Bigg Boss 7: బిగ్ బాస్ లోకి వివాదాస్పద నటి కూతురు ఎంట్రీ? అసలు ఎవరీమే.. బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

Bigg Boss 7: ఎన్నో భాషల్లో ప్రేక్షకులను అలరిస్తూ..ప్రేక్షకుల మదిలో నిలుస్తున్న షో బిగ్ బాస్. హిందీలో ఎప్పటి నుంచో ప్రసారం అవుతున్న ఈ షో ఇప్పుడు 7వ సీజన్ తెలుగులో ప్రసారం అవుతుంది. తెలుగులో ఇప్పటికే ఈ షో నాలుగు వారాలు పూర్తి చేసుకోగా, తమిళంలో 7వ బిగ్‌బాస్ సీజన్ అక్టోబర్ 1వ తేదీన ప్రారంభమైంది. అక్కడ కూడా మంచి రెస్పాన్స్ తో దూసుకొని పోతుంది. లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ హొస్ట్‌గా గ్రాండ్‌గా లాంచ్ […]

  • Written By: Neelambaram
  • Published On:
Bigg Boss 7: బిగ్ బాస్ లోకి  వివాదాస్పద నటి కూతురు ఎంట్రీ? అసలు ఎవరీమే.. బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

Follow us on

Bigg Boss 7: ఎన్నో భాషల్లో ప్రేక్షకులను అలరిస్తూ..ప్రేక్షకుల మదిలో నిలుస్తున్న షో బిగ్ బాస్. హిందీలో ఎప్పటి నుంచో ప్రసారం అవుతున్న ఈ షో ఇప్పుడు 7వ సీజన్ తెలుగులో ప్రసారం అవుతుంది. తెలుగులో ఇప్పటికే ఈ షో నాలుగు వారాలు పూర్తి చేసుకోగా, తమిళంలో 7వ బిగ్‌బాస్ సీజన్ అక్టోబర్ 1వ తేదీన ప్రారంభమైంది. అక్కడ కూడా మంచి రెస్పాన్స్ తో దూసుకొని పోతుంది. లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ హొస్ట్‌గా గ్రాండ్‌గా లాంచ్ చేశారు. మరి మన తెలుగు బిగ్ బాస్ గురించి ఎన్న వివరాలు తెలుస్తుంటాయి. అయితే తమిళ్ లో ప్రసారం అవుతున్న ఈ సీజన్ లో సెలబ్రెటీలు ఎవరు? హోస్ట్ ఎవరు? రెస్పాన్స్ వస్తుందో కూడా ఓ సారి చూసేద్దాం…

అయితే తమిళ్ లో మాత్రం చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు మేకర్స్. సీనియర్లు, జూనియర్ల మేళవింపుతో ఇంటిని ఆకర్షణీయంగా మార్చారు. ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు రెండు హౌజ్ లను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. దీంతో హౌజ్ మేట్స్ మాత్రమే కాదు ప్రేక్షకులు కూడా అలరించారు. ఈ రెండు హౌజ్‌లను ఏర్పాటు చేయడం వెనుక ట్వీస్ట్ ఏమిటో సీక్రెట్‌గా ఉంచారు. ఇక బిగ్‌బాస్ తమిళ్ ఇంటిలోకి వచ్చిన కంటెస్టెంట్లలో జోవిక విజయ్ కుమార్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఈమె ఎంతో మందికి తెలిసిందే. కానీ ఈమె రావడంతో మరింత ఆసక్తి కనబరుస్తున్నారు అభిమానులు.

సినీ నటి, యూట్యూబర్, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ వనితా విజయ్ కుమార్ కూతురు జోవిక. జోవిక సోషల్ మీడియాలో టాప్ ఇన్‌ఫ్లూయెన్సర్. తన తల్లి నడిపే వంటల యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తుంటారు. వంటల తయారీ వీడియోలను ప్రొడ్యూస్ చేస్తుంటారు. మొత్తం మీద తల్లి అడుగుజాడల్లో నడుస్తూనే బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 7 లోకి అడుగుపెట్టిన జోవిక విజయ్ కుమార్ ఎమోషనల్ అయ్యారు. అయితే తను ఇంట్లోకి వచ్చినప్పుడు అమ్మ పక్కనే ఉందనే ఫీలింగ్ తో వచ్చిందట. అంతేకాదు మానసికంగా తన తల్లి తనకు ఇంటిలో తోడుగా ఉంటుందని..అదే తల్లి తోడుతో గేమ్ ఆడి ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకుంటాను అంటూ తెలిపింది ఈ అమ్మడు. ఇక ఈమె చెన్నైలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. మోడల్‌గా కెరీర్ ఆరంభించిన తర్వాత సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. అలాంటి అమ్మడు వంట ప్రోగ్రామ్ లతో ఫుల్ పాపులర్ అయింది. ఇప్పుడు ఇదే ఫ్యాన్ ఫాలోయింగ్ తో సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. ఇదిలా ఉండగా,ఈ సీజన్ 7 షో 100 రోజులపాటు కొనసాగనున్నది. ఈ షోను టెలివిజన్‌లో విజయ్ టీవీ, ఓటీటీలో డిస్నీ+హాట్ స్టార్ లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనున్నది. ప్రతీ రోజు షోలో హైలెట్స్‌ను రాత్రి 9.30 గంటల నుంచి గంటపాటు విజయ్ టీవీ ప్రసారం చేయనున్నది. శనివారం, ఆదివారం 9 గంటల నుంచి విజయ్ టీవీ ప్రసారం చేస్తుంది.

అయితే తెలుగు, హిందీ, తమిళ్ లో చూసే ప్రేక్షకులు మాత్రం మూడు షోలను పోలుస్తూ.. కాస్త డిఫరెంట్ గా ఆలోచించి తమిళ్ లో రెండు ఇల్లులు వేరువేరుగా కంటెస్టెంట్ లను పెట్టి ఏదో ఇంట్రెస్టింగ్ ను క్రియేట్ చేయబోతున్నారని అనుకుంటున్నారు. ఉల్టా ఫుల్టా అంటూ పెద్దగా లాభం లేదని.. కానీ తమిళ్ మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి చూడాలి అన్ని భాషల్లో కలిపి ఏ భాషలోని షోకు ఎక్కువ టీఆర్పీ రేటింగ్ వస్తుందో….

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు