్మకం. ఈ విషయంలో టాలీవుడ్ కి ట్రెండ్ సెట్టర్. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా చిరంజీవి సినిమా అంటే పాటలు, ఫైట్స్ ఉండాల్సిందేనని ఆయన భావిస్తున్నారు.

తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… చక్కగా సెట్ కి వెళ్లి మేకప్ వేసుకుని, కష్టపడకుండా నడిచి వస్తుంటే రీరికార్డింగ్ తో ఎలివేట్ చేస్తారులే అనుకుని. డబ్బులు తీసుకుని జేబులో పెట్టుకునే టైప్ కాదు నేను. హీరో అంటే ఆడాలి, పాడాలి, సొంతగా ఫైట్స్ చేయాలి. ఒళ్ళు హూనం చేసుకోవాలి. అప్పుడే ఆడియన్స్ కి , నిర్మాతలకు, దర్శకులకు, నాకు సంతృప్తి. అప్పుడే ప్రేక్షకులు ఆదరిస్తారు.. అన్నారు.

ఈ మాటలు రజినీకాంత్ ని ఉద్దేశించి చిరంజీవి చేశారంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఆరు వందల కోట్లకు పైగా వసూలు చేసిన జైలర్ మూవీలో చెప్పాలంటే మేటర్ లేదు. రజినీకాంత్ పై వచ్చే ఎలివేషన్ సీన్స్ తో సాగుతుంది. అనిరుధ్ బీజీఎమ్ సినిమాకు ప్లస్ అయ్యింది. ఈ విషయాన్ని రజినీకాంత్ కూడా ఒప్పుకున్నారు. రీరికార్డింగ్ కి ముందు జైలర్ చూసి అంత గొప్ప సినిమా కాదనుకున్నాను అన్నారు. ఈ మూవీలో రజినీకాంత్ చాలా సన్నివేశాల్లో ఒళ్ళు కదలకుండా నటించారు. కాబట్టి చిరంజీవి రజినీకాంత్ ని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారని వినికిడి.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు